11-03-2025 మంగళవారం రాశిఫలాలు - మీ సాయంతో ఒకరికి మేలు...

రామన్

మంగళవారం, 11 మార్చి 2025 (04:00 IST)
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
సంప్రదింపులు సాగవు. ఆలోచనలతో సతమతమవుతారు. ఖర్చులు విపరీతం. పనులు హడావుడిగా సాగుతాయి. ముఖ్యుల కలయిక వీలుపడదు. కీలక పత్రాలు అందుకుంటారు. సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. శుభకార్యానికి హాజరవుతారు.
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
సన్నిహితుల వ్యాఖ్యలు మీపై సత్ప్రభావం చూపుతాయి. పట్టుదలతో యత్నాలు సాగిస్తారు. ఖర్చులు సామాన్యం. కొంతమొత్తం పొదుపు చేస్తారు. చేసిన పనులే తిరిగి చేయవలసి వస్తుంది. దంపతుల మధ్య అకారణ కలహం. ఏకాగ్రతతో వాహనం నడపండి.
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
వ్యూహాత్మకంగా అడుగులేస్తారు. ఆప్తులతో కాలక్షేపం చేస్తారు. రావలసిన ధనం అందుతుంది. విలాసాలకు ఖర్చుచేస్తారు. పనులు మందకొడిగా సాగుతాయి. మీ చొరవతో ఒకరికి మంచి జరుగుతుంది. గృహమరమ్మతులు చేపడతాను. బాధ్యతలు అప్పగించవద్దు.
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
లావాదేవీలతో తీరిక ఉండదు. పనిభారం, అకాల భోజనం. చిన్న విషయానికే చికాకుపడతారు. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. ఖర్చులు అధికం. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. ఒక ఆహ్వానం ఆలోచింపచేస్తుంది. దంపతులు ఏకాభిప్రాయానికి రాగల్గుతారు. 
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
సంప్రదింపులు వాయిదా పడతాయి. ఆలోచనలతో సతమతమవుతారు. బంధువులతో విభేదాలు, దంపతుల మధ్య అకారణ కహం. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. కొత్త వ్యక్తులతో జాగ్రత్త. ఆత్మీయులతో సంభాషిస్తారు. వేడుకల్లో అత్యుత్సాహం తగదు. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
కీలక విషయాలపై పట్టు సాధిస్తారు. మాటతీరు ఎదుటివారిని ఆకట్టుకుంటుంది. పరిచయాలు ఉన్నతికి దోహదపడతాయి. సభ్యత్వాలు, బాధ్యతలు స్వీకరిస్తారు. దుబారా ఖర్చులు విపరీతం. చేపట్టిన పనులు హడావుడిగా సాగుతాయి. నగదు డ్రా చేసేటపుడు జాగ్రత్త. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆర్భాటాలకు విపరీతంగా ఖర్చు చేస్తారు. కొత్త పనులు చేపడతారు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. పత్రాల్లో సవరణలు అనుకూలిస్తాయి. గృహనిర్మాణాలకు ఆమోదం లభిస్తుంది. పుణ్యక్షేత్రం సందర్శిస్తారు. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
రావలసిన ధనం అందుతుంది. రోజువారీ ఖర్చులే ఉంటాయి. ఇంటి విషయాల పట్ల శ్రద్ధ వహిస్తారు. పనులు అనుకున్న విధంగా సాగుతాయి. ఉల్లాసంగా గడుపుతారు. ఆహ్వానం అందుకుంటారు. ఆరోగ్యం మందగిస్తుంది. కీలక పత్రాలు అందుకుంటారు. 
 
ధనస్సు: మూల, పూర్వాషాడ 1.2.34 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
ఆర్థికలావాదేవీలు ముగుస్తాయి. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. ఆలోచనలు క్రియారూపం దాల్చుతాయి. వ్యూహాత్మకంగా అడుగులేస్తారు. ప్రముఖులకు సన్నిహితులవుతారు. వ్యవహారాలు మీ చేతుల మీదుగా సాగుతాయి. దూర ప్రయాణం తలపెడతారు. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
సంకల్పం నెరవేరుతుంది. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారు. మీ చిత్తశుద్ధి ఆకట్టుకుంటుంది. ధనలాభం, వాహనసౌఖ్యం ఉన్నాయి. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. ఖర్చులు అదుపులో ఉండవు. నిలిపివేసిన పనులు పూర్తిచేస్తారు. బెట్టింగులకు పాల్పడవద్దు. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
లావాదేవీలతో తీరిక ఉండదు. దుబారా ఖర్చులు విపరీతం. బంధుమిత్రులతో విభేదిస్తారు. పెద్దల వ్యాఖ్యలు మీపై సత్ప్రభావం చూపుతాయి. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. అవకాశాలను తక్షణం అందిపుచ్చుకోండి. ఇంటి విషయాలపై దృష్టిపెడతారు. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
తలపెట్టిన కార్యం విజయవంతమవుతుంది. వ్యాపకాలు సృష్టించుకుంటారు. ఆశలు ఒదిలేసుకున్న ధనం అందుతుంది. కొత్త పరిచయాలేర్పడతాయి. మీ సాయంతో ఒకరికి మేలు జరుగుతుంది. నగదు, ఆభరణాలు జాగ్రత్త. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు