12-08-2023 శనివారం రాశిఫలాలు - రమాసమేత సత్యనారాయణస్వామిని ఆరాధించిన శుభం..

శనివారం, 12 ఆగస్టు 2023 (04:00 IST)
మేషం :- ఆపద సమయంలో బంధువులు అండగా నిలుస్తారు. దూరప్రయాణాల ఏర్పాట్లు ఫలించకపోవచ్చు. మనసులో భయాదోళనలూ అనుమానాలూ ఉన్నా, డాంభికం ప్రదర్శించి పనులు సాఫీగా పూర్తి చేస్తారు. ఖాది, చేనేత, నూలు వస్త్రాల కొనుగోళ్ళు అధికంగా ఉంటాయి. ప్రేమికుల మధ్య అనురాగ వాత్సల్యాలు పెంపొందుతాయి.
 
వృషభం :- మీ వాహనం ఇతరులకిచ్చే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి. కుటుంబీకుల మధ్య పరస్పర అవగాహన లోపం, చికాకులు వంటివి అధికమవుతాయి. బీమా ఏజెంట్లకు, స్థలాల బ్రోకర్లకు చికాకులు తప్పవు. విద్యార్థినుల నిర్లక్ష్యం, ఏకాగ్రత లోపం వల్ల ఒత్తిడి, మందలింపులు అధికమవుతాయి.
 
మిథునం :- విదేశాల్లో ఉంటున్న ఆత్మీయుల క్షేమసమాచారాలు ఊరట కలిగిస్తాయి. మీ యత్నాలకు ప్రముఖుల నుండి సహాయ సహకారాలు అందిస్తారు. మీరు కోరుకుంటున్న అవకాశాలను పొందే సమయం ఆసన్నమవుతుంది. ఇతరుల విషయాలలో అతిగా వ్యవహరించడం వల్ల అభాసుపాలయ్యే ఆస్కారముంది.
 
కర్కాటకం :- స్త్రీలపై చుట్టుప్రక్కల వారి మాటల ప్రభావం అధికంగా ఉంటుంది. ఆదాయ వ్యయాలు సంతృప్తికరంగా ఉంటాయి. ఆర్యోగములో మెళకువ అవసరం. బ్యాంకు పనుల్లో ఏకాగ్రత వహించండి. మీ పట్ల ముభావంగా ఉండే వ్యక్తులు మీ సాన్నిత్యం కోరుకుంటారు. దైవ దర్శనాలలో ఇబ్బందులను ఎదుర్కుంటారు. 
 
సింహం :- సంఘంలో ఆదర్శజీవనం జరుపుతారు. మీ అభిప్రాయాలకు మంచి స్పందన లభిస్తుంది. నిర్మాణ పనుల్లో నాణ్యత లోపం వల్ల కాంట్రాక్టర్లు, బిల్డర్లకు చికాకులు తప్పవు. వ్యాపారాభివృద్ధికి బాగా శ్రమిస్తారు. కుటుంబీకుల ధోరణి చికాకు పరుస్తుంది. దీర్ఘకాలిక సమస్యలకు మంచి పరిష్కారమార్గం గోచరిస్తుంది.
 
కన్య :- అనుకూలతలున్నా మీ యత్నాలు మందకొడిగా సాగుతాయి. పాత మిత్రుల కలయికతో గత విషయాలు జ్ఞప్తికి వస్తాయి. మీరంటే గిట్టని వ్యక్తులు మీకు దగ్గరయ్యేందుకు యత్నిస్తారు. మీ అభిప్రాయాలకు తగిన వ్యక్తితో పరిచయాలేర్పడతాయి. శ్రీవారు, శ్రీమతి గౌరవ ప్రతిష్ఠలకు భంగం కలిగించే పరిణామాలు ఎదుర్కొంటారు.
 
తుల :- మీ సంతానంతో దైవ, సేవా, పుణ్య కార్యక్రమాలలో పాల్గొంటారు. రుణ ఏ కొంతైనా తీర్చలన్న మీ యత్నం ఫలిస్తుంది. ఉత్సాహంగా మీ యత్నాలు కొనసాగించండి. ఉద్యోగస్తులకు కార్యాలయ పనులతో పాటు సొంత పనులు కూడా పూర్తికాగలవు. సొంతంగా వ్యాపారం, సంస్థలు నెలకొల్పాలనే మీ ఆలోచన బలపడుతుంది.
 
వృశ్చికం :- బ్యాంకు డిపాజిట్లు దీర్ఘకాలిక పెట్టుబడులు అనుకూలం. స్త్రీలకు ఆరోగ్య విషయంలో బహు జాగ్రత్త అవసరం. గృహావసరాలకు నిధులు సమకూర్చుకుంటారు. చేపట్టిన పనులు సంతృప్తికరంగా పూర్తి కాగలవు. వ్యాపారాలు, అనవసర వ్యవహారాలకు దూరంగా ఉండటం వల్ల మేలు చేకూరుతుంది.
 
ధనస్సు :- వైద్య శిబిరంలోని వారు తరచూ ఒత్తిడులకు గురవుతారు. నిరుద్యోగులు చిన్న అవకాశాన్నికూడా సద్వినియోగం చేసుకోవడం మంచిది. విరోధులు వేసే పథకాలు తెలివితో త్రిప్పి గొట్టగలుగుతారు. కోర్టు వ్యవహరాలు, భూ వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. మీరు అభిమానించే వ్యక్తి నుంచి ప్రసంసలు పొందుతారు.
 
మకరం :- ఉద్యోగస్తులకు సహోద్యోగుల తీరు అసహనం కలిగిస్తుంది. వాహనం నడుపుతున్నపుడు మెలకువ వహించండి. ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనులు సానుకూలమవుతాయి. మీ ఔదార్యాన్ని కొంతమంది దుర్వినియోగం చేసే అవకాసం ఉంది. జాగ్రత్త వహించండి. ప్రైవేటు సంస్థలలోని వారికి ఒత్తిడి, చికాకులు తప్పవు.
 
కుంభం :- ఆర్థిక లావాదేవీల్లో ఒడిదుడుకులు ఎదురైనా అధిగమిస్తారు. ఇతరుల కుటుంబ విషయాలలో తలదూర్చి సమస్యలు తెచ్చుకోకండి. తరచూ సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. సొంతంగాగాని, భాగస్వామ్యంగా గాని మీరు ఆశించిన విధంగా రాణించలేరు. కొంత మంది ముఖ్యమైన విషయాలలో మిమ్మల్ని సంప్రదిస్తారు.
 
మీనం :- మీ చిన్నారుల కోసం నూతన పథకాలు వేసి జయం పొందగలుగుతారు. ఖర్చులు సామాన్యం. వైవాహిక జీవితంలో అనుకోని చికాకులు తలెత్తుటకు ఆస్కారం ఉంది జాగ్రత్త వహించండి. అనుబంధాలలో మార్పు మీకు ఎంతో ఆశ్చర్యం కలిగిస్తుంది. లిటిగేషన్ వ్యవహారాలలో జాగ్రత్త వహించండి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు