13-03-2024 బుధవారం దినఫలాలు - వ్యవసాయ, తోటల రంగాల్లో వారికి సంతృప్తి...

రామన్

బుధవారం, 13 మార్చి 2024 (04:00 IST)
శ్రీ శోభకృత్ నామ సం|| ఫాల్గుణ శు|| తదియ ఉ.8.37 అశ్వని రా.11.18 రా.వ.7.31 ల 9.02. ప.దు. 11.48 ల 12.34.
 
మేషం :- దైవ సేవా కార్యక్రమాలకు ధనం అధికంగా వెచ్చిస్తారు. వాహనచోదకులకు ఏకాగ్రత ముఖ్యం. మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు కలిసిరాగలదు. స్త్రీలకు వ్యాపకాలు, పరిచయాలు విస్తరిస్తాయి. హోటల్, కేటరింగ్ రంగాల్లోవారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. వృత్తిరీత్యా ప్రముఖులను కలుసుకుంటారు.
 
వృషభం :- కపటంలేని మీ ఆలోచనలు, సలహాలు మీకు అభిమానుల్ని సంపాదించి పెడుతుంది. కళాకారులకు, రచయితలకు పత్రికా రంగాల్లో వారికి కలిసిరాగలదు. స్త్రీలు వాదోపవాదాలకు దిగడం వల్ల సమస్యలను ఎదుర్కొంటారు. కోర్టు వ్యవహారాలు ఒక కొలిక్కి వచ్చే సూచనలున్నాయి. ఆలయాలను సందర్శిస్తారు. 
 
మిథునం :- ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. వ్యవసాయ, తోటల రంగాల్లో వారికి సంతృప్తి, పురోభివృద్ధి. ఉపాధ్యాయులకు, విద్యార్థులకు ఒత్తిడి, ఆందోళనలు అధికంగా ఉంటాయి. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తిగా సాగుతాయి. కంప్యూటర్ రంగాల వారికి చికాకులు తప్పవు.
 
కర్కాటకం :- ఉపాధ్యాయులతో విద్యార్థులు ఏకీభవించలేకపోతారు. రవాణా రంగాలవారికి ఏకాగ్రత అసవరం. బంధువుల రాక అందరికీ సంతోషం కలిగిస్తుంది. మీ శ్రీమతి సలహా పాటించడం శ్రేయస్కరం. ఉద్యోగస్తులు పెండింగ్ పనులు సకాలంలో పూర్తి చేయగల్గుతారు. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. 
 
సింహం :- పాత వస్తువులను కొని ఇబ్బందులను ఎదుర్కొంటారు. దూర ప్రయాణాలలో వస్తువులపట్ల మెళకువ అవసరం. ఖర్చుల విషయంలో ఆచి, తూచి వ్యవహరించండి. గృహ నిర్మాణాలు, మరమ్మతులకు అనుకూలం. రావలసిన ధనం వాయిదా పడుతుంది. కోర్టు వ్యవహరాల్లో ప్లీడర్లు, ప్లీడరు గుమస్తాలకు చికాకులు తప్పవు.
 
కన్య :- బంధువులతో మనస్పర్థలు తలెత్తుతాయి. రచయితలకు, పత్రిక, మీడియా రంగాల్లో వారికి పనిభారం అధికం కాగలదు. మితిమీరిన ఆలోచనలు మీ మనస్సును వ్యాకులపరుస్తాయి. విద్యార్థులకు ధ్యేయంపట్ల ఏకాగ్రత నెలకొంటుంది. కోర్టు వ్యవహారాలలో మెళకువ అవసరం. స్త్రీలు టి.వి., ఛానల్స్ కార్యక్రమాలలో రాణిస్తారు.
 
తుల :- ప్రతి పని చేతిదాకా వచ్చి వెనక్కి పోవుటవలన ఆందోళన పెరుగుతుంది. స్త్రీల అభిప్రాయాలకు మిశ్రమ స్పందన లభిస్తుంది. ఆడిటర్లు, అక్కౌంట్స్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం అధికం. ఇటుక, ఇసుక, సిమెంటు వ్యాపారస్తులకు కలిసివచ్చేకాలం. సోదరీ, సోదరులతో సంబంధ బాంధవ్యాలు బాగుగా ఉంటాయి.
 
వృశ్చికం :- వృత్తి, వ్యాపారాల రీత్యా దూరప్రయాణాలు చేస్తారు. ఆపద సమయంలో మిత్రులు అండగా నిలుస్తారు. కోర్టు వ్యవహరాల్లో ప్లీడర్లు, ప్లీడరు గుమాస్తాలకు ఊహించని చికాకులు ఎదురవుతాయి. అర్థాంతరంగా నిలిపివేసిన పనులు పునఃప్రారంభిస్తారు. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు ఏజంట్లుకు మెళకువ అవసరం.
 
ధనస్సు :- విదేశీయానం కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. దూర ప్రయాణాలలో వస్తువులపట్ల మెళకువ అవసరం. నిరుద్యోగులకు అవకాశాలు కొన్ని తృటిలో తప్పిపోతాయి. కిరణా ఫ్యాన్సీ, నిత్యావసర వస్తు వ్యాపారులకు స్టాకిస్టులకు కలిసిరాగలదు. లాయర్లకు, ఆడిటర్లకు, డాక్టర్లకు ఒత్తిడి అధికమవుతుంది.
 
మకరం :- వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. దంపతుల మధ్య కలహాలు, చికాకులు చోటుచేసుకుంటాయి. పెంపుడు జంతువుల గురించి ఆందోళన చెందుతారు. కొబ్బరి, పండ్లు, పూలు, చల్లనిపానీయ వ్యాపారులకు కలిసివస్తుంది. దైవ సేవాకార్యక్రమాల కోసం ధనం బాగుగా ఖర్చు చేస్తారు.
 
కుంభం :- ఆత్యీయుల రాక ఆనందం కలిగిస్తుంది. విదేశీయాన యత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. రావలసిన బకాయిలు వాయిదా పడతాయి. బంగారు, వెండి ఆభరణాల వ్యాపారులకు ఒత్తిడి పెరుగుతుంది. స్పెక్యులేషన్ రంగాల్లో వారికి లాభదాయకం.
 
మీనం :- గృహోపకరణాలను అమర్చుకుంటారు. సన్నిహితులలో మార్పు మీకెంతో ఆశ్చర్యం కలిగిస్తుంది. రిప్రజెంటేటివ్‌లు తమ టార్గెట్లను సునాయాసంగా అధికమిస్తారు. శతృవులపై విజయం సాధిస్తారు. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాలలో అవపరిచిత వ్యక్తుల పట్ల మెళకువ అవసరం. ఆడిటర్లకు పని ఒత్తిడి, ప్లీడర్లకు నిరుత్సాహం తప్పవు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు