17-08-2025 నుంచి 23-08-2025 వరకు మీ వార రాశిఫలితాల

రామన్

శుక్రవారం, 15 ఆగస్టు 2025 (22:58 IST)
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
సర్వత్రా ప్రోత్సాహకరం. గృహం ప్రశాంతంగా ఉంటుంది. ఖర్చులు అధికం. రుణాలు, చేబదుళ్లు తప్పవు. అవసరాలు అతికష్టంమ్మీద నెరవేరుతాయి. సోమవారం నాడు పనులు, బాధ్యతలు పురమాయించవద్దు. కొందరి నిర్లక్ష్యం ఇబ్బంది కలిగిస్తుంది. ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు. దంపతులు ఏకాభిప్రాయానికి రాగలుగుతారు. ఆలోచనలు క్రియారూపం దాల్చుతాయి. ప్రతికూలతలను అనుకూలంగా మలుచుకుంటారు. పరిచయాలు ఉన్నతికి తోడ్పడతాయి. ముఖ్యమైన పత్రాలు అందుకుంటారు. సంతానానికి శుభయోగం. ఒక వార్త అయిన వారిని సంతోషపరుస్తుంది. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. నూతన పెట్టుబడులకు సమయం కాదు. ఉద్యోగస్తులు అధికారులను మెప్పిస్తారు. ప్రైవేట్ ఉద్యోగస్తులకు మార్పులు అనుకూలిస్తాయి. దైవకార్య సమావేశంలో పాల్గొంటారు. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి. అనుకున్న లక్ష్యం సాధిస్తారు. ఆశలొదిలేసుకున్న ధనం అందుతుంది. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. స్నేహసంబంధాలు బలపడతాయి. ఖర్చులు సామాన్యం. పనులు సావకాశంగా పూర్తి చేస్తారు. బుధవారం నాడు అప్రమత్తంగా ఉండాలి. వాగ్వాదాల జోలికి పోవద్దు. కొన్ని విషయాలు చూసీచూడనట్టు వదిలేయండి. వివాహయత్నం ఫలిస్తుంది. నిశ్చితార్ధంలో జాగ్రత్త. మీ శ్రీమతి అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోండి. ఆరోగ్యం బాగుంటుంది. సన్నిహితులతో తరచుగా సంభాషిస్తారు. పోగొట్టుకున్న వస్తువులు లభ్యమవుతాయి. ఓర్పుతో ఉద్యోగయత్నం సాగించండి. మీ కృషి త్వరలో ఫలిస్తుంది. ఉపాధి పథకాలు చేపడతారు. వ్యాపారాల్లో ఆశించిన లాభాలు గడిస్తారు. వాయిదా పడిన మొక్కులు తీర్చుకుంటారు. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
సంప్రదింపులు ఫలిస్తాయి. వ్యవహార సామర్థ్యంతో రాణిస్తారు. మాటతీరు ఆకట్టుకుంటుంది. విజ్ఞతతో సమస్యలు పరిష్కరించుకుంటారు. అనురాగవాత్సల్యాలు వెల్లివిరుస్తాయి. రాబోయే ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. ధనం మితంగా వ్యయం చేయండి. మంగళవారం నాడు నగదు డ్రా చేసేటపుడు జాగ్రత్త. వాయిదా పడుతూ వస్తున్న పనులు పూర్తి చేస్తారు. సంతానం దూకుడు అదుపు చేయండి. దంపతులు ఏకాభిప్రాయానికి రాగల్గుతారు. స్థిరాస్తి అమర్చుకోవాలనే ఆలోచన బలపడుతుంది. ఆత్మీయులతో సంప్రదింపులు జరుపుతారు. ఆరోగ్యం జాగ్రత్త, ఆహార నియమాలు క్రమం తప్పకుండా పాటించండి. అవివాహితులు శుభవార్త వింటారు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు బాధ్యతల మార్పు. ప్రయాణం ఉల్లాసంగా సాగుతుంది. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
దీర్ఘకాలిక సమస్య తొలగుతుంది. ఆందోళన తగ్గి కుదుటపడతారు. తెగిపోయిన బంధుత్వాలు బలపడతాయి. కొత్త పనులకు ప్రణాళికలు వేసుకుంటారు. ఆదివారం నాడు ఖర్చులు విపరీతం. అవసరాలు వాయిదా వేసుకుంటారు. ముఖ్యమైన చెల్లింపుల్లో జాప్యం తగదు. సంతానం ఉన్నత విద్యాయత్నం ఫలిస్తుంది. కీలక పత్రాలు అందుకుంటారు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు. ఆరోగ్యం జాగ్రత్త, అతిగా శ్రమించవద్దు. మీ చొరవతో శుభకార్యం నిశ్చయమవుతుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. సభ్యత్వాలు, బాధ్యతలు స్వీకరిస్తారు. ఉపాధి పథకాలు సామాన్యంగా సాగుతాయి. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. సరుకు నిల్వలో జాగ్రత్త. వేడుకకు హాజరవుతారు. ఏకాగ్రతతో వాహనం నడపండి. 
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
కార్యసాధననకు ఓర్పు ప్రధానం. కొందరి వ్యాఖ్యలు నిరుత్సాహపరుస్తాయి. ఏ విషయాన్నీ పెద్దగా పట్టించుకోవద్దు. ఆశావహదృక్పధంతో శ్రమించండి. త్వరలో మీ కృషి ఫలిస్తుంది. కొంతమొత్తం ధనం అందుతుంది. ఖర్చులు తగ్గించుకుంటారు. పనులు ప్రారంభంలో ఆటంకాలు ఎదురైనా ఎట్టకేలకు పూర్తికాగలవు. సోమ, మంగళవారాల్లో అనవసర బాధ్యతలు చేపట్టవద్దు, మీ వ్యక్తిత్వానికి భంగం కలుగకుండా మెలగండి. సంతానం విద్యాయత్నం ఫలిస్తుంది. దంపతులకు కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. ఇంటి విషయాలపై దృష్టిపెడతారు. పత్రాల్లో సవరణలు అనివార్యం. నిర్మాణాలు మందకొడిగా సాగుతాయి. బిల్డర్లు, కార్మికులకు నిరాశాజనకం. ఉద్యోగస్తులకు ధనప్రలోభం తగదు. కిట్టని వ్యక్తులు తప్పుదారి పట్టించే ఆస్కారం ఉంది. నూతన వ్యాపారాలకు సన్నాహాలు సాగిస్తారు. ఉమ్మడిగా కంటే సొంత వ్యాపారాలే శ్రేయస్కరం. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
వ్యవహారాల్లో ఒత్తిడికి గురికావద్దు. సావకాశంగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. పెద్దల హితవు మీపై ప్రభావం చూపుతుంది. అనుభవజ్ఞులను సంప్రదిస్తారు. గురువారం నాడు ఖర్చులు విపరీతం. చేతిలో ధనం నిలవదు. ఒక అవసరానికి ఉంచిన ధనం మరోదానికి ఖర్చుచేస్తారు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. అయిన వారు మీ అశక్తతను అర్ధం చేసుకుంటారు. పనులు వేగవంతమవుతాయి. శుభకార్యానికి యత్నాలు సాగిస్తారు. ఒక సంబంధం ఆసక్తి కలిగిస్తుంది. అవతలి వారి స్థోమతను క్షుణ్ణంగా తెలుసుకోండి. దూరపు బంధుత్వాలు బలపడతాయి. పత్రాల్లో సవరణలు సాధ్యపడవు. ఉద్యోగ బాధ్యతల పట్ల అశ్రద్ధ తగదు. అధికారులకు వివరణ ఇచ్చుకోవలసి వస్తుంది. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. చిన్న వ్యాపారులకు కష్టసమయం. కొత్త సమస్యలు ఎదురవుతాయి.
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
గ్రహాల సంచారం అనుకూలంగా ఉంది. కార్యక్రమాలు విజయవంతమవుతాయి. ప్రాధాన్యతా క్రమంలో పనులు పూర్తి చేస్తారు. ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. అవకాశాలను చేజిక్కించుకుంటారు. ఖర్చులు అదుపులో ఉండవు. విలాసాలకు విపరీతంగా ఖర్చుచేస్తారు. వ్యవహారాలతో తీరిక ఉండదు. సమయానుకూలంగా నిర్ణయం తీసుకోండి. సంతానం భవిష్యత్తుపై దృష్టిపెడతారు. ఆప్తుల వ్యాఖ్యలు కార్యోన్ముఖులను చేస్తాయి కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. శుక్ర, శనివారాల్లో కొత్త వ్యక్తులతో జాగ్రత్త. ఎవరితోను వాదనలకు దిగవద్దు. కొన్ని విషయాలు చూసీచూడనట్టు వదిలేయండి. పెద్దల ఆరోగ్యం కుదుటపడుతుంది. వ్యాపారాలు పురోగతిన సాగుతాయి. సంస్ధల స్థాపనలకు తగిన సమయం. ఉద్యోగ బాధ్యతల్లో తప్పిదాలను సరిదిద్దుకుంటారు. వేడుకల్లో అత్యుత్సాహం తగదు. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
ఈ వారం అనుకూలదాయకం. శుభసమయం ఆసన్నమయింది. లక్ష్యానికి చేరువవుతారు. శుభకార్యం విజయవంతమవుతుంది. స్థోమతకు మించి ఖర్చుచేస్తారు. స్నేహసంబంధాలు బలపడతాయి. బాధ్యతలు అప్పగించవద్దు. చేసిన పనులే చేయవలసి వస్తుంది. మనోధైర్యంతో మెలగండి. ఏ విషయాన్నీ సమస్య అనుకోవద్దు. సంతానం విద్యాయత్నం ఫలిస్తుంది. సన్నిహితులతో సంప్రదింపులు జరుపుతారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. దంపతులు ఏకాభిప్రాయానికి రాగలుగుతారు. కీలక పత్రాలు అందుతాయి. గృహనిర్మాణం చేపడతారు. పక్కవారి నుంచి అభ్యంతరాలు ఎదురవుతాయి. పెద్దల జోక్యంతో సమస్య సద్దుమణుగుతుంది. ఉద్యోగస్తులే అధికారుల గుర్తింపు పొందుతారు. ఉపాధ్యాయుల కష్టం ఫలిస్తుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. అటుపోట్లకు ధీటుగా స్పందిస్తారు. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
కార్యసిద్ధికి మరింత శ్రమించాలి. మనోధైర్యంతో యత్నాలు కొనసాగించండి. పట్టుదలతో శ్రమిస్తే విజయం తధ్యం. సలహాలు, సాయం ఆశించవద్దు. ఆదాయం నిరాశాజనకం. వీలైనంత వరకు ఖర్చులు తగ్గించుకోండి. కావలసిన వ్యక్తుల కలయిక వీలుపడదు. కార్యక్రమాలు హడావుడిగా సాగుతాయి. అవాంతరాలెదురైనా పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. అవివాహితులకు శుభవార్తా శ్రవణం. ఆహ్వానం అందుకుంటారు. దూరపు బంధుత్వాలు బలపడతాయి. మీ శ్రీమతి వైఖరిలో ఆశించిన మార్పు వస్తుంది. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. గృహమార్పు కలిసివస్తుంది. ఉద్యోగంలో ఉన్నతస్థితి గోచరిస్తోంది. అధికారులు మీ పదోన్నతికి సిఫార్సు చేస్తారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఆరోగ్య బాగుంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
మనోబలంతో లక్ష్యం సాధిస్తారు. పరిచయాలు ఉన్నతికి తోడ్పడతాయి. ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. రుణ ఒత్తిడి తగ్గుతుంది. రోజువారీ ఖర్చులే ఉంటాయి. పనులు చురుకుగా సాగుతాయి. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. మంచి చేయబోతే చెడు ఎదురవుతుంది. ఆదివారం నాడు బంధువుల రాక అసౌకర్యం కలుగుతుంది. దంపతుల మధ్య ఆకారణ కలహం. సామరస్యంగా మెలగండి. చిన్న విషయాన్ని పెద్దది చేసుకోవద్దు. వివాహయత్నం తీవ్రంగా సాగిస్తారు. దళారులు, కన్సల్టెన్సీలను ఆశ్రయించవద్దు. ఆప్తులు ముఖ్య సమాచారం అందిస్తారు. పత్రాల్లో సవరణలు సాధ్యమవుతాయి. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులుండవు. పెట్టుబడులు కలిసివస్తాయి. మీ సిఫార్సుతో ఒకరికి సదావకాశం లభిస్తుంది. కీలక సమావేశంలో పాల్గొంటారు. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
విశేషమైన ఫలితాలున్నాయి. మీ కృషి ఫలిస్తుంది. అనుకున్న లక్ష్యం సాధిస్తారు. ఆదాయం సంతృప్తికరం. ఊహించిన ఖర్చులే ఉంటాయి. కొంతమొత్తం పొదుపు చేస్తారు. పెద్దమొత్తం ధనసహాయం తగదు. సోమవారం నాడు పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. ఇతరులను మీ విషయాలకు దూరంగా ఉచండి. చెప్పుడు మాటలు పట్టించుకోవద్దు. దంపతుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. స్థిరాస్తి వ్యవహారంలో ఏకాగ్రత వహించండి. ప్రలోభాలకు లొంగవద్దు. న్యాయ నిపుణుల సలహా పాటించండి. వ్యాపారపరంగా లాభసాటి ఫలితాలున్నాయి. చిరువ్యాపారులకు ఆశాజనకం. అధికారులకు ఊహించని సమస్యలు ఎదురవుతాయి. ఉద్యోగస్తులకు పదవీయోగం. సహోద్యోగులతో ఉల్లాసంగా గడుపుతారు. మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి. ప్రయాణం తలపెడతారు. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
మనోధైర్యంతో మెలగండి. యత్నాల్లో స్వల్ప ఆటంకాలు ఎదురవుతాయి. ఆశావహదృక్పథంతో ముందుకు సాగండి. పరిస్థితులు నిదానంగా చక్కబడతాయి. ఖర్చులు విపరీతం. వీలైనంత వరకు ఖర్చులు తగ్గించుకోండి. సోమవారం నాడు దంపతుల మధ్య అవగాహన లోపం. చాటికి మాటికి అసహనం చెందుతారు. మీ ఆగ్రహావేశాలు అదుపులో ఉంచుకోండి. సన్నిహితులతో తరచు సంభాషిస్తారు. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఇంటి విషయాలు పట్టించుకుంటారు. ఆహ్వానం అందుకుంటారు. తెగిపోయిన బంధుత్వాలు బలపడతాయి. సంతానానికి శుభయోగం. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు తేలికవుతాయి. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. వృత్తి ఉపాధి పథకాలు సామాన్యంగా సాగుతాయి. వ్యాపారాభివృద్ధికి అవిశ్రాంతంగా శ్రమిస్తారు. ఉద్యోగస్తులకు పనిభారం. అధికారులకు హోదామార్పు, స్థానచలనం. ముఖ్యులకు ఆత్మీయ వీడ్కోలు పలుకుతారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు