వాక్చాతుర్యంతో నెట్టుకొస్తారు. కష్టం ఫలిస్తుంది. కీలక బాధ్యతలు చేపడతారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఖరీదైన వస్తువులు కొనుగోలు చేస్తారు. నగదు చెల్లింపుల్లో జాగ్రత్త. పనుల్లో ఒత్తిడి అధికం. బాధ్యతలు అప్పగించవద్దు. సన్నిహితులతో సంభాషిస్తారు.
స్థిరాస్తి ధనం అందుతుంది. ఖర్చులు అదుపులో ఉండవు. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. నిలిపివేసిన పనులు పూర్తి చేస్తారు. అవగాహన లేని విషయాల్లో జోక్యం తగదు. అందరితోను మితంగా సంభాషించండి. పత్రాల్లో సవరణలు అనుకూలించవు.
పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు ఏర్పడతాయి. వ్యతిరేకులు సన్నిహితులవుతారు. ఖర్చులు సామాన్యం. ఆప్తులకు సాయం అందిస్తారు. పనులు సానుకూలమవుతాయి. విలువైన వస్తువులు జాగ్రత్త. విందుకు హాజరవుతారు. అత్యుత్సాహం ప్రదర్శించవద్దు.
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
ప్రణాళికలు వేసుకుంటారు. చెల్లింపుల్లో జాగ్రత్త. పెద్దలతో సంభాషిస్తారు. ఎదుటివారి ఆంతర్యం గ్రహించండి. పనులు హడావుడిగా సాగుతాయి. సంతానం విద్యాయత్నం ఫలిస్తుంది. అప్రియమైన వార్త వింటారు. తలపెట్టిన కార్యక్రమాలు వాయిదా పడతాయి.
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
పరిస్థితులు అనుకూలిస్తాయి. కార్యం విజయవంతమవుతుంది. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. కన్సల్టెన్సీలను నమ్మవద్దు. గుంభనంగా మెలగండి. దుబారా ఖర్చులు విపరీతం. దంపతుల మధ్య అవగాహన లోపం. అనవసర బాధ్యతలు చేపట్టి అవస్థపడతారు.
అవిశ్రాంతంగా శ్రమిస్తారు. కష్టించినా ఫలితం ఉండదు. ఏ పని తలపెట్టినా మళ్లీ మొదటికే వస్తుంది. ఆలోచనలు నిలకడగా ఉండవు. నిస్తేజానికి లోనవుతారు. ఊహించని ఖర్చు చికాకుపరుస్తుంది. పందాలు, బెట్టింగులకు పాల్పడవద్దు. ఏకాగ్రతతో వాహనం నడపండి.
సంప్రదింపులు ఫలిస్తాయి. లాభసాటి నిర్ణయాలు తీసుకుంటారు. కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. విలాసాలకు వ్యయం చేస్తారు. పనులు చురుకుగా సాగుతాయి. పదవులు, సభ్యత్వాలకు యత్నాలు సాగిస్తారు. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. దైవ, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
పట్టుదలతో యత్నాలు సాగిస్తారు. తలపెట్టిన. కార్యం సిద్ధిస్తుంది. ఖర్చులు అధికం. నిలిపివేసిన పనులు పూర్తి చేస్తారు. ఎవరినీ అతిగా విశ్వసించవద్దు. బాధ్యతలు స్వయంగా చూసుకోండి. ఇంటిని నిర్లక్ష్యంగా వదిలివెళ్లకండి. నగదు, వెండి, బంగారం జాగ్రత్త.
పొదుపు ధనం గ్రహిస్తారు. ఖర్చులు అధికం. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. వ్యాపకాలు సృష్టించుకుంటారు. పనులు సావకాశంగా పూర్తి చేస్తారు. కొత్త వ్యక్తులతో జాగ్రత్త. పత్రాల రెన్యువల్లో మెలకువ వహించండి.
మీ కృషి ఫలిస్తుంది. ఒత్తిడి తగ్గి కుదుటపడతారు. లావాదేవీల్లో మెలకువ వహించండి. ఏకపక్ష నిర్ణయం తగదు. చేపట్టిన పనులు హడావుడిగా సాగుతాయి. సన్నిహితులతో కాలక్షేపం చేస్తారు. వెండి, బంగారాలు కొనుగోలు చేస్తారు. రశీదులు, పత్రాలు జాగ్రత్త.
పట్టింపులకు పోవద్దు. ఎదుటివారి ఆంతర్యం గ్రహించండి. లౌక్యంగా పనులు చక్కబెట్టుకోవాలి. ఆధిపత్యం ప్రదర్శించి భంగపడతారు. ఖర్చులు అదుపులో ఉండవు. చేబదుళ్లు స్వీకరిస్తారు. ఒక సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. పోగొట్టుకున్న పత్రాలు తిరిగి సంపాదిస్తారు.
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ప్రముఖులకు సన్నిహితులవుతారు. డబ్బుకు ఇబ్బంది ఉండదు. విలాసాలకు ఖర్చుచేస్తారు. పనులు ప్రారంభంలో ఆటంకాలెదురవుతాయి. బాధ్యతలు స్వయంగా చూసుకోండి. నోటీసులు అందుతాయి. న్యాయనిపుణులను సంప్రదిస్తారు.