16-07-2023 ఆదివారం రాశిఫలాలు - సూర్య స్తుతి ఆరాధించిన శుభం..

ఆదివారం, 16 జులై 2023 (05:02 IST)
మేషం :- రేషన్ డీలర్లకు అధికారుల నుంచి వేధింపులను ఎదుర్కొంటారు. రాజకీయాలలోని వారికి ఒక సమాచారం ఎంతో అనందాన్ని ఇస్తుంది. సహోద్యోగులతో కళా సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. దంపతుల మధ్య పరస్పర అవగాహనా లోపం. ద్విచక్ర వాహనంపై దూరప్రయాణాలు మంచిది కాదు.
 
వృషభం :- హోటల్, తినుబండార వ్యాపారస్తులకు సంతృప్తి కానవచ్చును. మీ పరోపకార బుద్ధి మీకు సమస్యలను తెచ్చిపెడుతుంది. పెద్దల ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతుంది. విద్యార్థులు క్రీడా కార్యక్రమాలలో పాల్గొంటారు. పాత మిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. రవాణా రంగాల వారికి మెళుకువ, ఏకాగ్రత అవసరం.
 
మిథునం :- మీ పరోపకార బుద్ధి మీకు సమస్యలను తెచ్చిపెడుతుంది. కానివేళలో ఇతరుల రాకఇబ్బంది కలిగిస్తుంది. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. మీ మంచి తనమే మీకు శ్రీరామ రక్ష. గృహ నిర్మాణానికి సంబంధించిన చర్చలు ఫలిస్తాయి. సోదరుని వైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. 
 
కర్కాటకం :- రాజకీయాలలో వారికి విదేశీ పర్యటనలు అధికమవుతాయి. ఆందోళన కలిగించిన సంఘటన తేలికగా సమసిపోతుంది. రుణయత్నం ఫలించి ధనం చేతికి అందుతుంది. సభలు, సమావేశాలలో హుందాగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు. భక్తి, ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు.
 
సింహం :- వాయిదా పడిన మొక్కుబడులు తీర్చుకుంటారు. అతిథి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు. బంధువుల ఆకస్మిక రాక వల్ల ఖర్చులు అధికమవుతాయి. మీ సంతానంతో కలిసి విందు, వినోదాలలో పాల్గొంటారు. వ్యాపారాల్లో స్వల్ప ఒడిదుడుకులు, చికాకులు ఎదుర్కుంటారు. ప్రముఖుల ఇంటర్వ్యూ కోసం నిరీక్షణ తప్పదు. 
 
కన్య :- పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. కోళ్ళ, మత్స్య, పాడి పరిశ్రమ, గొర్రెల రంగాలలో వారికి అనుకున్నంత సంతృప్తి కానరాదు. మీ జీవిత భాగస్వామితో సఖ్యత నెలకొంటుంది. కుటుంబీకులతో ఉల్లాసంగా గడుపుతారు. పెద్దమొత్తం ధనసహాయం క్షేమం కాదు. ఉద్యోగంలో శ్రమకు నైపుణ్యతకు మంచి గుర్తింపు లభిస్తుంది.
 
తుల :- ఉపాధ్యాయులకు మంచి గుర్తింపు లభిస్తుంది. స్త్రీల ప్రతిభకు గుర్తింపు, అవకాశాలు లభిస్తాయి. ఖర్చులు అదుపు చేయాలనే మీ సంకల్పం నెరవేరుతుంది. వాహనం నడుపునపుడు జాగ్రత్త అవసరం. వృత్తుల వారికి శ్రమాధిక్యత మినహా ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది.
 
వృశ్చికం :- ప్రింటింగ్, స్టేషనరీ రంగాల వారికి సదవకాశాలు లభిస్తాయి. దైవ కార్యాలలో చురుకుగా వ్యవహరిస్తారు. రాజకీయరంగాల వారికి ప్రోత్సహకరంగా ఉంటుంది. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు. కుటుంబ సభ్యుల వైఖరి ఆవేదన కలిగిస్తుంది. స్త్రీలకు కొత్త కొత్త కోరికలు, సరదాలు స్ఫురిస్తాయి.
 
ధనస్సు :- మీ ఇష్టాయిష్టాలను లౌక్యంగా వ్యక్తం చేయండి. నిరుద్యోగులకు తాత్కాలిక అవకాశాలు లభిస్తాయి. దైవ సేవా కార్యక్రమాలలో చురుకుగా వ్యవహరిస్తారు. మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు విశ్రాంతి లభిస్తుంది. రాజకీయనాయకులకు ప్రయాణాలలో ఇబ్బందులు తప్పవు.
 
మకరం :- సన్నిహితుల కోసం ధనం విరివిగా వ్యయం చేయవలసి వస్తుంది. శ్రీమతి సలహా పాటించటం చిన్నతనంగా భావించకండి. ఆకస్మికంగా ప్రయాణాలు వాయిదాపడతాయి. కొన్ని విషయాలను చూసీచూడనట్టుగా ఉండాలి. సౌమ్యంగా సమస్యలు పరిష్కరించుకోవాలి. ప్రయాణాలలో నూతన పరిచయా లేర్పడతాయి.
 
కుంభం :- పండ్లు, పూలు, కొబ్బరి చిరు వ్యాపారాలకు లాభదాయకంగా ఉంటుంది. వీలైనంత వరకూ మీ పనులు మీరే చూసుకోవటం ఉత్తమం. ఉమ్మడి వెంచర్లు, పెట్టుబడుల వ్యవహారంలో అనుభవిజ్ఞుల సలహా పాటించండి. స్త్రీలు అనవసర విషయాల్లో జోక్యం చేసుకోవటం వల్ల భంగపాటుకు గురవుతారు. వృత్తుల వారికి శ్రమాధిక్యత తప్పదు. 
 
మీనం :- రహస్య విరోధులు అధికం కావడంవల్ల రాజకీయాల్లో వారికి ఆందోళన తప్పదు. ప్రియతములగురించి ఆందోళన చెందుతారు. బంధువుల రాకతో ఊహించిని ఖర్చులు అధికమవుతాయి. మిత్రులతో కలసి విందు, వినోదాలలో పాల్గొంటారు. నిరుద్యోగులు బోగస్ ప్రకటనల వల్ల నష్టపోయే ఆస్కారం ఉంది. జాగ్రత్త వహించండి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు