02-10-2025 గురువారం దిన ఫలితాలు - దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది...

రామన్

గురువారం, 2 అక్టోబరు 2025 (04:00 IST)
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఆశించిన సంబంధం నిరుత్సాహపరుస్తుంది. పనుల్లో ఒత్తిడి, జాప్యం అధికం. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఆహ్వానం అందుకుంటారు. ఖర్చులు సామాన్యం. అప్రమత్తంగా ఉండాలి. పందాలు, బెట్టింగులకు పాల్పడవద్దు. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
నిరుత్సాహం శ్రమించండి. అపజయాలకు కుంగిపోవద్దు. కొందరి వ్యాఖ్యలు ఉద్రేకపరుస్తాయి. పట్టుదలతో శ్రమిస్తే విజయం తధ్యం. ఖర్చులు అధికం. పాత పరిచయస్తులు తారసపడతారు. వేడుకకు హాజరవుతారు. మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి.
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
రుణ సమస్యల నుంచి బయటపడతారు. రోజువారీ ఖర్చులే ఉంటాయి. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. సకాలంలో పనులు పూర్తి చేస్తారు. ఒక సమాచారం తీవ్రంగా ఆలోచింపచేస్తుంది. అనుభవజ్ఞుల సలహా పాటించండి. ఆలయాలు సందర్శిస్తారు.
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
కలిసివచ్చే సమయం. మాట నిలబెట్టుకుంటారు. వ్యతిరేకులు సన్నిహితులవుతారు. ఆర్భాటాలకు వ్యయం చేస్తారు. పనులు అర్థాంతంగా ముగిస్తారు. దంపతుల మధ్య అకారణ కలహం. ఆత్మీయులతో సంభాషణ ఉపశమనం కలిగిస్తుంది. వివాదాలు కొలిక్కివస్తాయి.
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
రావలసిన ధనం అందుతుంది. ప్రణాళికలు వేసుకుంటారు. ప్రైవేట్ సంస్థల్లో మదుపు తగదు. మీ శ్రీమతి సలహా పాటించండి. పనులు సావకాశంగా పూర్తి చేస్తారు. పరిచయాలు బలపడతాయి. ఎవరినీ అతిగా నమ్మవద్దు. ఒక ఆహ్వానం ఆశ్చర్యం కలిగిస్తుంది. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
మీ నమ్మకం వమ్ముకాదు. కొన్ని విషయాలు ఊహించినట్టే జరుగుతాయి. ఆలోచనల్లో మార్పు వస్తుంది. ప్రియతములతో సంప్రదింపులు జరుపుతారు. దుబారా ఖర్చులు విపరీతం. చీటికిమాటికి అసహనం చెందుతారు. పత్రాలు అందుకుంటారు. వాహనం ఇతరులకివ్వవద్దు. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
ప్రతికూలతలను అవకాశాలుగా మలుచుకుంటారు. అనుకున్న కార్యం నెరవేరుతుంది. మాట నిలబెట్టుకుంటారు. రోజువారీ ఖర్చులే ఉంటాయి. పెట్టుబడులపై దృష్టి పెడతారు. చెల్లింపుల్లో జాగ్రత్త. ప్రతి విషయం స్వయంగా తెలుసుకోండి. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
ఖర్చులు ప్రయోజనకరం. స్థిరాస్తి అమర్చుకోవాలనే ఆలోచన స్ఫురిస్తుంది. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. అప్రమత్తంగా ఉండాలి. వాగ్వాదాలకు దిగవద్దు. గృహమరమ్మతులు చేపడతారు. ముఖ్యులకు వీడ్కోలు పలుకుతారు. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
ప్రతిభా పాటవాలు వెలుగులోకి వస్తాయి. ప్రశంసలందుకుంటారు. అవకాశాలు కలిసివస్తాయి. బాధ్యతలు స్వీకరిస్తారు. వ్యతిరేకులతో జాగ్రత్త. ఖర్చులు విపరీతం. రాబడిపై దృష్టి పెడతారు. కొంతమంది రాక ఇబ్బంది కలిగిస్తుంది. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు.
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
సంప్రదింపులు ఫలిస్తాయి. సముచిత నిర్ణయం తీసుకుంటారు. ఖర్చులు ప్రయోజనకరం. కొంతమొత్తం పొదుపు చేయగల్గుతారు. పనులు వేగవంతమవుతాయి. ఆప్తులకు సాయం అందిస్తారు. పిల్లల దూకుడు అదుపు చేయండి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
ఆదాయం బాగున్నా వెలితిగా ఉంటుంది. ఖర్చులు విపరీతం. అవసరాలకు ధనం అందుతుంది. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ముఖ్యుల కలయిక వీలుపడదు. పనులు ముందుకు సాగవు. పత్రాల రెన్యువల్లో జాప్యం తగదు. సేవాకార్యక్రమంలో పాల్గొంటారు. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. వ్యూహాత్మకంగా అడుగులేస్తారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. ఖర్చులు అధికం. కష్టమనుకున్న పనులు తేలికగా పూర్తవుతాయి. శుభకార్యానికి హాజరవుతారు. బంధువుల ఆతిథ్యం ఆకట్టుకుంటుంది. ఆప్తులను కలుసుకుంటారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు