17-06-2022 శుక్రవారం రాశిఫలాలు ... పార్వతిదేవిని పూజించిన మనోవాంఛలు సఫలం

శుక్రవారం, 17 జూన్ 2022 (04:00 IST)
మేషం :- ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. దైవ సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. విద్యార్థులకు దూరప్రాంతాలలో ఉన్నత విద్యల్లో ప్రవేశం లభిస్తుంది. కొన్ని సమస్యలు తీరి ఊపిరి పీల్చుకుంటారు. సోదరులు, మిత్రులతో నెలకొన్న వివాదాలు పరిష్కరింపబడతాయి. పెద్దల ఆరోగ్యం కుదుటపడుతుంది.
 
వృషభం :- కొబ్బరి, పండ్లు, పూలు, కూరలు చిరువ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. శాస్త్ర, సాంకేతిక, మెడికల్ రంగాల వారికి మంచి గుర్తింపు లభిస్తుంది. కోర్టు వ్యవహారాలు కొత్త మలుపు తిరుగుతాయి. గృహోపకరణ వ్యాపారులకు పురోభివృద్ధి. పాత బాకీలు సైతం వసూలవుతాయి. అరుదైన ఆహ్వానాలు రాగలవు.
 
మిథునం :- ఆర్థిక లావాదేవీలు, కీలమైన వ్యవహారాల్లో ఏకాగ్రత వహించండి. ఉద్యోగ, విదేశీయాన యత్నాల్లో సఫలీకృతులవుతారు. ప్రయాణాలు, బ్యాంక్ వ్యవహారాల్లో మెలకువ వహించండి. స్త్రీలకు వాహనం నడుపుతున్నపుడు ఏకాగ్రత, మెళుకువ అవసరం. నిత్యావసర వస్తుస్టాకిస్టులకు, వ్యాపారులకు సంతృప్తి, పురోభివృద్ధి. 
 
కర్కాటకం :- వ్యాపారాభివృద్ధికి చేయుకృషిలో రాణిస్తారు. తరుచూ దైవ, సేవా కార్యాక్రమాల్లో పాల్గొంటారు. స్త్రీలకు స్వీయ సంపాదన పట్ల ఆసక్తి అధికమవుతుంది. స్టాక్ మార్కెట్ రంగాల వారి అంచనాలు నిరుత్సాహపరుస్తాయి. కీలకమైన వ్యవహారాలు మీ జీవిత భాగస్వామికి తెలియజేయటం అన్ని విధాలా శ్రేయస్కరం.
 
సింహం :- బంధువుల కోసం ధనం విరివిగా వ్యయం చేయవలసి వస్తుంది. మీ సంతానం ఉన్నత విద్యల పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తారు. ఉన్నతస్థాయి అధికారులు ప్రలోభాలకు దూరంగా ఉండటం మంచిది. రిప్రజెంటేటివ్‌లకు, ప్రైవేటు సంస్థలోని వారికి మార్పులు అనకూలిస్తాయి. బ్యాంకు వ్యవహారాలు అనుకూలం.
 
కన్య :- భాగస్వామిక సమావేశాల్లో మీ ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తుంది. రాజకీయనాయకులకు ప్రయాణాలలో మెళుకువ అవసరం. ప్రముఖులతో ఉత్తరప్రత్యుత్తరాలు సంతృప్తినిస్తాయి. చేపట్టిన పనులలో తరుచూ ఆటంకాలు ఎదురవుతాయి. స్త్రీలకు తల, నరాలు, ఎముకలు, దంతాలకు సంబంధించిన చికాకులు తప్పవు.
 
తుల :- స్త్రీలకు బంధువుల రాకతో పనిభారం అధికమవుతుంది. విదేశీయానం, తీర్థయాత్రలు అనుకూలిస్తాయి. కోర్టు వ్యవహారాలు వాయిదా పడటం మంచిదని గమనించండి. మీ అభిప్రాయాలకు కుటుంబీకుల నుంచి వ్యతిరేకత ఎదురవుతుంది. ఉపాధ్యాయులకు, మార్కెటింగ్ రంగాల వారికి ఒత్తిడి అధికమవుతుంది.
 
వృశ్చికం :- ఉద్యోగస్తులకు శ్రమాధిక్యత ఉన్నా మున్ముందు సత్ఫలితాలుంటాయి. నిరుద్యోగులకు రాత, మౌఖిక పరీక్షలు అనుకూలిస్తాయి. ఊహించని వ్యక్తుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. అకాల భోజనం, విశ్రాంతి లోపం వల్ల స్వల్ప అస్వస్థతకు గురవుతారు. ప్రేమికుల అనాలోచిత చర్యల వల్ల చిక్కుల్లో పడే ఆస్కారం ఉంది.
 
ధనస్సు :- ఆర్థిక ఇబ్బందులు తలెత్తినా క్రమంగా సమసిపోతాయి. దంపతుల మధ్య అనురాగ వాత్సల్యాలు పెంపొందుతాయి. మీ పథకాలు, ప్రణాళికలు కార్యరూపం దాల్చుతాయి. కాంట్రాక్టర్లు నూతన టెండర్లు చేజిక్కించుకుంటారు. పత్రికా సంస్థల్లోని వారికి విధినిర్వహణలో చిన్న చిన్న తప్పులు దొర్లే ఆస్కారం ఉంది.
 
మకరం :- సన్నిహితులు మీ యత్నాలకు సహాయ సహకారాలు అందిస్తారు. ఖర్చులు పెరగటంతో రుణ యత్నాలు, చేబదుళ్ళు స్వీకరిస్తారు. క్రయవిక్రయాలు లాభదాయకంగా ఉంటాయి. కుటుంబంలోను, సంఘంలోను మీ మాటకు విలువ పెరుగుతుంది. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్ల ధోరణి ఆందోళన కలిగిస్తుంది.
 
కుంభం :- ప్రభుత్వ కార్యక్రమాలలోని పనులు సానుకూలమవుతాయి. ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు. నూతన పెట్టుబడులకు మరికొంత కాలం వేచియుండటం మంచిదని గమనించండి. సిమెంటు, కలప, ఐరన్, ఇటుక, ఇసుక వ్యాపారులకు ఆటుపోట్లు తప్పవు. స్త్రీలకు అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తత అవసరం.
 
మీనం :- వృత్తి ఉద్యోగాల్లో ఆశించిన పురోభివృద్ధి ఉండదు. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాలలో జాగ్రత్త అవసరం. ఆకస్మికంగా దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఉపాధ్యాయులకు బరువు బాధ్యతలు పెరుగుతాయి. మిత్రుల కారణంగా మీ కార్యమ్రాలు మార్చుకోవలసి ఉంటుంది. ఉపాధ్యాయులకు ఒత్తిడి, పనిభారం అధికం. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు