19-07-2022 మంగళవారం రాశిఫలాలు ... ఆంజనేయస్వామిని ఆరాధిస్తే...

మంగళవారం, 19 జులై 2022 (04:00 IST)
మేషం :- ప్రైవేటు సంస్థల్లో వారికి మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. ఇతరుల కుటుంబ విషయాల్లో తలదూర్చటం వల్ల ఇబ్బందులు తలెత్తుతాయి. రుణాలు, బకాయిల వసూళ్ళ విషయంలో జాప్యం తప్పదు. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానికల్, కంప్యూటర్ రంగాలలో వారికి శుభదాయకం. విద్యార్థులలకు క్రీడలపట్ల ఆసక్తి పెరుగుతుంది.
 
వృషభం :- ఉద్యోగస్తులు, అధికారులు కొత్త వ్యక్తుల విషయంలో జాగ్రత్త వహించాలి. మీ గౌరవాభిమానాలకు భంగం కలిగే సూచనలున్నాయి. మీ సమర్థత, నిజాయితీలు ఆలస్యంగా వెలుగుచూస్తాయి. ట్రాన్స్‌పోర్టు, ఎక్స్‌పోర్టు రంగాలలో వారికి సామాన్యంగా ఉంటుంది. ప్రేమికులు అవగాహనా లోపం వల్ల విడిపోయే ఆస్కారం ఉంది.
 
మిథునం :- మీ ఆదాయం పెంచుకునేందుకు కొత్త మార్గాలు అన్వేషిస్తారు. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు పెంచుకుంటారు. గృహంలో ప్రశాంతత నెలకొంటుంది. భాగస్వామిక సమావేశాల్లో మీ ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తుంది. స్త్రీలు కుటుంబ పరిస్థితులను అర్థం చేసుకుని మెలగటం క్షేమదాయకం.
 
కర్కాటకం :- ఎంతటి కష్టాన్నైనా మనోధైర్యంతో ఎదుర్కుంటారు. ఏ విషయాన్ని తెగే వరకూ లాగటం మంచిది కాదు. అనవసర విషయాలకు దూరంగా ఉండటం మంచిది. సోదరీ సోదరుల మధ్య అభిప్రాయభేదాలు పట్టింపులు చోటుచేసుకుంటాయి. స్త్రీలు షాపింగులోను, కొత్త వ్యక్తుల పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలి.
 
సింహం :- సహోద్యోగులతో సంబంధాలు మెరుగుపడతాయి. అవగాహన లేని విషయాలకు, చేతకాని పనులకు దూరంగా ఉండటం మంచిది. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్లు, ప్లీడరు గుమస్తాలకు చికాకులు తప్పవు. మీ శ్రీమతి సలహా పాటించటం వల్ల మేలు జరిగే అవకాశం ఉంది. ప్రయాణాల్లో చికాకులు, నిరుత్సాహంతప్పవు.
 
కన్య :- గట్టిగా ప్రయత్నిస్తేనే మొండి బాకీలు వసూలవుతాయి. ఉద్యోగస్తులకు ఏకాగ్రత, అంకితభావం ముఖ్యం. దూర ప్రయాణాలలో నూతన పరిచయాలు ఏర్పడతాయి. బిల్లులు చెల్లిస్తారు. వ్యాపారాల అభివృద్ధికి బాగా శ్రమించాలి. రెట్టించిన ఉత్సాహంతో కొత్త యత్నాలు మొదలెడతారు. స్త్రీల కోరికలు, అవసరాలు నెరవేరుతాయి.
 
తుల :- కాంట్రాక్టర్లు, మధ్యాహ్న భోజన పథక ఏజెంట్లకు రావలసిన బిల్లులు మంజూరవుతాయి. స్త్రీలకు టీ.వీ ఛానెళ్ల నుంచి ఆహ్వానం అందుతుంది. చేపట్టిన పనుల్లో ఒత్తిడి, హడావుడి ఎదుర్కుంటారు. ఉద్యోగులకు గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాల్లో మొహమ్మాటం వీడి లౌక్యం ప్రదర్శించండి. సభలు, సమావేశాలు, చర్చల్లో పాల్గొంటారు.
 
వృశ్చికం :- చిన్న చిన్న పొరపాట్లు దొర్లినా సమర్థించుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగ సమాచారం ఆలస్యంగా అందటంతో నిరుత్సాహం తప్పదు. ఏ విషయానికి కలిసిరాని మీ శ్రీమతి వైఖరి నిరుత్సాహపరుస్తుంది. క్రయ విక్రయాలు మందకొడిగా సాగుతాయి. దుబారా ఖర్చులు తగ్గకపోగా మరింత ధనవ్యయం అవుతుంది.
 
ధనస్సు :- దంపతుల మధ్య సఖ్యత లోపం, చికాకులు తలెత్తుతాయి. స్త్రీల అవసరాలు, కోరికలు నెరవేరుతాయి. రవాణా రంగంలోని వారికి చికాకు తప్పదు. ఓర్పు, నేర్పుతో అనుకున్నది సాధిస్తారు. మీ శ్రీమతి సూటిపోటి మాటలు అసహనం కలిగిస్తాయి. బ్యాంకుల నుంచి పెద్దమొత్తంలో ధనం డ్రా చేసే విషయంలో జాగ్రత్త.
 
మకరం :- వైద్యులకు శస్త్ర చికిత్స చేయునపుడు మెలకువ అవసరం. సోదరులతో స్వల్ప అభిప్రాయభేదాలు తలెత్తుతాయి. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి మంచి గుర్తింపు లభిస్తుంది. లీజు, ఏజెన్సీలు, కాంట్రాక్టుల విషయంలో పునరాలోచన మంచిది. ప్రముఖుల కలయిక ప్రయోజనకంగా ఉంటుంది. రుణ ప్రయత్నం వాయిదా పడగలదు.
 
కుంభం :- స్థిరచరాస్తుల విషయంలో ఒక నిర్ణయానికి వస్తారు. రుణం ఏ కొంతైనా తీర్చాలనే మీ ధ్యేయం నెరవేరుతుంది. ఒంటరిగా ఏపని చేయటం క్షేమం కాదని గమనించండి. ఆకస్మికంగా ప్రయాణం చేయవలసి వస్తుంది. ఆరోగ్య విషయంలో సంతృప్తికానరాదు. విదేశీ వ్యవహారాలకు అవసరమైన నిధులు సమకూర్చుకుంటారు.
 
మీనం :- వృత్తిపరమైన చికాకులు క్రమంగా తొలగిపోగలవు. ముఖ్యులతో సంభాషించేటపుడు ఆచి, తూచి వ్యవహరించడం మంచిది. రుణాలు తీరుస్తారు. మీరు చేపట్టిన పనికి ఇతరుల నుంచి అవాంతరాలు ఎదుర్కుంటారు. బ్యాంకింగ్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం అధికమవుతుంది. రిప్రజెంటేటివ్‌లకు సంతృప్తి కానవస్తుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు