22-10-2022 శనివారం దినఫలాలు - ఈశ్వరునికి తైలాభిషేకం చేయించి?

శనివారం, 22 అక్టోబరు 2022 (05:00 IST)
మేషం:- బాకీలు, ఇతరత్రా రావలసిన ఆదాయాన్ని లౌక్యంగా వసూలు చేసుకోవాలి. నిరుద్యోగులు ఒక ప్రకటన పట్ల ఆకర్షితులువుతారు. ఉద్యోగస్తులకు తోటివారి కారణంగా ఒత్తిడి, పనిభారం అధికమవుతాయి. బాధ్యతలు పెరిగినా మీ సమర్థతను నిరూపించుకుంటారు. సన్నిహితులతో కలిసి పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు.
 
వృషభం :- ఉమ్మడి, సొంత వ్యాపారాల అభివృద్ధికి కొత్త కొత్త ప్రణాళికలు రూపొందిస్తారు. ఒక స్థిరాస్తి అమర్చుకోవాలనే మీ కోరిక నెరవేరుతుంది. మీ అభిప్రాయాలను సూచనప్రాయంగా తెలియజేయండి. మీ సంతానం కదలికలను గమనిస్తుండాలి. స్త్రీలు షాపింగ్ వ్యవహారాలలో, అపరిచిత వ్యక్తుల పట్ల జాగ్రత్త అవసరం.
 
మిథునం:- రావలసిన ధనాన్ని లౌక్యంగా వసూలు చేసుకోవాలి. పచారి, వస్త్ర, బంగారు వ్యాపారులకు మిశ్రమ ఫలితం. స్త్రీల మాటకు ఇంటా, బయటా ఆదరణ లభిస్తుంది. మీ కృషికి ప్రోత్సాహం లభిస్తుంది. విద్యార్థులకు ఉన్నత విద్యలో ప్రవేశం లభిస్తుంది. ప్రముఖులతో ముఖ్య వ్యవహారంపై సంప్రదింపులు జరుపుతారు.
 
కర్కాటకం:- ఒకనాటి మీ కష్టానికి నేడు ప్రతిఫలం లభిస్తుంది. ప్రేమికులకు పెద్దల నుంచి వ్యతిరేకత, ఇతరత్రా చికాకులు అధికమవుతాయి. ప్రముఖ పుణ్యక్షేత్రం సందర్శనకు సన్నాహాలు సాగిస్తారు. స్త్రీలకు వాహనం నడుపుతున్నపుడు ఏకాగ్రత అవసరం. మీ సంతానం భవిష్యత్ గురించి కొత్త కొత్త ప్రణాళికలు రూపొందిస్తారు.
 
సింహం:- ప్రింటింగ్ రంగాల వారు అక్షర దోషాలు లేకుండా తగు జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానికల్, కంప్యూటర్ రంగాల వారికి మిశ్రమ ఫలితం. ఇచ్చిపుచ్చుకునే వ్యవహరాలు, వాణిజ్య ఒప్పందాల్లో మెలకువ వహించండి. చిన్నతరహా పరిశ్రమలు, చేతివృత్తుల వారికి అన్ని విధాలా కలిసిరాగలదు.
 
కన్య:- నిర్మాణ పనులలో కాంట్రాక్టర్లకు ఇబ్బందులు తప్పవు. ఖర్చులు ప్రయోజనకరంగా ఉంటాయి. ఫర్నీచర్ అమరికలకు అవసరమైన నిధులు సమకూర్చుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. కోర్టు వ్యవహరాల్లో ప్లీడర్లకు ఏకాగ్రత ముఖ్యం. ఆలయాలను సందర్శిస్తారు. స్థిరచరాస్తుల క్రయ విక్రయాలు అనుకూలిస్తాయి.
 
తుల:- ఉద్యోగస్తులకు పని ఒత్తిడి, శ్రమాధిక్యత వంటి చికాకులు తప్పవు. బ్యాంకింగ్ వ్యవహారాలలో పనులు మందకొడిగా సాగుతాయి. పత్రికా సంస్థలలో పనిచేసే వారికి సదవకాశాలు లభిస్తాయి. నూతన పెట్టుబడులు, వ్యాపారాల విస్తరణలకు ఇది అనువైన సమయం. తరుచు సభలు, సమావేశాల్లో పాల్గొంటారు.
 
వృశ్చికం:- ఆస్తి వ్యవహరాల్లో పెద్దల తీరు నిరుత్సాహం కలిగిస్తుంది. కుటుంబంలో ఏర్పడిన వాదనలను పట్టించుకోకపోవడం మంచిది. ఉపాధ్యాయులకు మార్పులు అనుకూలిస్తాయి. దీర్ఘకాలిక పెట్టుబడుల విషయంలో ఒక నిర్ణయానికి వస్తారు. సుసాధ్యమనుకున్న ఒక వ్యవహారం మీకు సానుకూలంగా పరిష్కారమవుతుంది.
 
ధనస్సు:- మీ సంతానం మొండి వైఖరి వల్ల ఇబ్బందులు తప్పవు. అనుకోకుండా ఏర్పడిన ఒక స్నేహబంధం భవిష్యత్తులో మీకు మంచే చేస్తుంది. ఆకస్మికంగా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. స్త్రీ మూలకంగా వివాదాలు ఎదుర్కుంటారు. విద్యార్థులకు కొన్ని నిర్భందాలకు లోనవుతారు. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి.
 
మకరం:- మీ బంధువులను సహాయం అర్థించే బదులు మీరే ప్రత్యామ్నాయం చూసుకోవటం ఉత్తమం. రాబడికి మించిన ఖర్చులెదురవుతాయి. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్ల ధోరణి ఆందోళన కలిగిస్తుంది. అధికారులకు అదనపు బాధ్యతలు, తనిఖీలు అధికం. ఆలయాలను సందర్శిస్తారు. ఏ వ్యక్తికీ అతి చనువు ఇవ్వటం మంచిదికాదు.
 
కుంభం:- బ్యాంకుల్లో మీ పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కోవలసి వస్తుంది. స్త్రీలు అదనపు సంపాదన దిసగా ఆలోచనలు చేస్తారు. ఒక ముఖ్య విషయమై న్యాయ సలహా పొందవలసివస్తుంది. మీ శ్రీమతికి చెప్పకుండా రహస్యాలు దాచినందుకు కలహాలు తప్పవు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూ సమాచారం అందుతుంది.
 
మీనం:- కళ, క్రీడ, సాహిత్య రంగాల వారికి ప్రోత్సాహకరం. మీ సమర్థతకు మంచి గుర్తింపు లభిస్తుంది. సొంత వ్యాపారాలకు కావలసిన వనరులు సమకూర్చుకుంటారు. రావలసిన ఆదాయంపై దృష్టి సారిస్తారు. దైవ దీక్షలు, మొక్కుబడులు అనుకూలిస్తాయి. విద్యార్థినులకు ప్రేమ వ్యవహరాల్లో భంగపాటు తప్పదు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు