మహాలయ అమావాస్య 2025: రావి చెట్టుకు పాలు, చక్కెర కలిపిన నీటిని..?

సెల్వి

శనివారం, 20 సెప్టెంబరు 2025 (21:36 IST)
ప్రతి ఏడాది 15 రోజుల పాటు పితరులకు కేటాయిస్తారు. అదే పితృపక్షం అంటారు. ఈ సమయంలో మన పితరులు భూమిపై సంచరిస్తారని శ్రద్ధ, కర్మాలు వంటివి నిర్వహిస్తారు. పిండ ప్రదానాలు చేస్తారు. నల్ల నువ్వులతో నీటిని వదిలే ఆనవాయితీ కూడా ఉంది. తద్వారా పూర్వీకులకు మోక్షం కలుగుతుందని విశ్వాసం. ఈ పితృపక్షంలో వచ్చే అమావాస్యను మహాలయ అమావాస్యగా పరిగణిస్తారు. 
 
విశిష్టమైన అమావాస్య ఈ ఏడాది సెప్టెంబర్ 21వ తేదీ ఆదివారం వచ్చింది. ఈ రోజున ఏ శుభకార్యాలు చేయకూడదు. ఈరోజు కేవలం పితరులకు మాత్రమే సంబంధించింది. కొత్త బట్టలు ధరించడం కూడా నిషిద్ధం. ఈ రోజున దానం అడిగిన వారికి దానం ఇవ్వడం చేయాలి. వారిని దూషించడం కూడదు. 
 
అమావాస్య అంటే చంద్రుడు లేని రోజు కనుక శివుడిని ప్రార్థించడం ఒక శక్తివంతమైన రోజు. శివుడికి పాలు, తేనె, బిల్వ పత్రాలు సమర్పించండి. మహాలయ అమావాస్య రోజున నల్ల నువ్వులను దానం చేయడం వల్ల శనీశ్వర ప్రతికూల శక్తి తొలగిపోతుందని నమ్మకం. 
 
పూర్వీకులు, త్రిమూర్తులు నివసించే రావి చెట్టుకి విశేషమైన ప్రాముఖ్యత ఉంది. అందుకే మహాలయ అమావాస్య రోజున రావి చెట్టుకు పాలు, చక్కెర కలిపిన నీటిని సమర్పించి పూజించాలి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు