24-11-2022 గురువారం దినఫలాలు - రాఘవేంద్రస్వామిని పూజించినా...

గురువారం, 24 నవంబరు 2022 (04:00 IST)
మేషం :- వృత్తి ఉద్యోగాల్లో తలెత్తిన ఆటంకాలను అధికమిస్తారు. కొత్త వ్యాపారాల ఆలోచన కొంతకాలం వాయిదా వేయటం మంచిది. మీ గౌరవానికి భంగం కలుగకుండా వ్యవహరించండి. రాజీమార్గంతో కొన్ని సమస్యలు పరిష్కారమవుతాయి. స్త్రీల ఆరోగ్యం మందగిస్తుంది. రావలసిన ధనం అందటంతో నిశ్చింతకు లోనవుతారు.
 
వృషభం :- బంధుమిత్రుల నుంచి ఒత్తిడి, మొహమ్మాటాలు ఎదుర్కుంటారు. తలపెట్టిన పనులు ఏమాత్రం ముందుకు సాగవు. విదేశాల్లోని ఆత్మీయుల గురించి ఆందోళన చెందుతారు. స్త్రీలకు ఏ విషయంలోను మనస్థిమితం అంతగా ఉండదు. పత్రికా సంస్థలలోని వారి శ్రమకు ఏమాత్రం గుర్తింపు లేకపోగా మాటపడవలసి వస్తుంది. 
 
మిథునం :- బ్యాంకు పనుల్లో ఏకాగ్రత వహించండి. ఊహించని సమస్యలెదురైనా తెలివిగా పరిష్కరిస్తారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అనుకూలిస్తాయి. విద్యార్థులకు ఏకాగ్రత లోపం, మందలింపులు వంటి చికాకులు తప్పవు. ఉద్యోగస్తుల సమర్థతను అధికారులు గుర్తిస్తారు. మీ సంతానం అత్యుత్సాహాన్ని అదుపులో ఉంచండి.
 
కర్కాటకం :- హామీలు, సంతకాల విషయంలో పునరాలోచన అవసరం. బ్యాంకులు, ఏ.టి.ఎం. కౌంటర్ల వద్ద అప్రమత్తంగా ఉండాలి. మీ నూతన ఆలోచనలు క్రియా రూపంలో పెట్టి జయం పొందండి. ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలతో పాటు పనిభారం అధికం. చేసే పనిలో ఏకాగ్రత, పట్టుదల ఎంతో ముఖ్యమని గమనించండి.
 
సింహం :- మీ శ్రీమతి సలహ పాటించడం వల్ల ఒక సమస్య నుంచి బయటపడతారు. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. ఆలయాలను సందర్శిస్తారు. కోళ్ళ, మత్స్య, గొర్రెల వ్యాపారులకు సామాన్యం. ప్రైవేటు చిట్స్, ఫైనాన్సు వ్యాపారులకు ఖాతాదారులతో సమస్యలెదురవుతాయి.
 
కన్య :- బంధువుల రాకతో ఊహించని ఖర్చులు అధికం కావడంవల్ల ఆందోళన పెరుగతుంది. రియల్ ఎస్టేట్ రంగాల వారికి నూతన వెంచర్ల విషయంలో మెళుకువ అవసరం. స్త్రీలకు దైవ, పుణ్యకార్యాల పట్ల ఆసక్తి మరింత పెరుగుతుంది. రాజకీయ నాయకులు సభా, సమావేశాలలో చురుకుగా వ్యవహారిస్తారు.
 
తుల :- ఆర్థికంగా ఎదగటానికి మీరు చేసే యత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. ప్రేమికులు తొందరపాటు చర్యలు ఇబ్బందులకు దారితీస్తాయి. వాహనం నడుపునపుడు మెళుకువ అవసరం. ఒక స్థిరాస్తి కొనుగోలుయత్నం ఫలిస్తుంది. దంపతుల మధ్య చిన్న చిన్నకలహాలు తలెత్తుతాయి. అనుకున్న పనులు త్వరతగతిన పూర్తి చేస్తారు.
 
వృశ్చికం :- పీచు, నార, ఫోము, లెదర్, లాటరీ వ్యాపారస్తులకు సంతృప్తి కానవస్తుంది. మీ సంతానం చదువుల విషయంలో శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. భావోద్వేగాలను అదుపు చేసుకోండి. బంధువులు మీ గురించి చేసిన వ్యాఖ్యలు మనస్తాపం కలిగిస్తాయి. స్త్రీలకు ఇరుగు, పొరుగువారి నుంచి ఆహ్వానాలు అందుకుంటారు.
 
ధనస్సు :- బంధువులను కలుసుకుంటారు. రాజకీయ నాయకులకు విదేశీపర్యటనలు అనుకూలిస్తాయి. ఉద్యోగస్తులకు ఒక ముఖ్య సమాచారం అందుతుంది. స్త్రీలకు పనివారితో ఇబ్బందులు తప్పవు. సన్నిహితులు ఒక వ్యవహారంలో మిమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. పుణ్యక్షేత్ర సందర్శనలు, వనసమారాధనలు ఉల్లాసం కలిగిస్తాయి.
 
మకరం :- ఆర్థిక విషయాలు సంతృప్తిని ఇస్తాయి. పండ్లు, పూలు, కొబ్బరి, వ్యాపారులకు లాభదాయకం. విద్యార్థులు ప్రతిభను చాటుకుంటారు. రాజకీయ వర్గాలకు ఊహించని విధంగా పదవులు దక్కవచ్చు. మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. మీ అభిప్రాయాలు, ఆలోచనలు, గోప్యంగా ఉంచడం క్షేమదాయకం.
 
కుంభం :- కుటుంబ సమస్యలు మెరుగుపడతాయి. ఉద్యోగస్తులకు పై అధికారులనుండి అధికమైన ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. పత్రికా సిబ్బందికి వార్తల ప్రచురణలో పునరాలోచన మంచిది. మీ విజయాన్ని, అభివృద్ధిని చూసి బంధు, మిత్రులు ఆశ్చర్యపోతారు. విద్యార్థుల మొండివైఖరి ఉపాధ్యాయులకు చికాకు కలిగిస్తుంది. 
 
మీనం :- దంపతులకు ఏ విషయంలోను పొత్తు కుదరదు. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. మీరు వృత్తిపరంగా ఎదిగే అవకాశం ఉంది. మాట మాత్రంగా కూడా బంధువులకు, మిత్రులకు హామీలు ఇవ్వకండి.మీ అభిప్రాయాలను నిర్మొహమాటంగా తెలియజేయండి. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు