పూర్తి వివరాలు చూస్తే... గుంటూరు జిల్లా పట్టాభిపురం పోలీసు స్టేషను పరిధిలో కోబాల్ట్ పేటకు చెందిన 17 ఏళ్ల బాలిక అదే ప్రాంతానికి చెందిన 17 ఏళ్ల బాలుడితో ఇన్‌స్టాలో పరిచయం చేసుకున్నది. ఆ పరిచయం కాస్తా ప్రేమకు దారి తీసింది. ఆ తర్వాత ఆ హద్దు దాటేసి శారీరక కలయిక వరకూ వెళ్లింది. ఇద్దరూ పలుమార్లు శారీరకంగా కలిసారు. దీనితో బాలిక గర్భం దాల్చింది. 
	 
	బాలికను కుటుంబ సభ్యులు నిలదీయడంతో అసలు సంగతి బయటకు వచ్చింది. బాలిక కుటుంబ సభ్యులు బాలుడిపై ఫిర్యాదు చేయడంతో పోలీసులు అతడిపై పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఐతే ఈ విషయంలో ఇద్దరిదీ తప్పు కనుక బాలికపైన కూడా కేసు పెట్టాలంటూ పలువురు నెటిజన్లు వాదిస్తున్నారు. పిల్లలు ఏం చేస్తున్నారో పట్టించుకోని తల్లిదండ్రులకు ఇలాంటి ఘటనలు వార్నింగ్ లాంటివని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.