25-04-2023 తేదీ మంగళవారం దినఫలాలు - కార్తీకేయుడిని పూజించినా...

మంగళవారం, 25 ఏప్రియల్ 2023 (04:00 IST)
మేషం :- పోస్టల్, కొరియర్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం తప్పవు. కీలకమైన విషయాల్లో పట్టు సాధిస్తారు. ఉపాధ్యాయులకు ఒత్తిడి అధికమ వుతుంది. శత్రువులు సైతం మిత్రులుగా మారతారు. ఏవైనా చిన్న చిన్న సమస్యలు తలెత్తినా తాత్కాలికమేనని గ్రహించండి. విదేశీ యత్నాల్లో శ్రమాధిక్యత, ప్రయాసలకు లోనవుతారు.
 
వృషభం :- విజ్ఞతతో వ్యవహారించి రుణదాతలను సమాధానపరుస్తారు. కొంతమంది మీ నుంచి పెద్ద మొత్తంలో ధనసహాయం అర్థిస్తారు. ఉద్యోగస్తులకు తోటివారి ధోరణి చికాకు పరుస్తుంది. చిట్స్, ఫైనాన్సు వ్యాపారులకు ఖాతాదారుల వల్ల ఒత్తిడి పెరుగుతుంది. కొన్ని సంఘటనలు మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తాయి.
 
మిథునం :- ప్రభుత్వ మూలక ఇబ్బందులు ఎదురవుతాయి. ప్లీడరు నోటీసులకు ధీటుగా స్పందిస్తారు. దూర ప్రయాణాలలో పరిచయాలు ఏర్పడతాయి. సాంఘిక, సాంస్కృతిక కార్యక్రమాలపట్ల ఆసక్తి పెరుగుతుంది. ఉపాధ్యాయులకు పని భారం తగ్గి ఊపిరి పీల్చుకుంటారు. దంపతుల మధ్య ఏకాగ్రత లోపం అధికమవుతుంది. 
 
కర్కాటకం :- ఉపాధ్యాయులకు విశ్రాంతి లోపం వల్ల అలసట అధికమవుతుంది. పత్రిక, ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులు అనుకూలించవు. అసలైన మీ లక్ష్యాలను చేరుకోవాలంటే పనిపై అంకితభావంతో పనిచేయాల్సి ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ప్రముఖుల ఇంటర్వ్యూ కోసం పడిగాపులు తప్పవు.
 
సింహం :- కొత్త పరిచయాల వల్ల వ్యాపకాలు, కార్యక్రమాలు విస్తృతమవుతాయి. వాదోపవాదాలకు దిగకుండా లౌక్యంగా మీ వ్యవహరాలు చక్కబెట్టుకోవలసి ఉంటుంది. విద్యార్థులు క్యాంపస్ సెలక్షన్లలో విజయం సాధిస్తారు. దైవ సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. నూతన ఎగ్రిమెంట్లు వాయిదా వెయ్యండి.
 
కన్య :- శ్రీవారు, శ్రీమతి గౌరవ ప్రతిష్టలకు భంగం కలిగించే పరిణామాలు ఎదుర్కొంటారు. క్రీడల పట్ల ఆసక్తి పెరుగుతుంది. దేవాలయ, విద్యా సంస్థలకు దానధర్మాలు చేయడం వల్ల మంచి పేరు, ఖ్యాతి లభిస్తుంది. నేడు అనుకూలించని వ్యవహారం రేపు సానుకూలం కాగలదు. పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు.
 
తుల :- వ్యాపారాలు అనవసర వ్యవహారాలకు దూరంగా ఉండటం వల్ల మేలు చేకూరుతుంది. కుటుంబ అవసరాలకు, మీ సంతానం కోసం ఫీజులు, బిల్లులు చెల్లిస్తారు. రచయితలకు, పత్రికా రంగంలో వారికి కీర్తి, గౌరవలు పెరుగుతాయి. భాగస్వామిక సమావేశాల్లో మీ అభిప్రాయాలను స్పష్టంగా వ్యక్తం చేయాలి.
 
వృశ్చికం :- స్త్రీలకు అలంకారాలు, గృహోపకరణాల పట్ల మక్కువ సన్నగిల్లుతుంది. అధికారుల హోదా పెరగటంతో పాటు స్థానచలనం ఉంటుంది. దైవ, పుణ్య, సేవా కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. రావలసిన మొండిబాకీలు సైతం వసూలవుతాయి. ప్లీడరు నోటీసులకు ధీటుగా స్పందిస్తారు. వాహనం నిదానంగా నడపండి.
 
ధనస్సు :- ఆర్థిక ఒడిదుడుకులు తలెత్తిన నెమ్మదిగా సమసిపోతాయి. గృహ ప్రశాంతత మీ చేతుల్లోనే ఉందని గమనించండి. ఉద్యోగస్తులు ఒత్తిళ్ళు, ప్రలోభాలకు దూరంగా ఉండటం మంచిది. మీరు ఊహించిన దానికంటే అధికంగా వ్యయం అవుతుంది. మీ అలవాట్లు, బలహీనతలు అదుపులో ఉంచుకోవటం మంచిది.
 
మకరం :- కొంతమంది మీ నుంచి పెద్ద మొత్తంలో ధనసహాయం అర్థిస్తారు. వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం. మీ మౌనం వారికి గుణపాఠమవుతుంది. మీ సంతానంతో దైవ, సేవా, పుణ్య కార్యక్రమాలలో పాల్గొంటారు. కాంట్రాక్టర్లు, బిల్డర్లకు నిర్మాణ పనుల్లో పనివారలతో చికాకులు తప్పవు.
 
కుంభం :- ఉత్తర ప్రత్యుత్తరాలు సమర్థంగా నిర్వహిస్తారు. అనుకూలతలున్నా మీ యత్నాలు మందకొడిగా సాగుతాయి. నిరుద్యోగులకు బోగస్ ప్రకటనల వల్ల అప్రమత్తత అవసరం. ఉపాధ్యాయులకు శ్రమాధిక్యత తప్పదు. స్త్రీలు వైద్య పరీక్షలు చేయించుకోవటం ఉత్తమం. వీలైనంత వరకూ మీ పనులు మీరే చూసుకోవటం ఉత్తమం.
 
మీనం :- బ్యాంకుల్లో మీ పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కోవలసివస్తుంది. ఉద్యోగస్తులకు ఏకాగ్రతలోపం వల్ల పై అధికారులతో మాటపడవలసివస్తుంది. దైవదర్శనాలు, మొక్కుబడులు అనుకూలిస్తాయి. కోర్టు వ్యవహారాలు అనుకున్నవిధంగా సమయానికి పూర్తి కాగలవు. బంధువులతో తెగిపోయిన సంబంధాలు బలపడ తాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు