23-04-2023 తేదీ ఆదివారం దినఫలాలు - ఆదిత్యుని ఎర్రని పూలతో పూజించిన...

ఆదివారం, 23 ఏప్రియల్ 2023 (04:00 IST)
మేషం :- కుటుంబీకులతో కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు. ఇతరులకు ఉచిత సలహా ఇచ్చి ఇబ్బందులకు గురికాకండి. గత అనుభవాలు గుర్తుకు వస్తాయి. స్త్రీలకు కాళ్లు, నడుము, నరాలకు సంబంధించిన చికాకులు ఎదుర్కొనక తప్పదు. కొబ్బరి, పండ్లు, పూలు, చిరు వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది.
 
వృషభం :- మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. ట్రాన్స్‌పోర్టు, ఆటోమొబైల్, మెకానికల్ రంగాల వారికి కలిసిరాగలదు. రాజకీయాలలో వారికి మంచి గుర్తింపు లభిస్తుంది. వీలైనంత వరకూ మీ పనులు మీరే చూసుకోవటం ఉత్తమం. సన్నిహితుల సలహాలు, హితోక్తులు మీ పై మంచి ప్రభావం చూపుతాయి.
 
మిథునం :- హోటల్ తినుబండ వ్యాపారస్తులకు సంతృప్తి కానవచ్చును. సోదరి, సోదరులతో అవగాహన కుదరదు. ఎదురుచూడని అవకాశాలు దగ్గరకు వస్తాయి. ఉపాధ్యాయులు విశ్రాంతికై చేయుయత్నాలు ఫలిస్తాయి. స్త్రీలు గృహోపకరణ వస్తువులను అమర్చుకుంటారు. పెద్దల ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించుట మంచిది.
 
కర్కాటకం :- ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తికరంగా సాగుతాయి. చేపట్టిన పనులు సక్రమంగా నిర్వర్తించలేకపోవటం వలన ఒకింత ఒత్తిడికి గురవుతారు. తోటివారి నుంచి స్వల్ప పేచీలు ఉండగలవు. కుటుంబీకుల పట్ల ఆసక్తి పెరుగును. షాపింగ్ దుబారా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. స్త్రీలకు పనిభారం అధికమవుతుంది.
 
సింహం :- అనుకున్నవి సాధించి, ఎనలేని తృప్తిని పొందుతారు. నూతన గృహం కొనుగొలుకై చేయుప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యవసాయ రంగంలో వారికి వాతావరణంలో మార్పు సంతృప్తినిస్తుంది. చిన్న చిన్న విధులను సైతం ఎక్కువ శ్రద్ధతో నిర్వర్తించే ప్రయత్నం చేయండి. ఓ మంచి వ్యక్తి అభిమానాన్ని పొందుతారు.
 
కన్య :- స్త్రీలకు వాహనం నడుపుతున్నపుడు ఏకాగ్రత ముఖ్యం. విందు వినోదాలలో పాల్గొంటారు. ఎప్పటి నుండో వాయిదా పడుతూ వస్తున్న పనులు పునఃప్రారంభమవుతుంది. సన్నిహితుల సలహాలు, హితోక్తులు మీ పై మంచి ప్రభావం చూపుతాయి. ప్రత్తి, పొగాకు, చెరకు రైతులకు, స్టాకిస్టులకు అనుకూలమైన కాలం.
 
తుల :- గృహంలో మార్పులు, చేర్పులు అనుకూలిస్తాయి. పనివారలతో సమస్యలు తలెత్తగలవు. జాగ్రత్త వహించండి. ప్రియతముల కోసం విలువైన వస్తువులు సమకూర్చుకుంటారు. స్టేషనరీ ప్రింటింగ్ రంగాలవారికి శుభం చేకూరుతుంది. రహస్య విరోధులు అధికం కావడంవల్ల రాజకీయాల్లో వారికి ఆందోళన తప్పదు.
 
వృశ్చికం :- ఆకస్మికంగా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. కొన్ని సంఘటనలు మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తాయి. యాదృచ్ఛికంగా ఒక పుణ్యక్షేత్రం సందర్శిస్తారు. నిరుద్యోగులకు తాత్కాలిక అవకాశాలు లభిస్తాయి. స్త్రీలకు శ్రమకు తగిన గుర్తింపు, రాణింపు లభిస్తుంది.
 
ధనస్సు :- మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. వాహనం నడుపునపుడు మెళుకువ అవసరం. బంధువుల రాకతో ఖర్చులు అధికమవుతాయి. ఏ విషయంలోను హామీ ఇవ్వకుండా లౌక్యంగా దాటవేయండి. విందులలో పరిమితిపాటించండి. మీరు దేనిని నమ్ముతారో ఆ విషయమై ఇతరులతో ధైర్యంగా మాట్లాడండి.
 
మకరం :- విద్యార్థినులు ప్రేమ వ్యవహరాలకు దూరంగా ఉండట మంచిది. వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం. లెక్కకు మించిన బాధ్యతలతో సతమతమవుతారు. రాజకీయ, కళారంగాల వారికి సన్మానం జరిగే అవకాశం ఉంది. సన్నిహితులతో కలిసి దైవ, శుభకార్యాలలో పాల్గొంటారు.
 
కుంభం :- దూరపు బంధువులను కలుసుకొని ఆసక్తికరమైన విషయాలు చర్చిస్తారు. నిరుద్యోగులు ఉపాధి పథకాల్లో రాణిస్తారు. దూర ప్రయాణాలలో కొత్త పరిచయాలు ఏర్పడతాయి. సభలు, సమావేశాలలో హుందాగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు. సోదరీ, సోదరుల మధ్య సత్సంబంధాలు నెలకొంటాయి.
 
మీనం :- దైవ సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. ప్రముఖులను కలుసు కుంటారు. రాజకీయ నాయకులకు ప్రయాణాలలో మెళుకువ అసవరం. ఖర్చులు, చెల్లింపులు ప్రయోజనకరంగా ఉంటాయి. ఉమ్మడి వ్యాపారాలు, జాయింట్ వెంచర్లు ప్రగతిపథంలో కొనసాగుతాయి. బంధువుల నుంచి అవమానాలను ఎదుర్కొంటారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు