25-09-2022 ఆదివారం దినఫలాలు - సూర్య స్తుతి ఆరాధించిన శుభం..

ఆదివారం, 25 సెప్టెంబరు 2022 (04:04 IST)
మేషం :- ఉమ్మడి వ్యాపారాలు, లీజు, ఏజెన్సీ వ్యవహరాలకు సంబంధించిన విషయాలలో మెళకువ వహించండి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. విద్యారులు క్రీడా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఖర్చులు మీరాబడికి మించటం వల్ల స్వల్ప ఒడిదుడుకులు తప్పవు. స్త్రీలు అనవసర విషయాలకు దూరంగా ఉండటం క్షేమదాయకం.
 
వృషభం :- వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం. గృహంలో మార్పులు, చేర్పులు అనుకూలిస్తాయి. రాజకీయనాయకులకు సభలు, సత్కార్యాలలో మంచి గుర్తింపు లభిస్తుంది. ఉపాధ్యాయులకు విశ్రాంతి లభిస్తుంది. నిరుద్యోగులు భవిష్యత్ గురించి పథకాలు వేసిన సత్ఫలితాలు పొందుతారు.
 
మిథునం :- వ్యాపార వర్గాల వారి మాటతీరు, స్కీములు కొనుగోలుదార్లను ఆకట్టుకుంటాయి. ఉద్యోగస్తులు విశ్రాంతికై చేయు యత్నాలు ఫలిస్తాయి. ఆధ్యాత్మిక, సాంఘిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. అనుకున్న పనులు వాయిదా పడటం లేక జాప్యం వంటి చికాకులు తప్పవు. విదేశీ వస్తువుల పట్ల ఆకర్షితులౌతారు.
 
కర్కాటకం :- మీ విషయంలో బంధువులు, ఇతరుల ప్రమేయం లేకుండా జాగ్రత్త వహించండి. పెద్దలను, ప్రముఖులను కలుసుకోగలుగుతారు. ఆహార వ్యవహారాల్లో మెళకువ వహించండి. మీరు చేసిన పనికి ప్రత్యుపకారం పొందుతారు. ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణాలు మంచిదికాదు అని గమనించండి.
 
సింహం :- ధనం విరివిగా వ్యయమైనా సార్థకత, ప్రయోజనం ఉంటాయి. ఏదైనా అమ్మకానికి చేయుయత్నాలు ఫలిస్తాయి. మీ కుటుంబీకులు మీ మాటా, తీరును వ్యతిరేకిస్తారు. ప్రతి విషయంలోను నిర్మొహమాటంగా మీ అభిప్రాయాలు తెలియజేయండి. నిత్యవసర వస్తు వ్యాపారులకు స్టాకిస్టులకు కలి కలిసిరాగలదు.
 
కన్య :- మీ ఆశయసిద్ధికి నిరంతర శ్రమ, పట్టుదల అవసరమని గమనించండి. స్త్రీలు ఇతరుల కుటుంబ విషయాల్లో తలదూర్చటం వల్ల మాటపడక తప్పదు. పెరిగిన ధరలు, చాలీచాలని ఆదాయంతో సతమతమవుతారు. వాహనం నడుపునపుడు ఏకాగ్రత అవసరం. సహోద్యోగులతో కలిసి సభ, సమావేశాలలో పాల్గొంటారు.
 
తుల :- ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్, కంప్యూటర్ రంగాల వారికి పురోభివృద్ధి. బంధు మిత్రులతో కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు. విద్యార్థులు ప్రేమ వ్యవహారాల్లో అతిగా వ్యవహరించి చిక్కుల్లో పడతారు. అధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో మంచి గుర్తింపు లభిస్తుంది. మత్స్య, కోళ్ళ, గొర్రెల వ్యాపారస్తులకు లాభదాయకం. 
 
వృశ్చికం :- వ్యాపారాలు ఊపందుకుంటాయి. వ్యవహార ఒప్పందాల్లో మొహమ్మాటాలకు తావివ్వకండి. ఆకర్షణీయమైన పథకాలతో అందరినీ ఆకట్టుకుంటారు. అధికారులు ధనప్రలోభాలకు దూరంగా ఉండాలి. కళ, క్రీడా కారులకు ప్రోత్సాహకరం. విందులు, వినోదాల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. ఖర్చులు అధికం. 
 
ధనస్సు :- ఆర్థిక లావాదేవీల్లో ఒత్తిడి, హడావుడి అధికంగా ఉంటాయి. ఒక విషయంలో ఆప్తుల సలహా పాటించనందుకు కించిత్ పశ్చాత్తాపం చెందుతారు. ఇతరులతో పోల్చుకుని నిరుత్సాహం చెందుతారు. అవసరాలకు అతికష్టంమ్మీద ధనం అందుతుంది. నిరుద్యోగులకు ఒక ప్రకటన ఎంతో ఆసక్తి కలిగిస్తుంది.
 
మకరం :- మనోధైర్యంతో యత్నాలు సాగించండి. ఉద్యోగస్తుల సమర్థతకు పై అధికారుల నుండి గుర్తింపు, మన్ననలు లభిస్తాయి. ఖర్చులు మీ రాబడికి తగినట్లుగానే ఉండగలవు. ఆహ్వానం అందుతుంది. చేపట్టిన పనుల్లో ఒత్తిడి, జాప్యం, చికాకులు ఎదుర్కుంటారు. బంధువులతో విభేదాలు, పట్టింపులు తలెత్తుతాయి. 
 
కుంభం:- ఎవరినీ అతిగా విశ్వసించటం మంచిది కాదు. పాతబాకీలు వసూలవుతాయి. మిమ్మల్ని పొగిడే వారే కానీ సహకరించే వారుండరు. సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. ఏజెంట్లకు, బ్రోకర్లకు శ్రమ, విశ్రాంతి లోపంవంటి చికాకులను ఎదుర్కొంటారు. వ్యాపారాల్లో నిలదొక్కుకోవడానికి కొత్త ప్రణాళికలు రూపొందిస్తారు. 
 
మీనం :- కొబ్బరి, పండ్ల, పూల, చిరు వ్యాపారులకు, చిన్నతరహా పరిశ్రమల వారికి అన్నివిధాలా కలిసివస్తుంది. మీ కోపాన్ని, చిరాకును ఎక్కువగా ప్రదర్శించటం మంచిది కాదు. ధనవ్యయం, చెల్లింపులకు సంబంధించిన విషయాలలో మెళకువ వహించండి. మీ శ్రీమతికి మీరంటే ప్రత్యేకాభిమానం కలుగుతుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు