29-10-2023 ఆదివారం రాశిఫలాలు - అనంతపద్మనాభస్వామిని ఆరాధించిన శుభం...

ఆదివారం, 29 అక్టోబరు 2023 (04:00 IST)
మేషం :- దైవ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. ద్విచక్రవాహనంపై దూర ప్రయాణాలు క్షేమంకాదు. పీచు, ఫోం, లెదర్ వ్యాపారస్తులకు ఆశించినంత పురోభివృద్ధి ఉండదు. బ్యాంకుల్లో మీ పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కోవలసి వస్తుంది. స్త్రీలకు విలాస వస్తువులు, అలంకారాల పట్ల ఆసక్తి పెరుగుతుంది.
 
వృషభం :- వృత్తి వ్యాపారాల్లో రాణిస్తారు. స్త్రీలకు అకాలభోజనం వల్ల ఆరోగ్యంలో సమస్యలను ఎదుర్కొంటారు. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానికల్, కంప్యూటర్ రంగాల వారికి సామాన్యం. వాహనం, గృహోపకరణాలు సమకూర్చుకుంటారు. మీ బంధవులను సహాయం అర్ధించే బదులు మీరే ప్రత్యామ్నాయం చూసుకోవటం ఉత్తమం.
 
మిథునం :- నిరుద్యోగులకు అపరిచిత వ్యక్తుల విషయంలో అప్రమత్తంగా వ్యవహరించవలసి ఉంటుంది. మీ వాహనం ఇతరులకిచ్చి ఇబ్బందులకు గురవుతారు. వృత్తి, వ్యాపారాలలో పురోభివృద్ధి పొందుతారు. కోర్టు వ్యవహారాలు మీరు కోరుకున్నట్టుగానే వాయిదా పడతతాయి. స్త్రీల వాక్చాతుర్యానికి మంచి గుర్తింపు లభిస్తుంది.
 
కర్కాటకం :- ఉద్యోగ రీతా దూరప్రయాణాలు ఇబ్బంది కలిగిస్తాయి. నూతన వ్యక్తుల పరిచయం మీ అభివృద్ధికి ఎంతో దోహద పడుతుంది. ఆలయాలను సందర్శిస్తారు. మీ చెంత ధనం ఉందన్న విషయాన్ని గోప్యంగా ఉంచండి. ఇతరుల గురించి అనాలోచితంగా చేసిన వ్యాఖ్యానాలు సమస్యలకు దారితీయవచ్చు జాగ్రత్త వహించండి.
 
సింహం :- ఆధ్యాత్మిక కార్యక్రమాలపట్ల ఆసక్తి పెరుగుతుంది. వస్త్ర, బంగారు, వెండి రంగాలలో వారికి అనుకూలమైన కాలం. వాహనం నడుపునపుడు జాగ్రత్త అవసరం. స్పెక్యులేషన్ కలసిరాదు. గృహంలో మార్పులు అనుకూలిస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు.
 
కన్య :- పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. చిన్న చిన్న పొరపాట్లే సమస్యలకు దారితీస్తాయి. నిరుద్యోగులకు ఇంటర్వ్యూల్లో ఏకాగ్రత వహించినా సత్ఫలితాలు పొందగలరు. స్థిరాస్తి క్రయ, విక్రయాలు వాయిదా వేయటం మంచిది. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులకు గురికాకండి. స్త్రీలకు సంపాదపట్ల ఆసక్తి పెరుగుతుంది.
 
తుల :- సోదరీ సోదరుల వైఖరి మనస్థాపం కలిగిస్తుంది. కొన్ని సంఘటనలు పదేపదే జ్ఞప్తికి వస్తాయి. ఏది జరిగినా మంచికేనని భావించండి. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్ల ధోరణి ఆందోళన కలిగిస్తుంది. రాజకీయాలలో వారు ప్రత్యర్ధులు పెరుగుతున్నారు అని గమనించండి. మీ సంతానం మొండివైఖరి మీకుఎంతో చికాకులను కలిగిస్తుంది.
 
వృశ్చికం :- మీ వాహనం ఇతరులకు ఇవ్వవద్దు. వృత్తిపరంగా చికాకులు, ఆటుపోట్లు ఎదుర్కుంటారు. స్త్రీలకు అలంకరణలు, ఆడంబరాల పట్ల ఆసక్తి నెలకొంటుంది. ఆర్థిక లావాదేవీలు, ముఖ్యమైన వ్యవహారాలపై దృష్టి సారిస్తారు. ఖర్చులు ప్రయోజనకరం. వేధింపుల అధికారి బదిలీ వార్త ఉద్యోగస్తులకు సంతోషం కలిగిస్తుంది.
 
ధనస్సు :- నిరుద్యోగులకు తాత్కాలిక అవకాశం లభిస్తుంది. రేషన్ డీలర్లకు కొత్త సమస్యలు తలెత్తే సూచనలున్నాయి. వాహనం నడుపునపుడు ఏకాగ్రత అవసరం. ప్రైవేటు సంస్థల్లో వారు, ఓర్పు, అంకితభావంతో పనిచేయవలసి ఉంటుంది. ఏ విషయంలోను తొందరపడక బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవలసి ఉంటుంది.
 
మకరం :- వ్యాపారాల్లో ఒడిదుడుకులు, స్వల్ప నష్టాలు ఎదుర్కుంటారు. ఏ పని మొదలెట్టినా ఆటంకాలు ఎదురవుతాయి. స్త్రీలకు విదేశీ వస్తువులపట్ల ఆసక్తి పెరుగుతుంది. ఇసుక, క్వారీ కాంట్రాక్టర్లకు అభ్యంతరాలు, ఇతరత్రా సమస్యలు అధికం. విద్యార్థులు ఇతురుల వాహనం నడిపి ఇబ్బందులకు గురికాకండి.
 
కుంభం :- ఉపాధ్యాయులకు, మార్కెటింగ్ రంగాల వారికి ఒత్తిడి అధికమవుతుంది. ఆపద సమయంలో బంధువులు అండగా నిలుస్తారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. మీ పిల్లల వైఖరి చికాకు కలిగిస్తుంది. మీ శ్రీమతి వ్యాఖ్యలు మీపై బాగా ప్రభావం చూపుతాయి. రాజకీయాలలో వారికి కార్యకర్తల వల్ల సమస్యలు తలెత్తగలవు.
 
మీనం :- బంధువుల రాక ఆనందం కలిగిస్తుంది. స్థిరాస్తి అమ్మకంపై ఒత్తిడి, చికాకుల వల్ల ఆందోళనలకు గురవుతారు. ఇతరులతో అతిగా మాట్లాడటం మీ శ్రీమతికి నచ్చకపోవచ్చు. రావలసిన ధనం చేతికందుతుంది. సోదరీ, సోదరులతో ఏకీభవించలేకపోతారు. మీ అభిరుచులకు తగిన విధంగా కుటుంబ సభ్యులు మసలుకుంటారు.  
 
  

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు