మేషం :- గతంలోనిలిపి వేసిన వ్యాపారాలు, పనులు పునఃప్రారంభించటానికి చేయుయత్నాలు కలిసివస్తాయి. సాంఘిక, సేవా కార్యక్రమాలలో చురుకుగా వ్యవహరిస్తారు. ఉద్యోగస్తుల శ్రమకు, నైపుణ్యతకు అధికారుల నుండి ప్రసంశలు లభిస్తాయి. సన్నిహితుల ద్వారా అందుకున్న ఒక సమాచారం మీకెంతో ఉపకరిస్తుంది.
వృషభం : - ట్రాన్స్‌పోర్టు, ఆటోమొబైల్, మెకానికల్ రంగాల వారికి మిశ్రమ ఫలితం. కొంతమంది మిమ్ములను ధనసహాయం లేక హామీలు కోరవచ్చు. ఉపాధ్యాయులకు మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. చేపట్టిన పనుల్లో కొంత ముందు వెనుకలుగానైనను సంతృప్తి కానరాగలదు. ప్రయాణాలలో మెళకువ అసవరం.
మిథునం :- ఇతరుల కారణంగా మీ కార్యక్రమాలు వాయిదా పడటంతో కొంత నిరుత్సాహానికి గురవుతారు. విద్యార్ధులకు ఏకాగ్రత చాలా అవసరమని గమనించండి. నూతన పరిచయాలు ఏర్పడతాయి. ఉపాధ్యాయులకు బరువు బాధ్యతలు అధికం అవుతాయి. హోటల్, తినుబండరాలు వ్యాపారస్తులకు పురోభివృద్ధి కానవస్తుంది.
కర్కాటకం :- ముఖ్యులతో సంభాషించేటపుడు మెళకువ వహించండి. స్థిరచరాస్తుల విషయంలో ముఖ్యుల మధ్య విభేదాలు తలెత్తే ఆస్కారం ఉంది మెళకువ అవసరం. మార్కెటింగ్, ప్రైవేటు సంస్థలలోనివారు అధిక శ్రమ, ఒత్తిడికి గురవుతారు. చేపట్టిన పనుల్లో కొంత ముందు వెనుకలుగానైనను సంతృప్తి కానరాగలదు.
సింహం :- ఎలక్ట్రికల్, ఎలక్ట్రానికల్, కంప్యూటర్ రంగాల వారికి కలిసివచ్చేకాలం. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. ఊహించని ఖర్చులు, ఇతరత్రా చెల్లింపుల వల్ల చికాకులు తప్పవు. నిరుద్యోగులకు మధ్యవర్తుల పట్ల అప్రమత్తత అవసరం. ఆలయాలను సందర్శిస్తారు. ప్రత్యర్థులు మిత్రులుగా మారి సహాయం అందిస్తారు.
కన్య :- ఆర్థిక లావాదేవీలు అనుకూలంగా ఉంటాయి. బ్యాంకు పనులు వాయిదాపడతాయి. చిన్నచిన్న విషయాలలో ఉద్రేకంమాని తెలివి తేటలతో ముందుకుసాగి జయం పొందండి. స్త్రీలకు చుట్టుపక్కల వారితో సంబంధ బాంధవ్యాలు నెలకొని ఉంటాయి. భాగస్వామికుల మధ్య నూతన విషయాలు చర్చకు వస్తాయి.
తుల :- బంధు మిత్రులతో కలిసి సరదాగా గడుపుతారు. కోర్టు వ్యవహారాలు వాయిదపడుట మంచిది. కుటుంబీకుల ఆరోగ్యం విషయంలో ఏకాగ్రత వహించండి. విద్యార్థులకు తమ ధ్యేయం పట్ల ఆసక్తి, శ్రద్ధ పెరుగుతాయి. ప్రయోజనకరమైన విషయాలు చర్చించి సత్ఫలితాలు పొందుతారని చెప్పవచ్చు.
వృశ్చికం :- ఆలయాలను సందర్శిస్తారు. ముఖ్యమైన వ్యవహారాలు గోప్యంగా ఉంచండి. స్త్రీలకు సన్నిహితుల నుండి అందిన ఆహ్వానాలు సంతృప్తినిస్తాయి. నిరుద్యోగులకు శ్రమాధిక్యత మినహా ఆశించిన ఫలితాలు పొందలేరు. వ్యవసాయదారులు త్వరితగతిన నిర్ణయాలు తీసుకోవడం వల్ల సంతృప్తి పొందుతారు. ఖర్చులు అధికమవుతాయి.
ధనస్సు :- గృహోపరణాలకు కావలసిన వస్తువులను కొనుగోలు చేస్తారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. వాతావరణంలో మార్పు వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. రావలసిన ధనం అనుకోకుండా చేతికందును. కోర్టు వ్యవహారాలలో ప్లీడర్ల తీరు ఆందోళన కలిగిస్తుంది. సాంఘిక, సేవా కార్యక్రమాలలో చురుకుగా వ్యవహరిస్తారు.
మకరం :- స్త్రీలతో కలహములు, అన్నికార్యములయందు విఘ్నములు ఎదుర్కొంటారు. మాట్లాడలేనిచోట మౌనం వహించడం మంచిది. ఉద్యోగస్తుల శ్రమకు, నైపుణ్యతకు అధికారుల నుండి ప్రసంశలు లభిస్తాయి. సొంత వ్యాపారాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. కోర్టు వ్యవహారాలలో ప్లీడర్ల తీరు ఆందోళన కలిగిస్తుంది.
కుంభం :- పాతమిత్రుల కలయికతో మీలో కొత్త ఉత్సాహం, ఆలోచనలు స్ఫురిస్తాయి. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. స్త్రీలతో సంభాషించేటపుడు సంయమనం పాటించండి. విద్యార్ధినులకు ఏకాగ్రతా లోపం వల్ల ఆందోళన తప్పదు. ఫైనాన్సు, బ్యాంకింగ్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం తప్పదు.
మీనం :- ఉపాధ్యాయులకు ఒత్తిడి, విశ్రాంతి లోపం వంటి చికాకులు అధికమవుతాయి. గృహంలో మార్పులు, చేర్పులకై చేయు యత్నాలు ఫలిస్తాయి. మీ పట్టుదల, అంకితభావం ఇతరులకు మార్గదర్శకమవుతుంది. బంధువులను కలుసుకుంటారు. వైద్యుల తొందరపాటు చర్యలు, నిర్లక్ష్యం వల్ల కొత్త సమస్యలెదుర్కోవలసి వస్తుంది.