01-12-2021 నుంచి 31-12-2021 వరకు మీ మాస ఫలితాలు

మంగళవారం, 30 నవంబరు 2021 (23:41 IST)
మేషరాశి: అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం
ఈ మాసం ప్రథమార్థం నిరాశాజనకం. ప్రతికూలతలతో సతమతమవుతారు. రుణ ఒత్తిళ్లతో మనశ్శాంతి వుండదు. ప్రతి విషయంలోను ఆచితూచి అడుగేయాలి. తొందరపాటు నిర్ణయాలు తగదు. ఆత్మీయుల సాయంతో ఒక సమస్య సద్దుమణుగుతుంది. వివాహ యత్నాలు తీవ్రంగ సాగిస్తారు. జాతక పొంతన ప్రధానం. మధ్యవర్తులను విశ్వసించవద్దు. గృహంలో మార్పుచేర్పులకు అనుకూలం. ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. చెల్లింపులు, అవసరాలు వాయిదా వేసుకుంటారు. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. పదవుల నుంచి తప్పుకుంటారు. గృహంలో స్తబ్దత నెలకొంటుంది. వ్యాపారాభివృద్ధికి మరింత శ్రమించాలి. ఉద్యోగస్తులకు పనిభారం, విశ్రాంతిలోపం. అధికారులకు వీడ్కోలు పలుకుతారు. కార్మికులకు పనులు లభిస్తాయి. పుణ్యక్షేత్రాలు, కొత్త ప్రదేశాలు సందర్శిస్తారు.

 
వృషభరాశి: కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు
ఆదాయ వ్యయాలకు పొంతన వుండదు. దుబారా ఖర్చులు విపరీతం. సంప్రదింపులు ముందుకు సాగవు. ఓర్పుతో యత్నాలు సాగించండి. సలహాలు, సాయం ఆశించవద్దు. ఆలోచనలతో సతమతమవుతారు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. అయినవారు మీ అసక్తతను అర్థం చేసుకుంటారు. ఆప్తుల హితవు మీపై సత్ప్రభావం చూపుతుంది. ఇంటి విషయాలపై శ్రద్ధ వహిస్తారు. ఒక ఆహ్వానం ఉత్సాహాన్నిస్తుంది. ఆరోగ్యం సంతృప్తికరం. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. ఇతరులను మీ విషయాలకు దూరంగా వుంచండి. విలువైన వస్తువులు, పత్రాలు జాగ్రత్త. ఉద్యోగ బాధ్యతల్లో మెలకువ వహించండి. సహోద్యోగులతో జాగ్రత్త. వృత్తి, వ్యాపారాల్లో రాణింపు, అనుభవం గడిస్తారు. ఉద్యోగ బాధ్యతల్లో మెలకువ వహించండి. సహోద్యోగులతో జాగ్రత్త. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. దీక్షలు స్వీకరిస్తారు. వాహనం ఇతరులకివ్వవద్దు.

 
మిధునరాశి: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
శుభవార్తలు వింటారు. కష్టం ఫలిస్తుంది. ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. పదవులు అందుకుంటారు. బాధ్యతగా వ్యవహరించాలి. సాధ్యం కాని హామీలివ్వవద్దు. ఖర్చులు విపరీతం. మీ ఉన్నతిని చాటుకోవడానికి విపరీతంగా వ్యయం చేస్తారు. మీ సహాయంతో ఒకరికి సదవకాశం లభిస్తుంది. విలువైన వస్తువులు, నగదు జాగ్రత్త. బంధుమిత్రుల రాకపోకలు అధికమవుతాయి. గృహం సందడిగా వుంటుంది. కీలక పత్రాలు అందుకుంటారు. మీ శ్రీమతి ఆరోగ్యం మెరుగుపడుతుంది. సంతానం అత్యుత్సాహం అదుపు చేయండి. చిన్ననాటి పరిచయస్తులు తారసపడతారు. వ్యాపారాల్లో ఒడిదుడుకులు దీటుగా ఎదుర్కొంటారు. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. సరుకు నిల్వలో జాగ్రత్త. వృత్తి ఉపాధి పథకాలు సంతృప్తినిస్తాయి. సన్మాన, సాహిత్య సభల్లో పాల్గొంటారు.

 
కర్కాటక రాశి: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
ఈ మాసం యోగదాయకమే. ధనలాభం, వస్త్రప్రాప్తి ఉన్నాయి. వ్యవహారాలను సమర్థవంతంగా నడిపిస్తారు. కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి. ఉత్సాహంగా గడుపుతారు. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. ఆప్తులకు సాయం అందిస్తారు. గౌరవ ప్రతిష్టలు ఇనుమడిస్తాయి. ఆశించిన పదవులు దక్కకపోవచ్చు. ఏది జరిగినా మంచికేనని భావించండి. యత్నాలు విరమించుకోవద్దు. మీ కృషి నిదానంగా ఫలిస్తుంది. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. సంతానం కదలికలపై దృష్టి పెట్టండి. ఏ విషయాన్ని తేలికగా తీసుకోవద్దు. ఆహ్వానం అందుకుంటారు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. వస్త్ర, పచారీ వ్యాపారాలు ఊపందుకుంటాయి. చిన్న వ్యాపారులకు ఆశాజనకం. ఉద్యోగస్తులకు ధన ప్రలోభం తగదు. అధికారులకు హోదామార్పు. ముఖ్యులకు వీడ్కోలు పలుకుతారు.


సింహ రాశి: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
అన్ని రంగాల వారికి శుభదాయకమే. కుటుంబ సౌఖ్యం, ప్రశాంతత పొందుతారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. వ్యూహాత్మకంగా వ్యవహరిస్తారు. ఆదాయం సంతృప్తికరం. ఖర్చులు అధికం, సంతృప్తికరం. పెట్టుబడులపై దృష్టిపెడతారు. పెద్దమొత్తం ధనసహాయం తగదు. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. సంస్థల స్థాపనలకు అనుమతులు మంజూరవుతాయి. బాధ్యతల నుంచి తప్పుకుంటారు. ఆప్తుల కలయిక ఉల్లాసాన్నిస్తుంది. వేడుకకు సన్నాహాలు సాగిస్తారు. విలువైన వస్తువులు, పత్రాలు జాగ్రత్త. సంతానం చదువులపై శ్రద్ధ వహించండి. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. పెద్దమొత్తం సరుకునిల్వ తగదు. వృత్తుల వారికి ఆదాయాభివృద్ధి. మార్కెట్ రంగాల వారికి ఒత్తిడి అధికం. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి.

 
కన్యరాశి: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
రావలసిన ధనం అందుతుంది. ప్రణాళికలు వేసుకుంటారు. అంచనాలు ఫలిస్తాయి. వ్యవహారాలతో తీరిక వుండదు. శ్రమాధిక్యత అకాలభోజనం. పదవుల కోసం యత్నాలు సాగిస్తారు. గుట్టుగా వ్యవహరించండి. అపరిచితులతో జాగ్రత్త. ఆర్థిక విషయాలు వెల్లడించవద్దు. సంతానం భవిష్యత్తుపైన దృష్టి పెడతారు. ఒక సమాచారం తీవ్రంగా ఆలోచింపజేస్తుంది. దంపతులకు కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి. భవన నిర్మాణాలు మందకొడిగా సాగుతాయి. ఆరోగ్యం సంతృప్తికరం. ఉమ్మడి వ్యాపారాలు కలిసివస్తాయి. చిన్న వ్యాపారులకు స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులుండవు. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం. వైద్య, సాంకేతక, సేవా రంగాల వారికి ఆదాయాభివృద్ధి. పాత పరచియస్తులను కలుసుకుంటారు. వేడుకల్లో అత్యుత్సాహం తగదు. 

 
తులారాశి: చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
పరిస్థితులు క్రమంగా మెరుగుపడతాయి. వ్యవహార దక్షతతో నెట్టుకొస్తారు. మీ నిజాయితీకి ప్రశంసలు లభిస్తాయి. ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి. అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు. ఖర్చులు అదుపులో వుండవు. విలాస వస్తువులు కొనుగోలు చేస్తారు. బంధుమిత్రుల రాకపోకలు అధికమవుతాయి. పనులు, బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. కీలక పత్రాలు అందుకుంటారు. గృహమార్పు కలిసివస్తుంది. శుభకార్యానికి యత్నాలు సాగిస్తారు. అవివాహితులకు శుభవార్తా శ్రవణం. నిరుద్యోగులకు ఉపాధి శిక్షణ లభిస్తుంది. ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. ఉద్యోగస్తులకు ధనప్రలోభం తగదు. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. కళ, క్రీడాకారుకు ప్రోత్సాహకరం. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి.

 
వృశ్చిక రాశి: విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ట
లక్ష్యసాధనలో సఫలీకృతులవుతారు. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. మానసికంగా కుదుటపడతారు. గృహం ప్రశాంతంగా వుంటుంది. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. ఖర్చులు సామాన్యం. పరిచయస్తులు ధనసహాయం అర్థిస్తారు. పెద్దమొత్తం సాయం తగదు. సందేశాలు, ప్రకటనల పట్ల అప్రమత్తంగా వుండాలి. ఆర్థిక వివరాలు వెల్లడించవద్దు. విలువైన వస్తువులు జాగ్రత్త. మీ శ్రీమతి వైఖిరిలో మార్పు వస్తుంది. సంతానం చదువులపై శ్రద్ధ వహిస్తారు. ఒక సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. పదవుల కోసం యత్నాలు సాగిస్తారు. గుట్టుగా వ్యవహరించండి. వ్యాపారాలు ఊపందుకుంటాయి. నష్టాలను భర్తీ చేసుకుంటారు. కార్మికులకు కొత్త పనులు లభిస్తాయి. ఉద్యోగ బాధ్యతల్లో మెలకువ వహించండి. కొత్త అధికారులకు స్వాగతం పలుకుతారు.

 
ధనుర్ రాశి: మూల, పూర్వాషాడ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాడ 1వ పాదం
ఆదాయం బాగున్నా సంతృప్తి వుండదు. ఏదో సాధించలేకపోయామన్న వెలితి వెన్నాడుతుంది. ఖర్చులు అంచనాలను మించుతాయి. అవసరాలు, చెల్లింపులు వాయిదా వేసుకుంటారు. ఒక సమాచారం ఆందోళన కలిగిస్తుంది. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. స్థిరాస్తి క్రయవిక్రయంలో పునరాలోచన మంచిది. అనాలోచిత నిర్ణయాలు తగవు. ఆరోగ్యం సంతృప్తికరం. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. ఆహ్వానం, పత్రాలు అందుకుంటారు. విలువైన వస్తువులు జాగ్రత్త. బాధ్యతలు అప్పగించవద్దు. మీ గౌరవానికి భంగం కలుగకుండా మెలగండి. వైద్య రంగాల వారికి ఆదాయాభివృద్ధి. వ్యాపారాల్లో లాభనష్టాలను సమీక్షించుకుంటారు. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం. అధికారులకు బాధ్యతల మార్పు, స్థానంచలనం. పందాలు, జూదాల జోలికి వెళ్లవద్దు.

 
మకరం: ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
ఈ మాసం ఏమంత అనుకూలం కాదు. సంప్రదింపులతో తీరిక వుండదు. ఆచితూచి వ్యవహరించాలి. అనుభవజ్ఞుల సలహా పాటించండి. ఊహంచని ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. ఆత్మీయుల సాయంతో ఒక సమస్య పరిష్కారమవుతుంది. మీ శ్రీమతి వైఖరి అసహనం కలిగిస్తుంది. సామరస్యంగా మెలగండి. ఇంటి విషయాలను నిర్లక్ష్యం చేయవద్దు. ఇతరులను మీ విషయాలకు దూరంగా వుంచండి. సంతానం విషయంలో మంచే జరుగుతుంది. సందేశాలు, ప్రకటనలు పట్ల అప్రమత్తంగా వుండాలి. ప్రతి విషయం స్వయంగా తెలుసుకోవాలి. ఆధ్యాత్మికత వైపు దృష్టి మళ్లుతుంది. వస్త్ర, పచారీ వ్యాపారాలు లాభసాటిగా కలిసివస్తాయి. చిన్నవ్యాపారులకు కష్టకాలం. ఉపాధి పథకాల్లో పురోభివృద్ధి. అనుభవం గడిస్తారు. పోగొట్టుకున్న వస్తువులు లభ్యం కావు.

 
కుంభరాశి: ధనష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు
వ్యవహారానుకూలత వుంది. పరిచయాలు బలపడతాయి. ఖర్చులు విపరీతం. డబ్బుకు ఇబ్బంది వుండదు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. పత్రాలు జాగ్రత్త. బంధుత్వాలు బలపడతాయి. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. సన్నిహితుల ప్రోత్సాహం వుంది. సంతానం కదలికలపై దృష్టి సారించండి. ఏ విషయాన్ని తేలికగా తీసుకోవద్దు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. వేడుకకు సన్నాహాలు సాగిస్తారు. పనులు, బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. ఒక సమాచారం ఉల్లాసం కలిగిస్తుంది. ఉమ్మడి వ్యాపారాలు కలిసి వస్తాయి. భాగస్వామిక ఒప్పందాలు కుదుర్చుకుంటారు. ఉద్యోగస్తులకు పనిభారం, విశ్రాంతిలోపం. అధికారులకు హోదామార్పు. వైద్య రంగాల వారికి ఆదాయాభివృద్ధి. ఉపాధి పథకాలు సంతృప్తినిస్తాయి. పుణ్యక్షేత్రాలు, విదేశాలు సందర్శిస్తారు.

 
మీన రాశి: పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి
అన్ని రంగాల వారికి కలిసివచ్చే సమయం. కష్టం ఫలిస్తుంది. పదవులు, సభ్యత్వాలు స్వీకరిస్తారు. గౌరవ ప్రతిష్టలు పెంపొందుతాయి. బాధ్యతగా మెలగాలి. సాధ్యం కాని హామీలివ్వవద్దు. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. ప్రణాళికలు రూపొందించుకుంటారు. పెట్టుబడులకు అనుకూలం. మీ ప్రమేయంతో శుభాకార్యం నిశ్చయమవుతుంది. సోదరీసోదరులతో సత్సంబంధాలు నెలకొంటాయి. గృహనిర్మాణాలు, మరమ్మతులు చేపడతారు. ఆరోగ్యం సంతృప్తికరం. ప్రకటనలు, సందేశాల పట్ల అప్రమత్తంగా వుండాలి. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. ప్రలోభాలకు లొంగవద్దు. నిరుద్యోగులకు ఉపాధి శిక్షణ లభిస్తుంది. పత్రికారంగ ఉద్యోగస్తులకు మార్పులు అనుకూలిస్తాయి. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. కీలక సమావేశాల్లో పాల్గొంటారు. ప్రయాణంలో జాగ్రత్త.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు