జమ్మూకాశ్మీర్‌ను భారీ వర్షాలు, వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. కుండపోత వానల కారణంగా సంభవించిన వేర్వేరు ఘటనల్లో నలుగురు ప్రాణాలు కోల్పోగా, ప్రఖ్యాత వైష్ణోదేవి యాత్రకు అంతరాయం కలిగింది. దోడా జిల్లాలో ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడటంతో తీవ్ర నష్టం వాటిల్లింది. అధికారులు సహాయక చర్యలను ముమ్మరం చేశారు.