ఈ మాసం అనుకూలదాయకం. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. సన్నిహితుల ప్రోత్సాహం ఉంది. కొత్త పనులు చేపడతారు. ఆదాయం బాగుంటుంది. వస్త్ర, వెండి, బంగారాలు కొనుగోలు చేస్తారు. కీలక పత్రాలు, రశీదులు జాగ్రత్త. బాధ్యతలు స్వయంగా చూసుకోండి. దంపతుల మధ్య ఏకాభిప్రాయం నెలకొంటుంది. స్నేహసంబంధాలు బలపడతాయి. ఫోన్ సందేశాలు పట్టించుకోవద్దు. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. దళారులు, కన్సల్టెన్సీలను ఆశ్రయించవద్దు. గృహంలో మార్పుచేర్పులకు అనుకూలం. దూరపు బంధువుల ఆహ్వానం అందుకుంటారు. ఒక సమాచారం ఉల్లాపరుస్తుంది. ఉద్యోగ బాధ్యతల్లో అలక్ష్యం తగదు. ఉపాధ్యాయుల శ్రమ ఫలిస్తుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. కొత్త పెట్టుబడులకు అనుకూలం. దైవకార్య సమావేశాల్లో పాల్గొంటారు.
వ్యవహారజయం, వస్తులాభం, వస్త్రప్రాప్తి ఉన్నాయి. మీ కలుపుగోలుతనం ఆకట్టుకుంటుంది. బంధువులతో తెగిపోయిన సంబంధాలు బలపడతాయి. దైవకార్యాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. ముఖ్యమైన పనులు, కీలక బాధ్యతలు అప్పగించవద్దు. కొందరి నిర్లక్షం ఇబ్బందులకు గురిచేస్తుంది. ప్రియతముల ఆహ్వానం అందుకుంటారు, దంపతులు అవగాహనకు రాగల్గుతారు. అవివాహితులకు శుభయోగం. స్థిరాస్తి వ్యవహారంలో ఏకాగ్రత వహించండి. మీ నిర్ణయంపై కుటుంబ భవిష్యత్తు ఆధారపడి ఉంది. పత్రాల్లో సవరణలు అనుకూలిస్తాయి. సంస్థల స్థాపనకు అనుమతులు మంజూరవుతాయి. ఆత్మీయులతో తరచూ సంభాషిస్తారు. వస్త్ర, బంగారం వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు పదవీయోగం. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడవద్దు
ఆర్ధికంగా నిలదొక్కుకుంటారు. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. ధనానికి ఇబ్బంది ఉండదు. అవసరాలు నెరవేరుతాయి. పన్ను చెల్లింపుల్లో జాప్యం తగదు. నగదు డ్రా చేసేటపుడు జాగ్రత్త. అపరిచితులను ఓ కంట కనిపెట్టండి. ఆత్మీయుల ఆహ్వానం ఆలోచింపచేస్తుంది. ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తి చేస్తారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు ఏర్పడతాయి. సంతానం ఉన్నత విద్యాయత్నం ఫలిస్తుంది. ఒత్తిడి తొలగి మానసికంగా కుదుటపడతారు. ఆరోగ్యం జాగ్రత్త. క్రమం తప్పకుండా ఔషధ సేవనం, ఆహార నియమాలు పాటించండి. ఉద్యోగస్తులకు పనిభారం. ప్రైవేట్ ఉద్యోగస్తులకు అంకితభావం ప్రధానం. వ్యాపారాలు పురోగతిన సాగుతాయి. నూతన వ్యాపారాలపై దృష్టి పెడతారు. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. తీర్ధయాత్రలకు సన్నాహాలు సాగిస్తారు.
కర్కాటకరాశి : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
ఈ మాసం మిశ్రమ ఫలితాల సమ్మేళనం. కార్యసాధనకు దీక్ష, పట్టుదల ప్రధానం. అపజయాలకు కుంగిపోవద్దు. ఆశావహదృక్పధంతో యత్నాలు సాగించండి. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. పెద్దఖర్చు తగిలే సూచనలున్నాయి. ఆపత్సమయంలో సన్నిహితులు సాయం అందిస్తారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూలమవుతాయి. దూరపు బంధువుల ఆహ్వానం సంతోషం కలిగిస్తుంది. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. కనిపించకుండా పత్రాలు లభ్యమవుతాయి. ప్రియతములతో ఉల్లాసంగా గడుపుతారు. ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి. ముఖ్యమైన పత్రాలు అందుకుంటారు, వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. చిరువ్యాపారులకు పురోభివృద్ధి. అధికారులకు హోదామార్పు. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. ముఖ్యులకు స్వాగతం పలుకుతారు.
సింహరాశి : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
శుభకార్యాన్ని ఆర్భాటంగా చేస్తారు. మీ ఉన్నతి కొందరికి అపోహకలిగిస్తుంది. చేపట్టిన పనులు ఉత్సాహంగా పూర్తి చేస్తారు. ఖర్చులు అదుపులో ఉండవు. ఇతరుల కోసం విపరీతంగా ఖర్చుచేస్తారు. పరిచయస్తుల రాకపోకలు అధికమవుతాయి. గృహం సందడిగా ఉంటుంది. దంపతుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. పొదుపు పథకాల పట్ల ఆకర్షితులవుతారు. ప్రైవేట్ ఫైనాన్సులో మదుపు తగదు. ఆప్తుల సలహా పాటించండి. మీ సాయంతో ఒకరికి లబ్ధి చేకూరుతుంది. గృహమరమ్మతులు చేపడతారు. పొరుగువారి నుంచి ఇబ్బందులు ఎదురవుతాయి. పెద్దల జోక్యంతో సమస్య సానుకూలమవుతుంది. ఉద్యోగస్తుల పదోన్నతికి అధికారులు సిఫార్సు చేస్తారు. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ఆలయాలకు విరాళాలు అందిస్తారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి.
అనురాగవాత్సల్యాలు వెల్లివిరుస్తాయి. మీ మాటతీరు ఆకట్టుకుంటుంది. దూరపు బంధుత్వాలు బలపడతాయి. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం ఆసక్తి కలిగిస్తుంది అవతలి వారి స్థోమతను క్షుణ్ణంగా తెలుసుకోండి. స్థిరాస్తి ధనం అందుతుంది. ఖర్చులు అంచనాలను మించుతాయి. అసాధ్యమనుకున్న పనులు తేలికగా పూర్తవుతాయి. సంతానం కదలికలపై దృష్టిపెట్టండి. ఏ విషయాన్నీ తేలికగా తీసుకోవద్దు. ఆత్మీయుల ఆహ్వానం సందిగ్ధానికి గురిచేస్తుంది. నోటీసులు అందుతాయి. న్యాయనిపుణులతో సంప్రదింపులు జరుపుతారు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. ఆరోగ్యం జాగ్రత్త. అతిగా ఆలోచింపవద్దు. వ్యాపారాలు జోరుగా సాగుతాయి. ఉపాధ్యాయులకు కొత్త బాధ్యతలు. శుభకార్యానికి హాజరవుతారు. మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి.
ఈ మాసం శుభదాయకం. కార్యసిద్ధి, వ్యవహార జయం ఉన్నాయి. మాట నిలబెట్టుకుంటారు. ఆదాయం బాగుంటుంది. ఖర్చులు అధికం, సంతృప్తికరం. బంధుమిత్రుల రాకపోకలు అధికమవుతాయి. గృహం సందడిగా ఉంటుంది. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. శుభకార్యానికి సన్నాహాలు సాగిస్తారు. ముఖ్యమైన పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. ప్రముఖులను ఆకట్టుకుంటారు. ఆశించిన పదవులు దక్కకపోవచ్చు. ప్రత్యర్థులను ఓ కంట కనిపెట్టండి. అనవసర విషయాలు పట్టించుకోవద్దు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఆత్మీయులతో తరచూ సంభాషిస్తారు. ఉద్యోగస్తులకు ప్రోత్సాహకరమైన అవకాశాలున్నాయి. ఉపాధ్యాయులకు పురస్కారయోగం. వ్యాపారాలు జోరుగా సాగుతాయి. చిరువ్యాపారులకు ఆదాయాభివృద్ధి. వృత్తి ఉపాధి పథకాలు సంతృప్తినిస్తాయి.
వృశ్చికరాశి : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట
పరిస్థితులు క్రమంగా చక్కబడతాయి. సమర్ధతకు గుర్తింపు లభిస్తుంది. అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు. అందరితో సత్సంబంధాలు నెలకొంటాయి. కొత్తపనులకు ప్రణాళికలు వేసుకుంటారు. సలహాలు, సాయం ఆశించవద్దు. స్వయంకృషితోనే అనుకున్న లక్ష్యం సాధిస్తారు. అవివాహితులకు శుభయోగం. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. పొదుపునకు అవకాశం లేదు. పెద్దమొత్తం ధనం డ్రా చేసేటపుడు జాగ్రత్త. అపరిచితులను ఓ కంట కనిపెట్టండి. సంతానం ఉన్నత విద్యాయత్నం ఫలిస్తుంది. స్థిరాస్తి వ్యవహారంలో స్థిమితంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ప్రలోభలకు లొంగవద్దు. గృహనిర్మాణాలు చురుకుగా సాగుతాయి. బిల్డర్లు, కార్మికులకు ఆదాయాభివృద్ధి. వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు పదవీయోగం.
గృహాల సంచారం అనుకూలంగా ఉంది. పెద్దల హితవు కార్యోన్ముఖులను చేస్తుంది. ఆశావహదృక్పథతంతో శ్రమించండి. అనుమానాలు, అపోహలకు తావివ్వవద్దు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. సంతానం భవిష్యత్తుపై దృష్టి పెడతారు. చేపట్టిన పనులు నిర్విఘ్నంగా సాగుతాయి. ఇతరుల విషయాలు పట్టించుకోవద్దు. మీ గౌరవానికి భంగం కలుగకుండా మెలగండి. ప్రియతముల ఆహ్వానం సంతోషం కలిగిస్తుంది. గృహమార్పు అనివార్యం. నగదు, విలువైన వస్తువులు జాగ్రత్త. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు ఏర్పడతాయి. ఆరోగ్యం జాగ్రత్త. ప్రైవేట్ ఉద్యోగస్తులకు లాభసాటి అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగస్తులకు పదవీయోగం. నూతన వ్యాపారాలు సంతృప్తినిస్తాయి. కొత్త వ్యాపారాలు చేపడతారు. వృత్తుల వారికి ఆదాయాభివృద్ధి. సేవాకార్యక్రమాల్లో పాల్గొంటారు.
కార్యసిద్ధికి సంకల్పబలం ప్రధానం. ఆశావహదృక్పధంతో ముందుకు సాగండి. లక్షసాధనకు చేరువలో ఉన్నారు. మనోబలమే విజయానికి దోహదపడుతుంది. ఆప్తుల వ్యాఖ్యలు ప్రోత్సాహపరుస్తాయి. చేపట్టిన యత్నం విరమించుకోవద్దు. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. వీలైనంత వరకు ఖర్చులు తగ్గించుకోండి. ఆత్మీయుల ఆహ్వానం సంతోషం కలిగిస్తుంది. ఉత్సాహంగా పనులు పూర్తిచేస్తారు. స్నేహసంబంధాలు విస్తరిస్తాయి. సంతానం విదేశీ విద్యాయత్నం ఫలిస్తుంది. కీలక వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాలి. ఒత్తిళ్లు, ప్రలోభావాలకు లొంగవద్దు. సన్నిహితులకు మీ సమస్య తెలియజేయండి. వ్యాపారాల్లో గణనీయమైన పురోభివృద్ధి సాధిస్తారు. ఉద్యోగస్తుల సమర్ధతకు గుర్తింపు లభిస్తుంది. ఉపాధ్యాయుల శ్రమ ఫలిస్తుంది. ప్రయాణంలో కొత్తవ్యక్తులతో జాగ్రత్త.
మీ ఆదాయం బాగుంటుంది. దైవకార్యాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. బంధువులతో తెగిపోయిన సంబంధాలు బలపడతాయి. గృహం ఉంటుంది. కొత్త పనులకు ప్రణాళికలు వేసుకుంటారు. మీ ఊహలు, అంచనాలు ఫలిస్తాయి. వివాహయత్నం తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం ఆలోచింపచేస్తుంది. అవతలి వారి స్తోమతను క్షుణ్ణంగా తెలుసుకోండి. తొందరపడి హామీలివ్వవద్దు. మీ అభిప్రాయాలను లౌక్యంగా తెలియజేయండి. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు ఏర్పడతాయి. మీ జోక్యంతో ఒక సమస్య పరిష్కారమవుతుంది. నిరుద్యోగులకు ఇంటర్వ్యూల్లో ఏకాగ్రత ప్రధానం. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఉద్యోగస్తులకు యూనియన్‌లో గుర్తింపు లభిస్తుంది. రియల్ ఎస్టేట్ రంగాల వారికి నిరాశాజనకం. ఉపాధి పథకాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి.
మీనరాశి : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
ఒక శుభవార్త గృహంలో సంతోషం కలిగిస్తుంది. అయిన వారితో ఉల్లాసంగా గడుపుతారు. ఆశలు వదిలేసుకున్న ధనం అందుతుంది. విలాసాలకు విపరీతంగా ఖర్చుచేస్తారు. పట్టుదలతో శ్రమించిన గాని కొన్ని పనులు పూర్తికావు. అనవసర బాధ్యతలు చేపట్టి ఇబ్బందులు ఎదుర్కుంటారు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. దూరపు బంధుత్వాలు బలపడతాయి. ఆహ్వానం, కీలక పత్రాలు అందుకుంటారు. సంతానం యత్నం ఫలిస్తుంది. చిన్ననాటి పరిచయస్తులు తారసపడతారు. గత అనుభవాలు అనుభూతినిస్తాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఆటుపోట్లకు ధీటుగా స్పందిస్తారు. ఉపాధ్యాయులకు పదోన్నతి. ఉద్యోగ విధుల పట్ల శ్రద్ధవహించండి. అధికారులకు హోదామార్పు. శుభకార్యానికి హాజరవుతారు. మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి.