త్రివేణి గారూ.. లక్ష్మీగణపతిని పూజించడం వల్ల ఆటంకాలు తొలగిపోతాయ్

శుక్రవారం, 20 జులై 2012 (17:40 IST)
FILE
త్రివేణి-కొవ్వూరు:

మీరు ఏకాదశి ఆదివారం, తులాలగ్నము, విశాఖ నక్షత్రం, వృశ్చికరాశి నందు జన్మించారు. కళత్ర కారకుడైన శుక్రుడిని రాహువు పట్టడం వల్ల, కుటుంబ స్థానము నందు చంద్ర, వరుణుడు ఉండటం వల్ల, కుటుంబంలో అశాంతి, చికాకులు వంటివి తాత్కాలికంగా ఉన్నా ఓర్పు, నేర్పుతో సమసిపోతాయి.

2019 వరకు ఏలినాటి శనిదోషం ఉన్నందువల్ల మూడు నెలలకు ఒక శనివారం నాడు 19 సార్లు నవగ్రహ ప్రదక్షణ చేసి సాయిబాబా గుడిలో ఉండే దునిలో 16 జెమ్మి సమిధలను వేయండి. మీకు శుభం కలుగుతుంది, 2013 నందు విదేశాలు వెళ్లే అవకాశం ఉంది. లక్ష్మీగణపతిని పూజించడం వల్ల మీకు ఆటంకాలు తొలగి అభివృద్ధి పొందుతారు.

వెబ్దునియా పై చదవండి