మీరు ఏకాదశి సోమవారం తులాలగ్నము, పునర్వసు నక్షత్రం మిథునరాశి నందు జన్మించారు. గ్రహాలన్నీ రాహు, కేతువుల మధ్. బంధించడం వల్ల మనఃకారకుడైన చంద్రుడిని రాహువు పట్టడంవల్ల శంఖచూడా కాలసర్పదోషం ఏర్పడటం వల్ల ఈ దోషానికి శాంతి చేయించండి. ఈ సంవత్సరము ఆగస్టుతో శని ప్రభావం తొలగిపోతుంది.
2013 ఫిబ్రవరి లోపు మీకు వివాహం అవుతుంది. దక్షిణం నుంచి కానీ పడమర నుంచి కానీ సంబంధం స్థిరపడగలదు. వివాహ విషయంలో జాతకపొంతన చాలా అవసరం అని గమనించగలరు.