ఫణీంద్రవిశ్వనాథ ప్రసాద్ గారూ.. సర్పదోషానికి శాంతి చేయించండి
సోమవారం, 23 జులై 2012 (18:23 IST)
FILE
ఫణీంద్రవిశ్వనాథ ప్రసాద్-అమలాపురం:
మీరు త్రయోదశి బుధవారం, తులా లగ్నము, పూర్వాభాద్ర నక్షత్రం, కుంభరాశి నందు జన్మించారు. ఆగస్టుతో అష్టమ శనిదోషం తొలగిపోతుంది. కృషితో నాస్తి దుర్భిక్షం అన్నట్టుగా ఊహాగానాలతో కాలం వ్యర్థం చేయక అభివృద్ధి పొందండి. గ్రహాలన్నీ రాహు, కేతువుల మధ్య బంధించడం వల్ల మహాపద్మకాలసర్పదోషం శాంతి చేయించండి.
మీకు సర్వదా శుభం కలుగుతుంది. 2015 వరకు సామాన్యంగా ఉన్నా 2015 నుంచి బుధ మహర్ధశ 17 సంవత్సరాలు మంచి యోగాన్ని అభివృద్ధినివ్వగలదు. దాసాంజనేయస్వామిని ఆరాధించడం వల్ల ఆర్థికాభివృద్ధి, పురోభివృద్ధి పొందుతారు.