మహేష్-ఆత్మకూరు మీరు ఏకాదశి బుధవారం మకరలగ్నము, స్వాతీ నక్షత్రం తులారాశి నందు జన్మించారు. 2017 వరకు ఏల్నాటి శనిదోషం ఉన్నందువల్ల మంచి మంచి అవకాశాలు చేజారిపోవడం, చికాకు, నిరుత్సాహం వంటివి ఎదుర్కొంటున్నారు.
ప్రతీ శనివారం 18 సార్లు నవగ్రహ ప్రదక్షణ చేసి ఎర్రని పూలతో శనిని పూజించండి. సర్వదా శుభం కలుగుతుంది. 2013 మే తదుపరి మీకు మంచి అవకాశం లభిస్తుంది. 2013 నుంచి పురోభివృద్ధి పొందుతారు. ఏదైనా దేవాలయాలలో కానీ, విద్యాసంస్థలలో కానీ, ఖాళీ ప్రదేశాలలో కానీ 'మద్ది చెట్టు'ను నాటినా మీకు సర్వదోషాలు తొలగి శుభం కలుగుతుంది.
"విశ్వభరణి పోషనకరజోయీ తారనామభరత అసహోయీ"
రామ పట్టాభిషేకం ఫోటోముందు కూర్చొని రోజుకు 108 సార్లు జపించాలి. ఉద్యోగ ప్రాప్తి అభివృద్ధి చేకూరుతుంది. వర్తమానం శని మహర్థశ 2009 నుంచి ప్రారంభమయింది. ఈ శని 2014 నుంచి మంచి యోగాన్ని అభివృద్ధినివ్వగలదు.