అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి అదే కారణమా?

ఠాగూర్

సోమవారం, 14 జులై 2025 (21:26 IST)
గత జూన్ నెల 12వ తేదీన గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ నగర్‌లో జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదానికి ఇంజన్‌కు ఇంధన సరఫరా చేసే స్విచ్‌లను ఆఫ్ చేయడం వల్లే జరిగినట్టు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఇంజన్లకు ఇంధన సరఫరా నిలిచిపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో డీజీసీఏ కీలక ఆదేశాలు జారీచేసింది. బోయింగ్ 787, 737 విమానాల్లో ఇంధన స్విచ్ లాకింగ్ వ్యవస్థలను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని సూచన చేసింది. 
 
అమెరికాకు చెందిన ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ జారీ చేసిన స్పెషల్ ఎయిర్‌వర్తీనెస్ ఇన్ఫర్మేషన్ బులిటెన్ ప్రకారం ప్రస్తుతం అనేక అంతర్జాతీయ, దేశీయ విమాన సంస్థలు వారి విమానాల్లో ఇంధన స్విచ్‌ల తనిఖీలు ప్రారంభించినట్టు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఈ నేపథ్యంలో బోయింగ్ ఆపరేటర్లు ఈ నెల 21వ తేదీలోగా ఇంధన స్విచ్ లాకింగ్ వ్యవస్థల తనిఖీలు పూర్తి చేయాలని డీజీసీఏ తన ఉత్తర్వుల్లో పేర్కొంది. సంబంధిత నివేదికను డీజీసీఏకు సమర్పించాలని సూచించింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు