సత్యప్రసన్న గారూ.. మీకు 24వ ఏట వివాహం అవుతుంది

శనివారం, 28 జులై 2012 (13:30 IST)
FILE
సత్యప్రసన్న-అమలాపురం:

మీరు తదియ గురువారం, తులాలగ్నము, అశ్వని నక్షత్రం మేషరాశి నందు జన్మించారు. లగ్నము నందు బుధ, శుక్ర, గురు, రాహువులు ఉండటం వల్ల, చదువుల్లో ఏకాగ్రత వహించండి. పురోభివృద్ధి పొందుతారు.

మీరు సాంకేతిక, కళా రంగాల్లో ఏకాగ్రత వహించినా బాగా రాణిస్తారు. భర్తస్థానము నందు చంద్ర, కేతువులు ఉండటం వల్ల భర్తస్థానాధిపతి అయిన కుజుడు భాగ్యము నందు ఉండటం వల్ల, మంచి యోగ్యుడు, ఉత్తముడు, విద్యావంతుడైన భర్త లభిస్తాడు. మీ 23 లేక 24వ సంవత్సరం నుంచి మంచి అభివృద్ధి కానవస్తుంది. వివాహం అవుతుంది. శుభదాయకంగా ఉంటుంది.

వెబ్దునియా పై చదవండి