2013 నందు వివాహం కాగలదు

మంగళవారం, 7 ఫిబ్రవరి 2012 (17:08 IST)
శ్రీకాంత్ రెడ్డి-మాచర్ల:

మీరు షష్ఠి ఆదివారం, మిథునలగ్నము, రోహిణి నక్షత్రం వృషభరాశి నందు జన్మించారు. లగ్నము నందు రాహువు ఉండి, రాజ్యస్థానము నందు కుజ, రవులు ఉండటం వల్ల మీరు విదేశాలలో కంటే స్వదేశంలో మంచి అభివృద్ధి పొందుతారు. భార్యాస్థానాధిపతి అయిన బృహస్పతి షష్ఠమము నందు ఉండటం వల్ల వివాహ విషయంలో జాతక పొంతన చాలా అవసరమని గమనించండి.

2013 నందు వివాహం కాగలదు. ప్రతీరోజూ లక్ష్మీగణపతిని పూజించడం వల్ల, మీకు అన్ని విధాలా శుభం కలుగుతుంది. 2016 వరకు సామాన్యంగా ఉన్నా ఆ తదుపరి గురు మహర్ధశ 16 సంవత్సరములు మంచి యోగాన్ని అభివృద్ధిని ఇవ్వగలదు.

మీ ప్రశ్నలను [email protected]tకు పంపించండి.

వెబ్దునియా పై చదవండి