Weekly Horoscope: 21-07-2025 నుంచి 27-07-2025 వరకు వార ఫలితాలు

రామన్

శనివారం, 19 జులై 2025 (23:29 IST)
Weekly Horoscope
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
ప్రతికూలతలు అధికం. ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. సమయానుకూలంగా మెలగండి. ఏ విషయాన్నీ తీవ్రంగా పట్టించుకోవద్దు. పరిస్థితులు నిదానంగా చక్కబడతాయి. ఆదివారం నాడు ధన సమస్యలెదురవుతాయి. రాబడిపై దృష్టి పెడతారు. అవసరాలు అతికష్టంమ్మీద నెరవేరుతాయి. పరిచయం లేని వారితో జాగ్రత్త. మీ వ్యాఖ్యలు వివాదాస్పదం కాకుండా చూసుకోండి. అనుకున్న పనులు వాయిదా వేయొద్దు. సంతానానికి ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. ఆత్మీయులతో సంప్రదింపులు జరుపుతారు. మీ శ్రీమతి సలహా పాటించండి. చిట్స్, ఫైనాన్సు వ్యాపారులకు ఆటుపోట్లు తప్పవు. పెట్టుబడిదారులు ఒత్తిడి అధికంగా ఉంటుంది. ఉద్యోగ విధులపై శ్రద్ధ వహించండి. మీ తప్పిదాలను సరిదిద్దుకునే అవకాశం లభిస్తుంది. వృత్తి ఉపాధి పథకాలు నిరుత్సాహపరుస్తాయి. 
 
వృషభం: కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
అవిశ్రాంతంగా శ్రమిస్తారు. అయిన వారి ప్రోత్సాహం ఉంటుంది. అవకాశాలను తక్షణం అందిపుచ్చుకోండి. అపోహలకు తావివ్వవద్దు. పనుల ప్రారంభంలో ఆటంకాలెదురవుతాయి. చిన్న విషయానికే నిరుత్సాహపడతారు. ఆశావహదృక్పధంతో మెలగండి. ఖర్చులు అంచనాలను మించుతాయి. ఆత్మీయుల సాయంతో ఒక సమస్య సద్దుమణుగుతుంది. బుధవారం నాడు పెద్దమొత్తం నగదు డ్రా చేసేటపుడు జాగ్రత్త. అపరిచితులను ఓ కంట కనిపెట్టండి. గుర్తుతెలియని వ్యక్తులు మోసగించే ఆస్కారం ఉంది. పన్ను చెల్లింపులు, పత్రాల రెన్యువల్లో జాప్యం తగదు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఉద్యోగస్తులకు ఉన్నత పదవీయోగం. ప్రశంసలు, పురస్కారాలు అందుకుంటారు. వ్యాపారాలు పురోగతిన సాగుతాయి. మీ పథకాలు ఆశించిన ఫలితాలిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. 
 
మిధునం :మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
అన్ని రంగాల వారికీ కలిసివచ్చే సమయం. లక్ష్యాన్ని సాధిస్తారు. ఎదుటివారు మీ సమర్ధతను గుర్తిస్తారు. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. ఖర్చులు అంచనాలను మించుతాయి. అవసరాలకు ధనం సర్దుబాటవుతుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. మంగళవారం నాడు అందరితోను మితంగా సంభాషించండి. మీ వ్యాఖ్యలకు అభ్యంతరాలెదురవుతాయి. పెద్దల జోక్యంతో సమస్య సద్దుమణుగుతుంది. మీ సిఫార్సుతో ఒకరికి సదవకాశం లభిస్తుంది. గృహమార్పునకు యత్నాలు సాగిస్తారు. నగదు, విలువైన వస్తువులు జాగ్రత్త. ఉపాధ్యాయులకు కొత్త బాధ్యతలు. ప్రైవేట్ సంస్థల ఉద్యోగస్తులకు మరింత ఉన్నతావకాశం లభిస్తుంది. వ్యాపారాభివృద్ధికి పథకాలు అమలు చేస్తారు. హోల్సేల్ వ్యాపారులకు ఆదాయాభివృద్ధి. నిర్మాణాలు ఊపందుకుంటాయి. 
 
కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
గృహస్థితి సామాన్యం. సమయస్ఫూర్తితో మెలగాలి. ఎవరినీ అతిగా నమ్మవద్దు. ఒత్తిడి పెరగకుండా చూసుకోండి. ఓర్పు, పట్టుదలతో శ్రమించిన గాని పనులు పూర్తికావు. ఆదాయం ఫర్వాలేదనిపిస్తుంది. ఖర్చులు తగ్గించుకుంటారు. ధనసహాయం తగదు. మీ శ్రీమతికి అన్ని విషయాలు తెలియజేయండి. అనవసర జోక్యం తగదు. గురువారం నాడు అనవసర బాధ్యతలు చేపట్టి ఇబ్బందులెదుర్కుంటారు. దంపతుల మధ్య సఖ్యత లోపం. సన్నిహితులతో సంభాషిస్తారు. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. యత్నాలకు అవకాశాలు కలిసివస్తాయి. పోగొట్టుకున్న పత్రాలు తిరిగి సంపాదిస్తారు. ఉద్యోగ బాధ్యతల్లో మార్పులుంటాయి. ఒత్తిడికి గురి కాకుండా చూసుకోండి. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులుండవు. 
 
సింహం మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
తప్పటడుగు వేసే ఆస్కారం ఉంది. ఏకపక్ష నిర్ణయం తగదు. పెద్దలను సంప్రదించండి. భేషజాలకు పోవద్దు. ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తి చేయండి. ఖర్చులు అంచనాలను మించుతాయి. ఒక అవసరానికి ఉంచిన ధనం మరోదానికి వ్యయం చేస్తారు. శనివారం నాడు . ప్రముఖులను కలిసినా ఫలితం ఉండదు. మొండిధైర్యంతో ముందుకు సాగుతారు. మీ శ్రీమతికి ప్రతి విషయం తెలియజేయండి. సంతానం యత్నం ఫలిస్తుంది. పత్రాల్లో సవరణలు సాధ్యమవుతాయి. ఆందోళన తగ్గి కుదుటపడతారు. ఆత్మీయులతో సంభాషణ ఉపశమనం కలిగిస్తుంది. ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుంటారు. ప్రైవేట్ ఉద్యోగస్తులకు సదవకాశం లభిస్తుంది. ఉద్యోగ బాధ్యతలను సమర్ధంగా నిర్వహిస్తారు. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులుండవు. పెట్టుబడులకు తరుణం కాదు. స్థల వివాదాలు జఠిలమవుతాయి. 
 
కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
కార్యసిద్ధికి మరింత శ్రమించాలి. మీ సామర్ధ్యాన్ని తక్కువ అంచనా వేసుకోవద్దు. అనుకున్న లక్ష్యాన్ని నిదానంగా సాధిస్తారు. ఆశావహదృక్పధంతో అడుగు ముందుకేయండి. మీ శ్రీమతితో సఖ్యత లోపించకుండా మెలగండి. కొన్ని సమస్యలకు పరిష్కారం గోచరిస్తుంది. స్థిరాస్థి ధనం అందుతుంది. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. ఆది, సోమ వారాల్లో పనుల్లో ఒత్తిడి, చికాకులు అధికం. చిన్న చిన్న ఒత్తిడులెదురైనా ఆందోళన చెందవద్దు. ఆప్తుల వ్యాఖ్యలు ఉత్తేజపరుస్తాయి. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. పరిచయం లేని వారితో జాగ్రత్త. అనవసర విషయీలకు దూరంగా ఉండండి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగప్రాప్తి. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. అధికారుల తీరును గమనించి మెలగండి. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి.
 
తుల: చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
ధృఢసంకల్పంతో యత్నాలు సాగించండి. పరిస్థితులు అనుకూలిస్తాయి. పెద్దల ప్రోత్సాహం ఉంటుంది. చాకచక్యంగా పనులు చక్కబెట్టుకుంటారు. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. ఆపన్నులకు ఆదుకుంటారు. సంఘంలో పలకుబడి పెరుగుతుంది. మంగళవారం నాడు నగదు డ్రా చేసేటపుడు జాగ్రత్త. అపరిచితులను ఓ కంట కనిపెట్టండి. మీ శ్రీమతి గురించి ఆందోళన చెందుతారు. కార్యక్రమాలు ముందుకు సాగవు. సోదరుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. మీ అభిప్రాయాలనకు స్పందన లభిస్తుంది. గృహంలో మార్పుచేర్పులు అనివార్యం. ముఖ్యమైన పత్రాలు అందుకుంటారు. ఒక సమాచారం ఊరటనిస్తుంది. వృత్తి ఉపాధి పథకాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ఉద్యోగ విధుల్లో తప్పిదాలను సరిదిద్దుకుంటారు. క్రయ విక్రయాలు ఊపందుకుంటాయి. ప్రయాణం ప్రశాంతంగా సాగుతుంది. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
పట్టుదలతో శ్రమించి కార్యం సాధిస్తారు. మీ కృషి ప్రశంసనీయమవుతుంది. కొత్త పనుల్లో ఉత్సాహం తగ్గకుండా చూసుకోండి. ఆదాయం సంతృప్తికరం. వీలైనంత వరకు ఖర్చులు తగ్గించుకోండి. సంస్థల స్థాపనలకు అనుకూలం. బుధవారం నాడు అపరిచితులతో జాగ్రత్త. వాదోపవాదాలకు దిగవద్దు. కొన్ని విషయాలు చూసీచూడనట్టు వదిలేయండి. ఇతరులను మీ దరికి చేరనీయవద్దు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. స్థిరాస్తి వ్యవహారంలో ఏకాగ్రత ముఖ్యం. పెద్దల సలహా పాటించండి. అవివాహితులు శుభవార్త వింటారు. పరిచయాలు, బంధుత్వాలు బలపడతాయి. వ్యాపారాల్లో ఆటుపోట్లను అధిగమిస్తారు. మీ పథకాలు ఆశించిన ఫలితాలిస్తాయి. ఉద్యోగస్తులకు బాధ్యతల మార్పు, ఆకస్మిక స్థానచలనం. న్యాయ, వైద్య, సాంకేతిక రంగాల వారికి ఆదాయాభివృద్ధి. 
 
ధనస్సు: మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
ఈ వారం కొంతమేరకు అనుకూలమే. కొన్ని ఇబ్బందుల నుంచి బయటపడతారు. చాకచక్యంగా పనులు చక్కబెట్టుకుంటారు. ఊహించని ఖర్చు ఎదురవుతుంది. ఆదాయ మార్గాలు అన్వేషిస్తారు. ఆత్మీయుల సాయం అందుతుంది. ఇంటి విషయాలపై దృష్టిపెడతారు. పెద్దల ఆరోగ్యం కుదుటపడుతుంది. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం కలిసివచ్చే సూచనలున్నాయి. మీ అభిప్రాయాలను స్పష్టంగా తెలియజేయండి. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. ఆత్మీయులతో సంప్రదింపులు జరుపుతారు. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉపాధి పథకాలు చేపడతారు. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. అనవసర బాధ్యతలు చేపట్టవద్దు. ప్రైవేట్ ఉద్యోగస్తులకు కష్టసమయం. వాహనం ఇతరులకివ్వవద్దు. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
మీ ఓర్పు, నేర్పులకు పరీక్షా సమయం. ఏ విషయంలోను తొందరపాటు తగదు. ఆచితూచి అడుగేయాల్సిన సమయం. ఆకస్మిక ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. సాయం ఆశించి భంగపడతారు. అవపరాలు, చెల్లింపులు వాయిదా వేసుకుంటారు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. పెద్దల హితవు కార్యోన్ముఖులను చేస్తుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. ఆకస్మికంగా అవకాశాలు కలిసివస్తాయి. అనుమానాలు, అపోహలకు తావివ్వవద్దు. మనోధైర్యంతో మెలగండి. కీలక పత్రాలు అందుకుంటారు. వాస్తుదోష నివారణ చర్చలు చేపడతారు. సంతానానికి ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు. ఉపాధ్యాయులకు పదోన్నతి, కొత్త బాధ్యతలు. వ్యాపారాలు పురోగతిన సాగుతాయి. షాపుల స్థలమార్పు కలిసివస్తుంది. కీలక సమావేశంలో పాల్గొంటారు. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
అన్ని రంగాల వారికీ యోగదాయకమే. విశేషమైన కార్యసిద్ధి ఉంది. పట్టుదలతో శ్రమించి లక్ష్యం సాధిస్తారు. మీ సామర్ధ్యంపై నమ్మకం కలుగుతుంది. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. వ్యాపకాలు సృష్టించుకుంటారు. ఖర్చులు అదుపులో ఉండవు. రావలసిన ధనాన్ని లౌక్యంగా రాబట్టుకోవాలి. ఆధిపత్యం ప్రదర్శించవద్దు. మీ చొరవతో శుభకార్యం నిశ్చయమవుతుంది. దూరపు బంధుత్వాలు బలపడతాయి. గురువారం పనుల ప్రారంభంలో ఆటంకాలెదురవుతాయి. అనవసర బాధ్యతలు చేపట్టి అవస్థపడతారు. కొత్త వ్యక్తులతో జాగ్రత్త. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ఆటుపోట్లను తట్టుకుంటారు. మీ పథకాలు సత్ఫలితాలిస్తాయి. ఉద్యోగస్తుల పదోన్నతికి అధికారులు సిఫార్సు చేస్తారు. విందుకు హాజరవుతారు. మీ బలహీనతలు అదుపునలో ఉంచుకోండి. 
 
మీనం: పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
మనోభీష్టం నెరవేరుతుంది. స్వల్ప ఒత్తిడిలున్నా అధిగమిస్తారు. ఉత్సాహంగా శ్రమించండి. చేస్తున్న పనులు మధ్యలో ఆపివేయవద్దు. ఆత్మీయులతో సంభాషణ ఉత్తేజపరుస్తుంది. కొత్త యత్నాలు చేస్తారు. అవకాశాలను తక్షణం అందిపుచ్చుకోండి. మొహమ్మాటాలు, భేషజాలకు పోవద్దు. ఖర్చులు అధికం. పొదుపు ధనం గ్రహిస్తారు. సోమవారం నాడు నగదు డ్రా చేసేటపుడు జాగ్రత్త. కొత్త వ్యక్తులను ఓ కంట కనిపిట్టండి. లావాదేవీల్లో ఏకాగ్రత వహించండి. ముఖ్యమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. సన్నిహితులకు మీ ఇబ్బందులు తెలియజేయండి. దంపతులు ఏకాభిప్రాయానికి రాగల్గుతారు. సంతానం కృషి ఫలిస్తుంది. సాంకేతిక రంగాల వారికి ఆదాయాభివృద్ధి. ఉద్యోగస్తుల పనితీరును అధికారులు గుర్తిస్తారు. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులుండవు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు