సోషల్ మీడియాలో రోజువారీ ఎన్నో వీడియోలు షేర్ అవుతుంటాయి. అలాంటి వీడియోల్లో ఇపుడొకటి హల్చల్ చేస్తోంది. కట్టేసి వున్న గుర్రాన్ని చుట్టుముట్టాయి వీధి కుక్కలు. ఓ కుక్క గుర్రం తోకను పట్టుకుని గుంజుతోంది. ఆ కుక్క అలా చేస్తుండగా మరో రెండు కుక్కలు వచ్చేసాయి. తోకను గుంజుతున్న కుక్కతో మరో కుక్క తోడైంది.