నాగరాజు-గుంటూరు: మీరు నవమి గురువారం, వృశ్చిక లగ్నము, శ్రవణా నక్షత్రం మకర రాశి నందు జన్మించారు. లగ్నము నందు శుక్ర, కేతువులు ఉండటం వల్ల సత్ర్పవర్తనాశీలురు, కళాత్మక దృష్టి కలవారు, ఎదుటివారిని ఎల్లప్పుడూ గౌరవించేవారు, అందరికీ సహాయం చేసి మాటపడేవారుగా ఉంటారు. 2010 ఆగస్టు నుంచి గురు మహర్దశ ప్రారంభమైంది. ఈ గురువు 2016 నుంచి 2026 వరకు సత్ఫలితాలను ఇస్తుంది. భార్య స్థానము నందు రాహువు ఉండటం వల్ల కుటుంబ స్థానము నందు కుజ, గురులు ఉండటం వల్ల భార్య, కుటుంబ స్థాన దోషం ఏర్పడటం వల్ల మీ ఓర్పు, నేర్పుకు పరీక్షా సమయం అని చెప్పవచ్చు. హనుమాన్ ఆరాధన చేయడం వల్ల ఎటువంటి దోషాలు ఉన్నా తొలగిపోతాయి. దేవాలయాల్లో తెల్లజిల్లేడు చెట్టును దోషాలు తొలగిపోతాయి.