కె. వరప్రసాద్‌రాజు గారూ.. సాయి దునిలో మోదుగ సమిధలు వెలిగించండి

సోమవారం, 30 జులై 2012 (18:21 IST)
FILE
కె. వరప్రసాద్‌రాజు-హైద్రాబాద

మీరు షష్ఠి మంగళవారం, కర్కాటకలగ్నము, హస్తనక్షత్రం కన్యారాశి నందు జన్మించారు. లగ్నము నందు కుజ, రవులు ఉండటం వల్ల, భార్యస్థానము నందు బృహస్పతి ఉండటం వల్ల, భార్యస్థానాధిపతి అయిన శని ఉచ్ఛి చెంది ఉండటం వల్ల మీ 28 లేక 29వ సంవత్సరము నందు వివాహం అవుతుంది. వివాహ జీవితం చాలా శుభదాయకంగా ఉంటుంది.

2014 చివరి వరకు ఏలినాటి శనిదోషం ఉన్నందువల్ల, ప్రతీ శనిత్రయోదశికి శనికి తైలాభిషేకం చేయించి సాయిబాబా గుడిలో ఉండే దునిలో పది మోదుగ సమిధలను వేయండి. సర్వదోషాలు తొలగి శుభం కలుగుతుంది.

వెబ్దునియా పై చదవండి