చంద్రకాంత్ గారూ... ఈశ్వర ఆరాధన వల్ల పురోభివృద్ధి ఉంటుంది

గురువారం, 14 ఫిబ్రవరి 2013 (18:09 IST)
FILE
చంద్రకాంత

మీరు ద్వాదశి సోమవారం, కుంభలగ్నము, ధనిష్ట నక్షత్రం మకరరాశి నందు జన్మించారు. గ్రహాలన్నీ రాహు, కేతువుల మధ్య బంధించబడటం వల్ల, వాసుకీ కాలసర్పదోషం ఏర్పడటం వల్ల ఈ దోషాలకు శాంతి హోమం చేయించినా శుభం కలుగుతుంది. భార్యస్థానాధిపతి అయిన రవి ధనస్థానము నందు ఉండటం వల్ల, వివాహానంతరం మీరు ఉన్నత స్థితిలో స్థిరపడతారు.

2013 ఆగష్టు నుంచి మే 2014 లోపు మీకు వివాహం అవుతుంది. ఈశ్వర ఆరాధన వల్ల మీరు ఆర్ధికాభివృద్ధి, పురోభివృద్ధి పొందుతారు. 2009 నుంచి గురు మహర్థశ ప్రారంభమయింది. ఈ గురువు 2014 నుంచి 2025 వరకు మంచి అభివృద్ధిని ఇవ్వగలదు.

వెబ్దునియా పై చదవండి