టి. వెంకటపద్మావతి గారూ.. శనిని పచ్చని పూలతో పూజించండి
సోమవారం, 25 ఫిబ్రవరి 2013 (17:04 IST)
FILE
టి. వెంకటపద్మావతి - అద్దంకి :
మీరు పంచమి గురువారం, సింహలగ్నము, రేవతి నక్షత్రం మీనరాశి నందు జన్మించారు. 2014 చివరి వరకు అష్టమ శనిదోషం ఉన్నందువల్ల నెలకు ఒక శనివారం నాడు 17 సార్లు నవగ్రహ ప్రదక్షణ చేసి పచ్చని పూలతో శనిని పూజించినా శుభం కలుగుతుంది. భర్తస్థానాధిపతి అయిన శని ఉచ్ఛి చెంది ఉండటం వల్ల యోగ్యుడైన భర్త లభిస్తాడు.
ఈ సంవత్సరము వివాహం అవుతుంది. 2014 నుంచి పురోభివృద్ధి కానరాగలదు. 2006 నుంచి శుక్రమహర్థశ ప్రారంభమయింది. ఈ శుక్రుడు 2013 అక్టోబరు నుంచి 2026 వరకు మంచి అభివృద్ధినిస్తాడు. ఈ క్రింది శ్లోకాన్ని ప్రతీ రోజు 11 సార్లు పఠించి ఒకరూపాయి నాణాన్ని స్వామివారి దగ్గర ఉంచండి. శుభం కలుగుతుంది.