పి. రాజు గారూ... మీకు వివాహ ప్రతిబంధకా దోషం ఏర్పడింది

సోమవారం, 25 ఫిబ్రవరి 2013 (17:02 IST)
FILE
పి. రాజు
మీరు త్రయోదశి ఆదివారం, మిథునలగ్నము, అనురాధ నక్షత్రం వృశ్చికరాశి నందు జన్మించారు. 2019 వరకు ఏల్నాటిశనిదోషం ఉన్నందువల్ల, ప్రతీ శనిత్రయోదశికి శనికి తైలాభిషేకం చేయించినా శుభం కలుగుతుంది. ఈ శని కూడా మంచి యోగాన్ని ఇస్తాడు. లగ్నము నందు కుజ, రవులు ఉండటంవల్ల, భార్యస్థానాధిపతి అయిన బృహస్పతి అష్టమము నందు ఉండటం వల్ల, వివాహ ప్రతి బంధకా దోషం ఏర్పడింది. ఈ దోషానికి ఉమామహేశ్వరులు ఆరాధించడం వల్ల సర్వదా శుభం కలుగుతుంది.

2013 ఆగష్టు తదుపరి మీకు మంచి మంచి అవకాశాలు లభిస్తాయి. 2014 నందు బాగుగా స్థిరపడతారు. 2014 జూన్ నుంచి డిసెంబరు లోపు మీకు వివాహం అవుతుంది. 2017 వరకు కేతు మహర్థశ సామాన్యంగా ఉండగలదు. తదుపరి శుక్ర మహర్థశ 20 సంవత్సరములు వృత్తి, వ్యాపారాలలో ఉన్నత స్థితిలో స్థిరపడతారు. మంచి పేరు, ఖ్యాతి గడిస్తారు.

వెబ్దునియా పై చదవండి