మీ భర్త తిలక్ కుమార్ చతుర్థశి బుధవారం, మిథునలగ్నము, విశాఖ నక్షత్రం తులారాశి నందు జన్మించారు. 2017 వరకు ఏల్నాటి శనిదోషం ఉన్నందువల్ల సరియైన అభివృద్ధి లేకపోవడం ఎంత ధనం వచ్చినా నిలబెట్టలేకపోవడం, అందరికీ సహాయం చేసి మాటపడటం, అశాంతి వంటివి ఎదుర్కొంటున్నారు.
నెలకు ఒక శనివారంనాడు 20 సార్లు నవగ్రహ ప్రదక్షణ చేసి తెల్లని పూలతో శనిని పూజించినా దోషాలు తొలగిపోతాయి. ఆర్ధికాభివృద్ధికి, పురోభివృద్ధికి కనకదుర్గా అమ్మవారిని పూజించినా శుభం కలుగుతుంది.