వీరభద్రరావూ.. గణపతిని ఎర్రమందారపూలతో పూజించండి

శుక్రవారం, 13 జులై 2012 (17:16 IST)
FILE
కె. వీరభద్రరావు-కాకినాడ:

మీరు విదియ గురువారం, కర్కాటక లగ్నము, అశ్వని నక్షత్రం, మేషరాశి నందు జన్మించారు. లగ్నమునకు వ్యయస్థానము నందు కుజుడు ఉండటం వల్ల, కళత్రకారకుడైన శుక్రుడు అష్టమము నందు ఉండటం వల్ల, కుటుంబ విషయంలో చికాకు, అశాంతి వంటివి ఎదుర్కొన్నా ఓర్పు, నేర్పుతో పరిష్కరించుకోండి.

2006 నుంచి చంద్ర మహర్ధశ ప్రారంభమైంది. ఈ చంద్రుడు 2014 నుంచి 2016 వరకు యోగాన్ని ఇస్తాడు. ఇందు మీరు బాగుగా స్థిరపడతారు. తదుపరి కుజ మహర్ధశ ఏడు సంవత్సరములు, రాహు మహర్ధశ 18 సంవత్సరములు సత్ఫలితాలను ఇవ్వగలదు. ప్రతీరోజూ హేరంబ గణపతిని ఎర్రమందారుపూలతో పూజించినా సర్వదా శుభం కలుగుతుంది.

మీ భార్య: చవితి ఆదివారం, తులాలగ్నము, పుబ్బ నక్షత్రం సింహరాశి నందు జన్మించారు. లగ్నము నందు కుజ, శనులు ఉండటం వల్ల అష్టమ స్థానము నందు రాహువు ఉండటం వల్ల, కర్కోటక కాలసర్పదోష శాంతి చేయించండి. 2012 ఆగస్టుతో ఏలినాటి శనిదోషం తొలగిపోతుంది.

2013 నుంచి సత్‌కాలం ప్రారంభమవుతుంది. 2012 నుంచి రాహు మహర్ధశ ప్రారంభమైంది. ఈ రాహువు 18 సంవత్సరములు మంచి యోగాన్ని ఇవ్వగలదు. ఇష్టకామేశ్వరిదేవిని పూజించడం వల్ల కుటుంబ సౌఖ్యం, ప్రశాంతత, అభివృద్ధి కానవస్తుంది.

వెబ్దునియా పై చదవండి