శ్రావణ్ కుమార్ గారూ.. తెల్లని పూలతో శనిని పూజించండి..
బుధవారం, 18 జులై 2012 (17:52 IST)
FILE
శ్రావణ్ కుమార్-బెల్లంపల్లి:
మీరు నవమి ఆదివారం, మీనలగ్నము, పూర్వాభాద్ర నక్షత్రం మీనరాశి నందు జన్మించారు. 2014 చివరి వరకు అష్టమ శనిదోషం ఉన్నందువల్ల ప్రతీ శనివారం 16 సార్లు నవగ్రహ ప్రదక్షణ చేసి తెల్లని పూలతో శనిని పూజించండి. 2010 నుంచి బుధ మహర్ధశ ప్రారంభమైంది. ఈ బుధుడు 2013 నుంచి 2027 వరకు మంచి యోగాన్ని ఇస్తాడు.
2012 ఆగస్ట తదుపరి మీకు ఎటువంటి అవకాశం లభించినా సద్వినియోగం చేసుకోండి. 2013 నందు మీరు బాగా స్థిరపడతారు. 2014 నుంచి మంచి అభివృద్ధి కానవస్తుంది. లక్ష్మీనారాయణుడిని పూజించడం వల్ల మీకు శుభం కలుగుతుంది.