20-06-2021 నుంచి 29-06-2021 వరకు మీ వార రాశి ఫలితాలు

ఆదివారం, 20 జూన్ 2021 (00:29 IST)
Astrology
మేషం : అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం 
కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి. అనుకున్నది సాధిస్తారు. గృహం ప్రశాంతంగా వుంటుంది. ఖర్చులు సామాన్యం. రుణ ఒత్తిళ్ల నుంచి ఉపశమనం కలుగుతుంది. ఆదివారం నాడు ముఖ్యుల సందర్శనం వీలుపడదు. పనులు, బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. మీ విషయాల్లో ఇతరుల జోక్యానికి తావివ్వకండి. నమ్మకస్తులే తప్పుదారి పట్టించేందుకు యత్నిస్తారు. ఒక సమాచారం ఆలోచింపజేస్తుంది. మీ శ్రీమతి సలహా పాటించండి. పిల్లల చదువులపై దృష్టి పెడతారు. ప్రియతములతో సంభాషిస్తారు. ఉద్యోగ బాధ్యతల్లో మెలకువ వహించండి. ప్రలోభాలకు లొంగవద్దు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఉమ్మడి వ్యాపారాలు కలిసిరావు. వృత్తుల వారికి సామాన్యం. నిర్మాణాలు ఊపందుకుంటాయి. కార్మికులకు ఆశాజనకం. దైవ సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు
ఆర్థికలావాదేవీలతో తీరిక ఉండదు. కొత్త విషయాలు తెలుసుకుంటారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. రోజువారీ ఖర్చులే ఉంటాయి. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. సోదరుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. సోమ, మంగళవారాల్లో  పనీ సాగక విసుగు చెందుతారు. పరిచయస్తుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. కార్యక్రమాలు ముందుకు సాగవు. కీలక పత్రాలు అందుకుంటారు. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. మానసికంగా కుదుటపడతారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. వ్యాపారాల్లో ఆటుపోట్లను ధీటుగా ఎదుర్కొంటారు. సరుకు నిల్వలో జాగ్రత్త. ఆధ్యాత్మికత వైపు దృష్టి మళ్లుతుంది. వృత్తుల వారికి అవకాశాలు కలిసివస్తాయి. ఆత్మీయుల క్షేమం తెలుసుకుంటారు. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
మీ సమర్థత అవతలివారికి కలిసివస్తుంది. ఏ విషయంపై ఆసక్తి వుండదు. ఆలోచనలతో సతమతమవుతారు. సన్నిహితుల హితవు మీపై సత్ప్రభావం చూపుతుంది. మానసికంగా కుదుటపడతారు. మనోధైర్యంతో వ్యవహరిస్తారు. ఖర్చులు విపరీతం. అవసరాలు, చెల్లింపులు వాయిదా వేసుకుంటారు. పనుల్లో ఒత్తిడి, జాప్యం అధికం. బుధవారం నాడు అప్రమత్తంగా ఉండాలి. సందేశాలు, ప్రకటనలను విశ్వసించవద్దు. పిల్లల విషయంలో మంచే జరుగుతుంది. గృహంలో మార్పుచేర్పులకు అనుకూలం. పత్రాల రెన్యువల్‌లో మెలకువ వహించండి. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. షాపుల స్థలమార్పు అనివార్యం. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. అధికారులకు హోదా మార్పు, ఉపాధి పథకాలు అంతంత మాత్రంగా సాగుతాయి. విద్యా సంస్థలకు కొత్త సమస్యలు ఎదురవుతాయి. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
మనోధైర్యంతో ముందుకు సాగండి. యత్నాలు విరమించుకోవద్దు. త్వరలో మీ కృషి ఫలిస్తుంది. పరిచయాలు బలపడతాయి. వ్యాపకాలు సృష్టించుకుంటారు. రోజువారీ ఖర్చులే ఉంటాయి. ఆప్తులకు సాయం అందిస్తారు. పెట్టుబడులకు తరుణం కాదు. పనులు చురుకుగా సాగుతాయి. గురు, శుక్రవారాల్లో శ్రమాధిక్యత, అకాలభోజనం. ఆరోగ్యం జాగ్రత్త. దంపతులకు కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. వేడుకకు సన్నాహాలు సాగిస్తారు. సంతానం అత్యుత్సాహాన్ని అదుపుచేయండి. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. భవన నిర్మాణ కార్మికులకు కష్టకాలం. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. పెద్దమొత్తం సరుకు నిల్వలో జాగ్రత్త. ఉద్యోగస్తులకు యూనియన్ గుర్తింపు లభిస్తుంది. అధికారులకు స్వాగతం పలుకుతారు. కీలక సమావేశాల్లో పాల్గొంటారు. 
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
చాకచక్యంగా వ్యవహరిస్తారు. మాటతీరు ఆకట్టుకుంటుంది. కార్యక్రమాలు విజయవంతం అవుతాయి. కొత్త ఆలోచనలతో ముందుకు సాగుతారు. ఖర్చులు అదుపులో ఉండవు. పరిచయస్తులు ధనసహాయం అర్ధిస్తారు. పెద్దమొత్తం సాయం తగదు. శనివారం నాడు అవిశ్రాంతంగా శ్రమిస్తారు. ముఖ్యుల కలయిక వీలుపడదు. పనులు హడావుడిగా సాగుతాయి. పిల్లల చదువులపై మరింత శ్రద్ధ వహించాలి. బాధ్యతలు అప్పగించవద్దు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. వేడుకకు సన్నాహాలు సాగిస్తారు. పరిచయాలు బలపడతాయి. విలువైన వస్తువులు జాగ్రత్త. పత్రాలు అందుకుంటారు. ఉద్యోగ బాధ్యతల్లో మెలకువ వహించండి. ధనప్రలోభాలకు లొంగవద్దు. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. ఉమ్మడి వ్యాపారాలు కలిసివస్తాయి. ఉపాధి పథకాలు చేపడతారు. స్టాక్ మార్కెట్ రంగాల వారికి ఆశాజనకం. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
ఈ వారం కలిసివచ్చే సమయం. వ్యవహార దక్షతతో రాణిస్తారు. ధనలాభం వుంది. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. బంధువులతో తెగిపోయిన సంబంధాలు బలపడతాయి. ఖర్చులు అధికం. డబ్బుకు ఇబ్బంది వుండదు. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. పెట్టుబడులకు తరుణం కాదు. పనులు మందకొడిగా సాగుతాయి. గృహమార్పు కలిసివస్తుంది. దంపతులకు కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. ఆత్మీయులకు ముఖ్య సమాచారం అందిస్తారు. వ్యాపారాల్లో ఆటుపోట్లను ధీటుగా ఎదుర్కొంటారు. ఉమ్మడి వ్యాపారాలు కలిసిరావు. ఉపాధ్యాయులకు నిరాశాజనకం. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగ సాగుతాయి. ముఖ్యులకు వీడ్కోలు పలుకుతారు. వాహనం ఇతరులకు ఇవ్వవద్దు.
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
వ్యవహారాల్లో మెలకువ వహించండి. తప్పటడుగు వేసే ఆస్కారం వుంది. అనుభవజ్ఞుల సలహా పాటించండి. ఏకపక్షంగా వ్యవహరించవద్దు. ఖర్చులు అంచనాలను మించుతాయి. పొదుపు ధనం ముందుగానే గ్రహిస్తారు. చెల్లింపులు, నగదు స్వీకరణలో జాగ్రత్త. పనులు మొక్కుబడిగా పూర్తి చేస్తారు. ఎదురుచూస్తున్న పత్రాలు అందుతాయి. ఆత్మీయులను కలుసుకుంటారు. పిల్లల విషయంలో మంచే జరుగుతుంది. గృహంలో మార్పులు చేర్పులు చేపడతారు. ఆరోగ్యం జాగ్రత్త. ఏ విషయాన్నీ తేలికగా తీసుకోవద్దు. నిర్మాణాలు ఊపందుకుంటాయి. ఉద్యోగస్తులు పురస్కారాలు అందుకుంటారు. సహోద్యోగులతో జాగ్రత్త. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. చిరు వ్యాపారులకు కష్టకాలం. వైద్య, సేవా రంగాల వారికి పురోభివృద్ధి. దైవ సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ట
ఓర్పుతో వ్యవహరించండి. నిస్తేజానికి లోనుకావద్దు. ఏది జరిగినా మంచికేనని భావించండి. త్వరలో అనుకూల పరిస్థితులు నెలకొంటాయి. పెద్ద ఖర్చు తగిలే ఆస్కారం వుంది. ధనం మితంగా వ్యయం చేయండి. భేషజాలు, మొహమ్మాటాలకు పోవద్దు. మీ శ్రీమతి విషయంలో దాపరికం తగదు. ఆది, సోమవారాల్లో పనులు మందకొడిగా సాగుతాయి. ముఖ్యుల సందర్శనం కోసం పడగాపులు తప్పవు. స్వల్ప అస్వస్థతకు గురవుతారు. వైద్య సేవలు అవసరమవుతాయి. సన్నిహితుల సాయంతో ఒక సమస్య సానుకూలమవుతుంది. వ్యాపారాభివృద్ధికి మరింత శ్రమించాలి. హోల్ సేల్ వ్యాపారులకు నిరాశాజనకం. ఉద్యోగస్తులకు యూనియన్ వ్యవహారాల్లో తీరిక ఉండదు. ఉపాధి పథకాలు సంతృప్తినిస్తాయి. వృత్తుల వారికి సామాన్యం. విద్యార్థులకు ఆందోళన అధికం.
 
ధనస్సు : మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం
ప్రతికూలతలు, శ్రమ అధికం. ఆలోచనలతో సతమతమవుతారు. ఏ విషయంపై ఆసక్తి ఉండదు. స్థిమితంగా వుండేందుకు ప్రయత్నించండి. ఖర్చులు సామాన్యం. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. మంగళ, బుధవారాల్లో అనవసర జోక్యం తగదు. పనులు మొక్కుబడిగా పూర్తి చేస్తారు. ఈ చికాకులు తాత్కాలికమే. ఆత్మీయుల రాక ఉపశమనం కలిగిస్తుంది. కొత్త యత్నాలు ప్రారంభిస్తారు. శకునాలు పట్టించుకోవద్దు. వ్యాపకాలు, పరిచయాలు విస్తరిస్తాయి. మీ శ్రీమతికి అన్ని విషయాలు తెలియజేయండి. కీలక పత్రాలు అందుకుంటారు. వ్యాపారాలు క్రమంగా పుంజుకుంటాయి. ఆటంకాలను ధీటుగా ఎదుర్కొంటారు. ఉద్యోగస్తులకు ఓర్పు, ఏకాగ్రత ప్రధానం. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. వేడుకకు హాజరు కాలేదు. వాహన చోదకులకు దూకుడు తగదు.
 
మకరం : ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు.
సామరస్యంగా సమస్యలు పరిష్కరించుకోవాలి. మీ తప్పిదాలను సరిదిద్దుకోవడం ముఖ్యం. ఎవరినీ కించపరచవద్దు. పెద్దల సలహా పాటించండి. పనుల్లో ఒత్తిడి, జాప్యం అధికం. ఖర్చులు అదుపులో వుండవు. ధనసాయం అర్థించేందుకు మనస్కరించదు. అవసరాలు వాయిదా వేసుకుంటారు గురువారం నాడు ఫోన్ సందేశాల పట్ల అప్రమత్తంగా వుండాలి. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. పిల్లల ఉన్నత చదువులను వారి ఇష్టానికే వదిలేయండి. పాత పరిచయస్తులు తారసపడుతారు. గత ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. అధికారులకు ఒత్తిడి, పనిభారం. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. కార్మికులు, చేతివృత్తుల వారికి సామాన్యం. విదేశీయాన యత్నాలను విరమించుకుంటారు.
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు
మీదైన రంగంలో రాణిస్తారు. అప్రయత్నంగా అవకాశాలు కలిసివస్తాయి. ఆదాయానికి తగినట్లు ఖర్చులుంటాయి. పొదుపు చేయాలనే ఆలోచన ఫలించదు. సన్నిహితులకు సాయం అందిస్తారు. పనులు త్వరితగతిన సాగుతాయి. పదవుల కోసం యత్నాలు సాగిస్తారు. శుక్ర, శనివారాల్లో ఊహించని సంఘటనలు ఎదురవుతాయి. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. మీ ఇష్టాయిష్టాలను లౌక్యంగా వ్యక్తం చేయండి. ఏకపక్షంగా వ్యవహరించవద్దు. సంతానం ద్వారా శుభవార్తలు వింటారు. బంధుమిత్రుల రాకపోకలు అధికమవుతాయి. నిరుద్యోగులకు ఆశాజనకం. ఉద్యోగస్తులకు యూనియన్‌లో గుర్తింపు లభిస్తుంది. అధికారులకు వీడ్కోలు పలుకుతారు. వ్యాపారాలు పురోగతిన సాగుతాయి. ఆటుపోట్లను ధీటుగా ఎదుర్కొంటారు. పెద్దమొత్తం సరుకు నిల్వలో జాగ్రత్త. 
 
మీనం : పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి
ఆర్థికంగా బాగుంటుంది. ప్రణాళికలు వేసుకుంటారు. అంచనాలు ఫలిస్తాయి. మీ జోక్యం అనివార్యం ఆప్తులకు చక్కని సలహాలిస్తారు. ఆది, మంగళవారాల్లో పనులు సాగవు. బంధువుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. మధ్యవర్తులు, ఏజెన్సీలను విశ్వసించవద్దు. సంతానం కదలికలపై దృష్టి సారించండి. చెప్పుడు మాటలు పట్టించుకోవద్దు. ప్రతి విషయం స్వయంగా తెలుసుకోవాలి. ఎదురుచూస్తున్న పత్రాలు అందుతాయి. స్వల్ప అస్వస్థతకు గురవుతారు. వైద్య, సాంకేతిక రంగాల వారికి ఆదాయాభివృద్ధి. ప్రైవేట్ సంస్థల ఉద్యోగస్తులకు కష్టకాలం. వ్యాపారాభివృద్ధికి మరింత శ్రమించాలి. నూతన పెట్టుబడులకు తరుణం కాదు. పుణ్య కార్యంలో పాల్గొంటారు. జూదాలు, బెట్టింగ్‌ల జోలికి పోవద్దు. 
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు