2-05-2021 నుంచి 8-05-2021 వరకూ మీ వార రాశి ఫలితాలు

ఆదివారం, 2 మే 2021 (16:59 IST)
మేషం: అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం
కార్యానుకూలత వుంది. అవిశ్రాంతంగా శ్రమిస్తారు. పరిచయాలు విస్తరిస్తాయి. చాకచక్యంగా వ్యవహరిస్తారు. అంచనాలు ఫలిస్తాయి. సోమ, మంగళ వారాల్లో ఖర్చులు విపరీతం. రాబడిపై దృష్టి పెడతారు. పనులు వేగవంతమవుతాయి. ఆత్మీయుల కలయిక ఉత్సాహాన్నిస్తుంది. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం కలిసివస్తుంది. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. పెట్టిపోతల్లో ఖచ్చితంగా వుండాలి. సాధ్యం కాని హామీలివ్వవద్దు. పాత పరిచయస్తులు తారసపడతారు. పెట్టుబడులు కలిసిరావు. ఉద్యోగస్తుల మన్ననలు అందుకుంటారు. అధికారులకు ధనప్రలోభం తగదు. ఆశించిన పదవులు దక్కకపోవచ్చు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఆటుపోట్లను ధీటుగా ఎదుర్కొంటారు. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. దైవదర్శనాలు సంతృప్తినిస్తాయి.
 
వృషభం: కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు
అప్రయత్నంగా అవకాశాలు కలిసివస్తాయి. ధనలాభం వుంది. తాకట్టు విడిపించుకుంటారు. మనస్సు తేలికపడుతుంది. ఉత్సాహంగా పనులు పూర్తి చేస్తారు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. ఆహ్వానాలు అందుకుంటారు. అందరితో కలుపుగోలుగా వ్యవహరిస్తారు. వ్యాపకాలు అధికమవుతాయి. బుధవారం నాడు నగదు, విలువైన వస్తువులు జాగ్రత్త. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. అయినవారికి సాయం అందిస్తారు. పెద్దల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. సోదరుల మధ్య ఆస్తి విషయాలు ప్రస్తావనకు వస్తాయి. మీ ఇష్టాయిష్టాలను లౌక్యంగా వ్యక్తం చేయండి. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. నూతన పెట్టుబడులకు తరుణం కాదు. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. సన్మాన, సంస్మరణ సభల్లో పాల్గొంటారు.
 
మిధునం: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
వ్యవహారాలతో తీరిక వుండదు. అవిశ్రాంతంగా శ్రమిస్తారు. గుట్టుగా వ్యవహరించండి. రుణ ఒత్తిళ్లు అధికమవుతాయి. సన్నిహితుల సాయంతో ఒక సమస్య సానుకూలమవుతుంది. పనులు ప్రారంభంలో ఆటంకాలెదురవుతాయి. ఆది, గురు వారాల్లో ప్రముఖుల సందర్శనం వీలుపడదు. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. కీలక పత్రాలు అందుతాయి. సంతానం ఉన్నత చదువులను వారి ఇష్టానికే వదిలేయండి. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. వేడుకకు హాజరవుతారు. బంధువుల ఆతిథ్యం ఆకట్టుకుంటుంది. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. చిరు వ్యాపారులకు పురోభివృద్ధి. ఉద్యోగస్తులు అధికారులకు వివరణ ఇచ్చుకోవలసి వస్తుంది. ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. అకౌంట్స్, వైద్య రంగాల వారికి ఆదాయాభివృద్ధి. ప్రేమ వ్యవహారాలు వికటిస్తాయి.
 
కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
అన్ని విధాలా అనుకూలమే. సంప్రదింపులు ఫలిస్తాయి. మాటతీరు ఆకట్టుకుంటుంది. సరైన నిర్ణయాలు తీసుకుంటారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. దంపతుల మధ్య ఏకాభిప్రాయం నెలకొంటుంది. సంతాన సౌఖ్యం, ప్రశాంతత పొందుతారు. శుక్ర, శని వారాల్లో ఖర్చులు విపరీతం. పొదుపు ధనం ముందుగానే గ్రహిస్తారు. పనులు వేగవంతమవుతాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. చిన్ననాటి పరిచయస్తులు తారసపడతారు. గత అనుభవాలు అనుభూతినిస్తాయి. ఒక ఆహ్వానం ఉత్సాహాన్నిస్తుంది. పత్రాల రెన్యువల్లో మెలకువ వహించండి. జాగ్రత్త. బాధ్యతలు అప్పగించవద్దు. ఉమ్మడి వ్యాపారాలు కలిసివస్తాయి. ఒప్పందాలు కుదుర్చుకుంటారు. ఉద్యోగస్తులకు పదవీయోగం. ఉపాధి పథకాలు సంతృప్తినిస్తాయి. వైద్య, అకౌంట్స్, సాంకేతిక రంగాల వారికి ఆదాయాభివృద్ధి.
 
సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
సమస్యలను ధీటుగా ఎదుర్కొంటారు. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. ఆదాయానికి తగ్గట్లుగా ఖర్చులుంటాయి. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. మీ జోక్యం అనివార్యం. ఆప్తులకు చక్కని సలహాలిస్తారు. వాయిదా పడుతూ వస్తున్న పనులు ఎట్టకేలకు పూర్తవుతాయి. సంతానం చదువులపై శ్రద్ధ వహిస్తారు. ఒక సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. గృహమార్పు అనివార్యం. విలువైన వస్తువులు మరమ్మతుకు గురవుతాయి. పదవుల కోసం యత్నాలు సాగిస్తారు. గుట్టుగా వ్యవహరించండి. ఎవరినీ అతిగా విశ్వసించవద్దు. అధికారులకు హోదా మార్పు. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. ఉపాధి పథతాల్లో నిలదొక్కుకుంటారు. వ్యాపారాభివృద్ధికి మరింత శ్రమించాలి. పెద్దమొత్తం సరుకు నిల్వలో జాగ్రత్త. ఒక సంఘటన ఆందోళన కలిగిస్తుంది. ప్రయాణం వాయిదా వేసుకుంటారు.
 
కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
ఈ వారం ఆశాజనకమే. శుభకార్యాలకు హాజరవుతారు. బంధుత్వాలు బలపడతాయి. ప్రణాళికలు రూపొందించుకుంటారు. అంచనాలు ఫలిస్తాయి. ఖర్చులు అధికం. డబ్బుకు ఇబ్బంది వుండదు. రుణ విముక్తులవుతారు. పనులు త్వరితగతిన పూర్తవుతాయి. గృహంలో స్తబ్దత తొలగుతుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. సన్నిహితుల ప్రోత్సాహం వుంది. ఎదురుచూస్తున్న పత్రాలు అందుతాయి. సంతానం కదలికలపై దృష్టి పెట్టండి. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. పెద్దల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. పోగొట్టుకున్న వస్తువుల లభ్యం కావు. ఉద్యోగస్తులు అధికారుల మన్ననలు పొందుతారు. వ్యాపారాల్లో లాభాల్లో, అనుభవం గడిస్తారు. సంస్థల స్థాపనలకు అనుకూలం. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. ఆలయాలు సందర్శిస్తారు. కళ, క్రీడాకారులకు ఆదరణ లభిస్తుంది.
 
తుల: చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
ప్రతికూలతలు అధికం. మనస్థిమితం వుండదు. అన్యమనస్కంగా గడుపుతారు. అతిగా ఆలోచించవద్దు. వ్యాపకాలు సృష్టించుకోండి. ఆప్తులతో కాలక్షేపం చేసేందుకు యత్నించండి. ఖర్చులు అంచనాలను మించుతాయి. ఒక అవసరానికి వుంచిన ధనం మరోదానికి వ్యయం చేస్తారు. ఆది, సోమ వారాలలో కొత్త సమస్యలెదురవుతాయి. సన్నిహితుల కలయికతో కుదుటపడతారు. ఒక ఆహ్వానం ఆలోచింపజేస్తుంది. మీ శ్రీమతికి అన్ని విషయాలు తెలియజేయండి. సంతానం విషయంలో శుభఫలితాలున్నాయి. గృహమార్పు ఫలితం నిదానంగా కనిపిస్తుంది. పత్రాల రెన్యువల్లో మెలకువ వహించండి. బాధ్యతలు అప్పగించవద్దు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు ఏకాగ్రత, సమయపాలన ప్రధానం. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ప్రముఖులకు స్వాగతం, వీడ్కోలు పలుకుతారు. వాహనం నడిపేటపుడు జాగ్రత్త.
 
వృశ్చికం: విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ట 1, 2, 3, 4 పాదాలు
కార్యసిద్ధికి మరింత శ్రమించాలి. సాయం ఆశించవద్దు. నమ్మకస్తులే తప్పుదారి పట్టిస్తారు. గుట్టుగా వ్యవహరించండి. ఆంతరంగిక విషయాలు వెల్లడించవద్దు. ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. చేతిలో ధనం నిలవదు. పనుల్లో ఒత్తిడి, జాప్యం అధికం. మంగళ, బుధ వారాల్లో కొన్ని సంఘటనలు మనస్థిమితం లేకుండా చేస్తాయి. ప్రముఖుల సందర్శనం వీలుపడదు. సన్నిహితుల జోక్యంతో ఒక సమస్య సానుకూలమవుతుంది. పోగొట్టుకున్న పత్రాలు తిరిగి సంపాదిస్తారు. ఇంటి విషయాలపై శ్రద్ధ వహించండి. శుభకార్యానికి గైర్హాజరవుతారు. ఆరోగ్యం మందగిస్తుంది. వైద్య సేవలు తప్పకపోవచ్చు. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి పెడతారు. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. అధికారులకు స్థానం చలనం. ముఖ్యులకు వీడ్కోలు పలుకుతారు.
 
ధనస్సు: మూల, పూర్వాషాడ, ఉత్తరాషాడ 1వ పాదం
ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. రావలసిన ధనం అందుతుంది. ప్రణాళికలు రూపొందించుకుంటారు. అంచనాలు ఫలిస్తాయి. ఉల్లాసంగా గడుపుతారు. గృహం ప్రశాంతంగా వుంటుంది. పనులు చురుకుగా సాగుతాయి. పదవుల కోసం యత్నాలు సాగిస్తారు. గురువారం నాడు అపరిచితులతో జాగ్రత్త. మీ నుంచి విషయసేకరణకు కొంతమంది యత్నిస్తారు. మీ శ్రీమతి సలహా పాటించండి. వేడుకకు సన్నాహాలు సాగిస్తారు. సంతానం విషయంలో శుభఫలితాలున్నాయి. పాత పరిచయస్తులతో సంభాషిస్తారు. ఒక సమాచారం ఆలోచింపజేస్తుంది. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఆటుపోట్లను ధీటుగా ఎదుర్కొంటారు. ఉద్యోగ బాధ్యతల్లో మెలకువ వహించండి. వైద్య రంగాల వారికి సదవకాశాలు లభిస్తాయి. విదేశాల్లోని ఆత్మీయుల క్షేమం తెలుసుకుంటారు.
 
మకరం: ఉత్తరాషాడ, 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
మనోధైర్యంతో వ్యవహరిస్తారు. మీ పట్టుదల స్ఫూర్తిదాయకమవుతుంది. కొత్త పరిచయాలేర్పడతాయి. వేడుకను ఘనంగా చేస్తారు. ప్రముఖుల రాక సంతోషాన్నిస్తుంది. పదవులు, సభ్యత్వాలు స్వీకరిస్తారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. శుక్ర, శని వారాల్లో ఊహించని ఖర్చులుంటాయి. ధనం మితంగా వ్యయం చేయండి. పనులు మొండిగా పూర్తి చేస్తారు. కుటుంబీకుల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. గృహంలో మార్పుచేర్పులకు అనుకూలం. పెట్టుబడులకు తరుణం కాదు. విద్యాసంస్థలకు కొత్త సమస్యలెదురవుతాయి. వృత్తి ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. స్పెక్యులేషన్ రంగాల వారికి ఆశాజనకం. షేర్ల క్రయవిక్రయాలు లాభిస్తాయి.
 
కుంభం: ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
ఆర్థిక లావాదేవీలు కొలిక్కి వస్తాయి. ఖర్చులు విపరీతం. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. ఒక సమాచారం ఆసక్తి కలిగిస్తుంది. సన్నిహితులతో సంప్రదింపులు జరుపుతారు. వ్యాపకాలు, పరిచయాలు అధికమవుతాయి. మీ శ్రీమతి విషయంలో దాపరికం తగదు. ఆది, మంగళ వారాల్లో పత్రాలు సమాయానికి కనిపించవు. ఆలోచనలతో సతమతమవుతారు. స్థిమితంగా వుండటానికి యత్నించండి. ఎవరినీ తప్పుపట్టవద్దు. మీ తప్పిదాలను సరిదిద్దుకునేందుకు యత్నించండి. ఆత్మీయుల ఆహ్వానం ఉత్సాహాన్నిస్తుంది. సంతానం విషయంలో శుభఫలితాలున్నాయి. వైద్య, న్యాయ, సాంకేతిక రంగాల వారికి ఆదాయాభివృద్ధి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉమ్మడి వ్యాపారాలు అనుకూలించవు. ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. ప్రయాణంలో ఒకింత అవస్తలు తప్పవు.
 
మీనం: పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
మీదైన రంగంలో రాణిస్తారు. అవకాశాలు కలిసివస్తాయి. సమయోచితంగా నిర్ణయాలు తీసుకుంటారు. ధనలాభం, వస్త్రప్రాప్తి ఉన్నాయి. వ్యాపకాలు సృష్టించుకుంటారు. బుధ, గురు వారాల్లో అప్రమత్తంగా వుండాలి. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. విలాసాలకు వ్యయం చేస్తారు. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. వేడుకకు సన్నాహాలు సాగిస్తారు. ఫోన్ సందేశాలను విశ్వసించవద్దు. గృహమార్పు చికాకుపరుస్తుంది. విలువైన వస్తువులు జాగ్రత్త. ప్రియతముల గురించి ఆందోళన చెందుతారు. ఉద్యోగస్తులకు శుభయోగం. అధికారుల మన్నననలు పొందుతారు. వ్యాపారాల్లో పురోభివృద్ధి సాధిస్తారు. సరకు నిల్వలో జాగ్రత్త. మార్కెట్ రంగాల వారికి మార్పులు అనుకూలిస్తాయి. పిల్లలకు వాహనం ఇవ్వొద్దు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు