12-09-2021 నుంచి 18-09-2021 వరకు మీ వార రాశి ఫలితాలు
శనివారం, 11 సెప్టెంబరు 2021 (22:59 IST)
మేషం: అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం
కార్యసాధనలో సఫలీకృతులవుతారు. ఆర్థికలావాదేవీలు కొలిక్కివస్తాయి. ధనలాభం, వస్త్రప్రాప్తి వున్నాయి. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. ఆది, మంగళవారాల్లో పనులు మందకొడిగా సాగుతాయి. ఆప్తులతో ఉల్లాసంగా గడుపుతారు. గృహం సందడిగా ఉంటుంది. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. మధ్యవర్తులను నమ్మవద్దు. ప్రతి విషయంలో ఆచితూచి అడుగేయాలి. ఒక సమాచారం ఆలోచింపజేస్తుంది. మీ శ్రీమతితో సంప్రదింపులు జరుపుతారు. కార్యక్రమాలు వాయిదా పడతాయి. సంతానం ద్వారా శుభవార్తలు వింటారు. అవివాహితుల ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. నూతన వ్యాపారాలకు తరుణం కాదు. ఉద్యోగ బాధ్యతల్లో తప్పిదాలను సరిదిద్దుకుంటారు. అధికారులకు హోదా మార్పు, స్థానచలనం. ముఖ్యులకు వీడ్కోలు పలుకుతారు.
ప్రతికూలతలు అధికం. చిన్న విషయానికే ఆందోళన చెందుతారు. ఆలోచనలు నిలకడగా వుండవు. స్థిమితంగా వుండేందుకు ప్రయత్నించండి. సన్నిహితుల కలయికతో కుదుటపడతారు. వ్యాపకాలు అధికమవుతాయి. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆదాయ వ్యయాలకు పొంతన వుండదు. బుధవారం నాడు దుబారా ఖర్చులు విపరీతం. ఆరోగ్యం మందగిస్తుంది. వైద్యసేవలు తప్పకపోవచ్చు. ఎదురుచూస్తున్న పత్రాలు అందుతాయి. సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. ఎదుటివారి అభిప్రాయాలకు విలువ ఇవ్వండి. వృత్తి ఉపాధి పథకాలు సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం. సహోద్యోగుల సాయంతో ఒక సమస్య సద్దుమణుగుతుంది. హోల్‌సేల్ వ్యాపారులు, స్టాకిస్టులకు పురోభివృద్ధి. మార్కెట్ రంగాల వారికి ఆశాజనకం.
కార్యం సిద్ధిస్తుంది. బుద్ధిబలంతో రాణిస్తారు. పరిచయాలు ఉన్నతికి తోడ్పడతాయి. పదవుల స్వీకరణకు అనుకూలం. కొత్త ఆలోచనలతో అడుగు ముందుకేస్తారు. ఖర్చులు విపరీతం. డబ్బుకు ఇబ్బంది వుండదు. ఖరీదైన వస్తువులు కొనుగోలు చేస్తారు. పనులు సానుకూలమవుతాయి. మీ సాయంతో ఒకరికి సదవకాశం లభిస్తుంది. గురు, శుక్రవారాల్లో అప్రమత్తంగా వుండాలి. బాధ్యతలు ఇతరులకు అప్పగించవద్దు. కొత్త వ్యక్తులతో జాగ్రత్త. మీ శ్రీమతికి అన్ని విషయాలు తెలియజేయండి. స్థిరాస్తి క్రయ విక్రయంలో పునరాలోచన మంచిది. వ్యాపారాల్లో గణనీయమైన పురోభివృద్ధి సాధిస్తారు. చిరు వ్యాపారులకు కలిసివచ్చే కాలం.
కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
మనోధైర్యంతో యత్నాలు సాగించండి. అవకాశాలను వదులుకోవద్దు. ప్రతి విషయంలోను అప్రమత్తంగా వుండాలి. సలహాలు, సాయం ఆశించవద్దు. ఆది, శనివారాల్లో కొత్త సమస్యలెదురయ్యే సూచనలున్నాయి. పనులు మొక్కుబడిగా పూర్తి చేస్తారు. ఖర్చులు అంచనాలను మించుతాయి. ప్రతి వ్యవహారం ధనంతో ముడిపడి వుంటుంది. ఆత్మీయుల కలయికతో కుదుటపడతారు. ఇంటి విషయాలపై శ్రద్ధ వహిస్తారు. వ్యాపకాలు అధికమవుతాయి. గృహమార్పు ఫలితం నిదానంగా కనిపిస్తుంది. సంతానం ఉన్నత చదువులను వారి ఇష్టానికే వదిలేయండి. ఉద్యోగస్తులకు పనిభారం. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. సరుకు నిల్వలో జాగ్రత్త. ఉపాధి ఫథకాలు సామాన్యంగా సాగుతాయి. పోగొట్టుకున్న వస్తువులు లభ్యంకావు. ప్రయాణం విరమించుకుంటారు.
సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
మొహమ్మాటాలు, భేషజాలకు పోవద్దు. ఆచితూచి వ్యవహరించాలి. పెద్దల సలహా పాటించండి. ఖర్చులు విపరీతం. చేతిలో ధనం నిలవదు. ధనసాయం అర్ధించేందుకు మనస్కరించదు. ఆదాయ మార్గాలు అన్వేషిస్తారు. మంగళ, బుధవారాల్లో పనులు, బాధ్యతలు ఇతరులకు అప్పగించవద్దు. గృహ మార్పు కలిసివస్తుంది. శుభకార్యానికి యత్నాలు ప్రారంభిస్తారు. సన్నిహితుల కలయిక ఉపశమనం కలిగిస్తుంది. ముఖ్యమైన పత్రాలు అందుకుంటారు. ఆస్తుల క్రయ విక్రయంలో పునరాలోచన మంచిది. పెట్టుబడులకు తరుణం కాదు. ఆశించిన దక్కవు. ఏ విషయాన్నీ తీవ్రంగా పరిగణించవద్దు. వ్యాపారాల్లో పురోభివృద్ధి సాధిస్తారు. పెద్దమొత్తం సరుకు నిల్వలో జాగ్రత్త. ఉపాధ్యాయులకు పదోన్నతి, స్థానచలనం. మార్కెట్ రంగాల వారి టార్గెట్లు పూర్తి చేస్తారు. కార్మికులకు సదవకాశాలు లభిస్తాయి.
పరిస్థితులు క్రమంగా మెరుగుపడతాయి. పట్టుదలతో అనుకున్నది సాధిస్తారు. వ్యాపకాలు అధికమవుతాయి. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. ఆది, గురువారాల్లో దుబారా ఖర్చులు విపరీతం. పనులు మొండిగా పూర్తి చేస్తారు. మీ శ్రీమతి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. సంతానం విషయంలో శుభఫలితాలున్నాయి. చిన్ననాటి పరిచయస్తులు తారసపడతారు. గత అనుభవాలు అనుభూతినిస్తాయి. వేడుకకు హాజరవుతారు. మీ రాక బంధుమిత్రులకు సంతోషాన్నిస్తుంది. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. వ్యాపారాల్లో ఆటుపోట్లను ధీటుగా ఎదుర్కొంటారు. చిన్న మధ్య తరహా వ్యాపారులకు పురోభివృద్ధి. ఉద్యోగస్తులకు యూనియన్‌లో గుర్తింపు లభిస్తుంది. సామాజిక, పుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు.
ఈ వారం యోగదాయకమే. సమర్థతను చాటుకుంటారు. పదవులు, సభ్యత్వాల స్వీకరణకు అనుకూలం. బాధ్యతలు అధికమవుతాయి. వ్యతిరేకులు సన్నిహితులవుతారు. గృహం సందడిగా ఉంటుంది. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం కలిసివస్తుంది. మీ అభిప్రాయాలను పెద్దల ద్వారా తెలియజేయండి. ఆదాయం బాగుంటుంది. ఊహించని ఖర్చులే వుంటాయి. నగదు విలువైన వస్తువులు జాగ్రత్త. ఎవరినీ నిందించవద్దు. పత్రాల రెన్యువల్‌లో మెలకువ వహించండి. ఆరోగ్యం నిలకడగా వుంటుంది. ఉల్లాసంగా గడుపుతారు. ఆధ్యాత్మిక యోగా విషయాలపై ఆసక్తి కలుగుతుంది. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. రిటైర్డ్ ఉద్యోగులకు వీడ్కోలు పలుకుతారు. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. విందులు, వేడుకల్లో అత్యుత్సాహం తగదు.
వ్యవహారాలు మీ చేతులమీదుగా సాగుతాయి. ఆప్తులకు చక్కని సలహాలిస్తారు. మీ సమర్థతపై ఎదుటివారికి గురి కుదురుతుంది. ధనలాభం, వస్త్రప్రాప్తి ఉన్నాయి. సన్నిహితులకు సాయం అందిస్తారు. బంధుత్వాలు బలపడతాయి. వాయిదా పడుతూ వస్తున్న పనులు పూర్తి చేస్తారు. ఇతరులను మీ విషయాలకు దూరంగా వుంచండి. ఫోన్ సందేశాల పట్ల అప్రమత్తంగా వుండాలి. బ్యాంకు వివరాలు వెల్లడించవద్దు. సంతానానికి ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. వ్యాపారాల్లో ఒడిదుడుకులను ధీటుగా ఎదుర్కొంటారు. నూతన వ్యాపారాలు కలిసివస్తాయి. ఉపాధ్యాయులకు ఆకస్మిక స్థానచలనం. ఉపాది పథకాల్లో నిలదొక్కుకుంటారు. ప్రైవేస్ సంస్థ ఉద్యోగస్తులకు కష్టకాలం. కంప్యూటర్, సాంకేతిక రంగాల వారికి ఆదాయాభివృద్ధి. దైవకార్య సమావేశాల్లో పాల్గొంటారు.
కార్యసిద్ధి, ధనలాభం ఉన్నాయి. ప్రశంసలందుకుంటారు. పనులు సానుకూలమవుతాయి. వ్యాపకాలు సృష్టించుకుంటారు. అవకాశాలను తక్షణం అందిపుచ్చుకోండి. సోమ, మంగళ వారాల్లో వాగ్వాదాలకు దిగవద్దు. మీ గౌరవానికి భంగం కలుగకుండా మెలగండి. ఖర్చులు విపరీతం. విలాసాలకు వ్యయం చేస్తారు. ఆంతరంగిక విషయాలు గోప్యంగా వుంచండి. పోగొట్టుకున్న పత్రాలు సంపాదిస్తారు. గృహ నిర్మాణాలు చురుకుగా సాగుతాయి. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. శుభకార్యానికి యత్నాలు సాగిస్తారు. పరిచయాలు, బంధుత్వాలు బలపడతాయి. వ్యాపారాభివృద్ధికి మరింత శ్రమించాలి. వృత్తి ఉద్యోగాల్లో పురోగమిస్తారు. ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. యోగా, ఆధ్యాత్మికతలపై ఆసక్తి కలుగుతుంది. పుణ్యక్షేత్రాలు, కొత్త ప్రదేశాలు సందర్శిస్తారు.
లక్ష్యసాధనకు అవిశ్రాంతంగా శ్రమిస్తారు. కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. అయిన వారితో సంభాషిస్తారు. మాటతీరు ఆకట్టుకుంటుంది. మీ జోక్యంతో ఒక సమస్య సానుకూలమవుతుంది. పనులు హడావుడిగా సాగుతాయి. బుధ, గురువారాల్లో దుబారా ఖర్చులు విపరీతం. రాబడిపై దృష్టి పెడతారు. గృహంలో మార్పుచేర్పులకు అనుకూలం. విలువైన వస్తువులు మరమ్మతుకు గురవుతాయి. పనివారల ధోరణి చికాకు పరుస్తుంది. సౌమ్యంగా మెలగండి. ఎవరినీ తప్పుపట్టవద్దు. ఉపాధ్యాయులకు పదోన్నతి, స్థానచలనం. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. నూతన వ్యాపారాలకు తరుణం కాదు. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. కార్మకులకు సదవకాశాలు లభిస్తాయి. పాత పరిచయస్తులను కలుసుకుంటారు. సభలు, కీలక సమావేశాల్లో పాల్గొంటారు.
ఓర్పు, పట్టుదలతో శ్రమించండి. మీ కష్టం వృధా కాదు. త్వరలో పరిస్థితులు అనుకూలిస్తాయి. ఏ విషయాన్ని తీవ్రంగా పరిగణించవద్దు. ఆదాయానికి లోటు లేకున్నా వెలితిగా వుంటుంది. పనులు మొండిగా పూర్తి చేస్తారు. శుక్ర, శనివారాల్లో అప్రియమైన వార్తలు వినవలసి వస్తుంది. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. కుటుంబీకుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం కలిసివస్తుంది. జాతక పొంతన ప్రధానం. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు సంతృప్తినీయజాలవు. ప్రైవేట్ సంస్థ ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం. నూతన అధికారులకు స్వాగతం పలుకుతారు. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులుండవు. చిరు వ్యాపారులకు ఆశాజనకం. న్యాయ, కంప్యూటర్ రంగాల్లో వారికి ఆదాయాభివృద్ధి.
మీనం: పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి
కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. సన్నిహితుల ప్రోత్సాహం ఉంది. అవకాశాలు చేజారినా నిరుత్సాహపడవద్దు. పట్టుదలతో ముందుకు సాగండి. ఆది, బుధవారాల్లో పత్రాలు, నగదు జాగ్రత్త. ఖర్చులు విపరీతం. డబ్బుకు ఇబ్బంది వుండదు. చెల్లింపల్లో మెలకువ వహించండి. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. ఇంటి విషయాలపై శ్రద్ధ వహిస్తారు. పెట్టుబడులకు తరుణం కాదు. స్థిరాస్తి క్రయ విక్రయాల్లో పునరాలోచన శ్రేయస్కరం. ఆరోగ్యం నిలకడగా వుంటుంది. ఉపాధ్యాయులకు పదవీయోగం, స్థానచలనం. ప్రైవేట్ విద్యా సంస్థలకు ఆశాజనకం. వ్యాపారాల్లో ఆటుపోట్లను ధీటుగా ఎదుర్కొంటారు. మీ పథకాలు సత్ఫలితాలిస్తాయి. నిరుద్యోగులకు ఉపాధి శిక్షణ లభిస్తుంది. గృహ నిర్మాణాలు ఊపందుకుంటాయి. ట్రాన్స్‌పోర్ట్ రంగాల వారికి కొత్త సమస్యలెదురవుతాయి.