01-05-2022 నుంచి 07-05-2022 వరకు మీ వార రాశిఫలాలు

శనివారం, 30 ఏప్రియల్ 2022 (21:38 IST)
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు. కృత్తిక 1వ పాదము 
ఆర్థిక స్థితి నిరాశాజనకం. నిస్తేజానికి లోనవుతారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. ఖర్చులు విపరీతం. ఒక అవసరానికి ఉంచిన ధనం మరోదానికి వ్యయం చేస్తారు. స్థిరాస్తి విక్రయంలో పునరాలోచన మంచిది. ఆది, సోమవారాల్లో ఏ పనీ సాగదు. మీపై శకునాల ప్రభావం అధికం. గృహమార్పు ఏమంత ఫలితమీయదు. దంపతుల మధ్య అకారణ కలహం. కొన్ని విషయాలు పట్టించుకోవద్దు. ఆత్మీయుల కలయికతో కుదుటపడతారు. ఒక సమాచారం ఉత్తేజాన్నిస్తుంది. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం కలిసివచ్చే సూచనలున్నాయి. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు ఏమంత సంతృప్తినీయవు. ఉపాధ్యాయులకు స్థానచలనం. రిటైర్డు అధికారులకు వీడ్కోలు పలుకుతారు. వ్యాపారాభివృద్ధికి మరింత శ్రమించాలి. ప్రయాణం విరమించుకుంటారు.
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదములు, రోహిణి, మృగశిర 1, 2, పాదములు 
వేడుకకు సన్నాహాలు సాగిస్తారు. బంధుత్వాలు బలపడతాయి. ఒక వ్యవహారంలో మీ జోక్యం అనివార్యం. ఖర్చులు అధికం. విలాసాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. బుధవారం నాడు నగదు డ్రా చేసేటపుడు జాగ్రత్త. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. సంతానం ఉన్నత చదువులపై దృష్టి పెట్టండి. మీ సిఫార్సుతో ఒకరికి సదావకాశం లభిస్తుంది. పరిచయాలు బలపడతాయి. పదవులు, సభ్యత్వాలకు యత్నాలు సాగిస్తారు. గుట్టుగా వ్యవహరించండి. వ్యతిరేకులు మీ ఆలోచనలను నీరుగార్చేందుకు యత్నిస్తారు. అంతరంగిక విషయాలు వెల్లడించవద్దు. పత్రాలు అందుకుంటారు. విలువైన వస్తువులు మరమ్మతుకు గురవుతాయి. వ్యాపారాలు ఊపందుకుంటాయి. స్వల్ప అస్వస్థతకు గురవుతారు. వైద్యసేవలు అవసరమవుతాయి. యోగా విషయాలపై ఆసక్తి పెంపొందుతుంది.
 
మిథునం :మృగశిర 3, 4 పాదములు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదములు 
గృహాలు అనుకూలిస్తాయి. పట్టుదలతో అనుకున్నది సాధిస్తారు. అందరితో సంబంధాలు మెరుగుపడతాయి. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం, మొండిబాకీలు వసూలువుతాయి. శుభకార్యాన్ని ఘనంగా చేస్తారు. మీ ఉన్నతి బంధువులకు అసూయ కలిగిస్తుంది. కొన్ని విషయాలు పట్టించుకోవద్దు. గురు, శుక్రవారాల్లో అనవసర జోక్యం తగదు. మీ గౌరవానికి భంగం కలుగకుండా మెలగండి. శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు అనుకూలం. ముఖ్యమైన పత్రాలు అందుకుంటారు. పనులు చురుకుగా సాగుతాయి. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. ఉద్యోగస్తులకు పనిభారం. అధికారులకు స్వాగతం పలుకుతారు. కార్మికులకు పనులు లభిస్తాయి. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. మీ పథకాలు మునుముందు సత్ఫలితాలిస్తాయి. సరుకు నిల్వలో జాగ్రత్త. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదము, పుష్యమి, ఆశ్లేష 1, 2, 3, 4 పాదములు 
సత్కాలం సమీపిస్తోంది. ఆలోచనలను క్రియారూపంలో పెట్టండి. గత కొంత కాలంగా వేధిస్తున్న సమస్యలు పరిష్కారమవుతాయి. ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. మంగళ, బుధవారాల్లో చెల్లింపులు, నగదు స్వీకరణలో జాగ్రత్త. సావకాశంగా పనులు పూర్తి చేస్తారు. బ్యాంకు వివరాలు వెల్లడించవద్దు. ప్రతి విషయం స్వయంగా తెలుసుకోవాలి. మీ శ్రీమతికి అన్ని విషయాలు తెలియజేయండి. స్థిరాస్తి కొనుగోలు దిశగా యత్నాలు సాగిస్తారు. ఒక ఆహ్వానం సంతోషపరుస్తుంది. బంధువులతో సంబంధాలు మెరుగుపడతాయి. ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులుండవు. నూతన వ్యాపారాలు కలిసివస్తాయి. వాయిదా పడిన మొక్కులు తీర్చుకుంటారు. 
 
సింహం : మఖ, పుబ్బ 1, 2, 3, 4, పాదములు, ఉత్తర 1వ పాదము 
ప్రతికూలతలు అధికం. అవకాశాలు కలిసిరావు. అయిన వారే మీ వ్యాఖ్యలను తప్పుపడతారు. లౌక్యంగా పనులు చక్కబెట్టుకోవాలి. ఆధిపత్యం ప్రదర్శించవద్దు. ఖర్చులు అంచనాలను మించుతాయి. రుణాలు, చేబదుళ్లు స్వీకరిస్తారు. శుక్ర, శనివారాల్లో కావలసిన విషయాల్లో కలయిక వీలుపడదు. మీపై శకునాల ప్రభావం అధికం. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. సన్నిహితుల సాయం అందుతుంది. ఆందోళన తగ్గి కుదుటపడతారు. సంతానం భవిష్యత్తుపై దృష్టి పెడతారు. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. కొత్త పరిచయాలు ఉన్నతికి తోడ్పడతాయి. నేత్ర, ఉదర సంబంధిత చికాకులెదుర్కుంటారు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగ బాధ్యతల్లో మెలకువ వహించండి. రిటైర్డు అధికారులకు ఆత్మీయ వీడ్కోలు పలుకుతారు. వాహనం ఇతరులకివ్వవద్దు. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదములు, హస్త, చిత్త 1, 2 పాదములు 
శ్రమాధిక్యత మినహా ఫలితం శూన్యం. మీ సమర్థత మరొకరికి కలిసివస్తుంది. నిస్తేజానికి లోనవుతారు. ఆకస్మిక ఖర్చులు, రుణదాతల ఒత్తిళ్లు ఆందోళన కలిగిస్తాయి. కుటుంబీకులు మీ అశక్తతను అర్ధం చేసుకుంటారు. గుట్టుగా యత్నాలు సాగించండి. కొంతమంది మీ ఆలోచనలను నీరుగారుస్తారు. అంతరంగిక విషయాలు వెల్లడించవద్దు. ఆదివారం నాడు పనులు సాగవు. ఈ చికాకులు తాత్కాలికమే. త్వరలో పరిస్థితులు అనుకూలిస్తాయి. ఒక ఆహ్వానం ఉత్సాహాన్నిస్తుంది. ప్రియతములను కలుసుకుంటారు. మీ శ్రీమతి ఆరోగ్యం మెరుగుపడుతుంది. ధార్మిక విషయాలపై దృష్టి పెడతారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు ఏమంత సంతృప్తినీయవు. ఉపాధ్యాయులకు స్థానచలనం. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. నిర్మాణాలు మందకొడిగా సాగుతాయి.
 
తుల : చిత్త 3, 4 పాదములు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదములు 
అవిశ్రాంతంగా శ్రమిస్తారు. సమర్ధతకు నిదానంగా గుర్తింపు లభిస్తుంది. ఆశావహదృక్పథంతో యత్నాలు సాగించండి. సలహాలు, సహాయం ఆశించవద్దు. త్వరలో శుభవార్త వింటారు. పనులు హడావుడిగా సాగుతాయి. ఖర్చులు అదుపులో ఉండవు. విలువైన వస్తువులు మరమ్మతుకు గురవుతాయి. ఆరోగ్యం జాగ్రత్త. మీ శ్రీమతి వైఖరి అసహనం కలిగిస్తుంది. అయినవారి మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. మీ ప్రతిపాదనలకు ఏమంత స్పందన ఉండదు. ఎదుటివారి ఆంతర్యం గ్రహించండి. నోటీసులు అందుకుంటారు. గృహమార్పు అనివార్యం. కాంట్రాక్టర్లు, బిల్డర్లకు కష్టకాలం. వ్యాపారాల్లో ఒడిదుడుకులను అధిగమిస్తారు. చిన్న వ్యాపారులకు ఆశాజనకం. ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. ఉపాధ్యాయులకు స్థానచలనం. దైవకార్యంలో పాల్గొంటారు. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదము. అనూరాధ, జ్యేష్ఠ 1,2,3,4 పాదములు 
ఈ వారం యోగదాయకమే. అనుకోకుండా అవకాశాలు కలిసివస్తాయి. మానసికంగా కుదుటపడతారు. ఆదాయం సంతృప్తికరం. ఖర్చులు భారమనిపించవు. ఆప్తులతో ఉల్లాసంగా గడుపుతారు. పనులు వేగవంతమవుతాయి. ఇంటి విషయాలపై శ్రద్ధ వహిస్తారు. విలువైన వస్తువులు జాగ్రత్త. బాధ్యతలు అప్పగించవద్దు. ఆహ్వానం అందుకుంటారు. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. శుభకార్యానికి యత్నాలు సాగిస్తారు. ఫోన్ సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. బ్యాంకు వివరాలు గోప్యంగా ఉంచండి. పాత పరిచయస్తులను కలుసుకుంటారు. అధికారులకు ఒత్తిడి, పనిభారం. ఉద్యోగస్తులకు ధనప్రలోభం తగదు. పరిచయం లేని వ్యక్తులతో జాగ్రత్త. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. హోల్‌సేల్ వ్యాపారులకు పురోభివృద్ధి. షేర్ల క్రయ విక్రయాలకు అనుకూలం. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదము 
ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. రుణసమస్యలు పరిష్కారమవుతాయి. సావకాశంగా పనులు పూర్తి చేస్తారు. అవకాశాలను తక్షణం అందిపుచ్చుకోండి. కొన్ని విషయాలు అనుకున్నట్టే జరుగుతాయి. సోమ, మంగళవారాల్లో దుబారా ఖర్చులు విపరీతం. అప్తులతో ఉల్లాసంగా గడుపుతారు. పెట్టుబడులకు తరుణం కాదు. పరిచయస్తులు ఒత్తిడికి గురిచేస్తారు. మీ అభిప్రాయాలను ఖచ్చితంగా తెలియజేయండి. ఆహ్వానం, పత్రాలు అందుకుంటారు. సంతానం విజయం ఉత్సాహాన్నిస్తుంది. వాస్తుదోష నివారణ చర్యలు చేపడతారు. బిల్డర్లు, కార్మికులకు కష్టకాలం. వృత్తి ఉపాధి పథకాలు సంతృప్తినిస్తాయి. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి.
ప్రైవేట్ సంస్థల ఉద్యోగస్తులకు నిరాశాజనకం. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. సరుకు నిల్వలో జాగ్రత్త. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదములు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదములు 
అనుకూలతలున్నాయి. ఆశావహదృక్పథంతో మెలగండి. ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. కష్టానికి తగ్గ ప్రతిఫలం అందుతుంది. అందరితో సత్సంబంధాలు నెలకొంటాయి. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. బుధ, గురువారాల్లో చెల్లింపులు, నగదు స్వీకరణలో జాగ్రత్త. వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు. బంధువుల ఆకస్మిక రాక ఇబ్బంది కలిగిస్తుంది. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. సంతానం భవిష్యత్తుపై దృష్టి పెడతారు. శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు అనుకూలం. ఆరోగ్యం జాగ్రత్త, కీలక పత్రాలు అందుకుంటారు. ఉపాధ్యాయులకు ఒత్తిడి, పనిభారం. ఉద్యోగస్తులకు ధనప్రలోభం తగదు. అధికారులకు స్వాగతం పలుకుతారు. వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ఉమ్మడి వ్యాపారాలు కలిసివస్తాయి. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదములు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదములు 
అన్ని రంగాల వారికి యోగదాయకమే. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. ఆత్మీయులతో సంభాషణ ఉల్లాసాన్నిస్తుంది. ఆదాయం బాగుంటుంది. విలాసాలకు వ్యయం చేస్తారు. అవకాశాలు అనుకోకుండా కలిసివస్తాయి. పనుల్లో ఒత్తిడి, శ్రమ అధికం. శుక్ర, శనివారాల్లో అప్రియమైన వార్తలు వింటారు. కార్యక్రమాలు వాయిదా పడతాయి. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. మీ ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తుంది. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. పదవుల కోసం యత్నాలు సాగిస్తారు. వ్యతిరేకులతో జాగ్రత్త. వ్యాపారాభివృద్ధికి పథకాలు అమలు చేస్తారు. ఉద్యోగస్తులకు ధనప్రలోభం తగదు. అధికారులకు ఆత్మీయ వీడ్కోలు పలుకుతారు. విందులు, వినోదాల్లో అత్యుత్సాహం తగదు. 
 
మీనం : పూర్వాబాధ్ర 4వ పాదము, ఉత్తరాభాద్ర, రేవతి 1, 2, 3, 4 పాదములు 
లక్ష్యసాధనకు ఓర్పు ప్రధానం. ఏ విషయాన్ని తీవ్రంగా పరిగణించవద్దు. లౌక్యంగా పనులు చక్కబెట్టుకోవాలి. ఆదాయం నిరాశాజనకం. ఏ పురోగతి లేక నిస్తేజానికి లోనవుతారు. నిరుత్సాహం వీడి యత్నాలు సాగించండి. ఆదివారం నాడు కావలసిన వ్యక్తుల కలయిక వీలుపడదు. మీ శ్రీమతి సాయంతో ఒక సమస్య సద్దుమణుగుతుంది. కనిపించకుండా పోయిన పత్రాలు లభ్యమవుతాయి. సంతానం ఉన్నత చదువులపై దృష్టి పెడతారు. గృహమార్పు సత్ఫలితమిస్తుంది. పరిచయాలు బలపడతాయి. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులుండవు. చిన్న వ్యాపారులకు నిరుత్సాహకరం. ప్రైవేట్ సంస్థ ఉద్యోగస్తులకు కొత్త సమస్యలెదురవుతాయి. ఉపాధ్యాయులకు స్థానచలనం. ఉపాధి పథకాలు చేపడతారు. సాంకేతిక రంగాల వారికి ఆదాయాభివృద్ధి. స్టాక్ మార్కెట్ రంగాల వారికి మిశ్రమ ఫలితం. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు