అన్ని రంగాల వారికి కలిసివచ్చే సమయం. కార్యసాధనలో సఫలీకృతులవుతారు. కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. ధైర్యంగా ముందుకు సాగుతారు. మంగళవారం నాడు పరిస్థితులకు అనుగుణంగా మెలగండి. ఒంటెద్దు పోకడ తగదు. నిర్ణయం తీసుకునే ముందు పెద్దలను సంప్రదించండి. ఆదాయం సంతృప్తికరం. ఆర్భాటాలకు విపరీతంగా ఖర్చు చేస్తారు. బంధువులతో ఉల్లాసంగా గడుపుతారు. చేస్తున్న పనులపై శ్రద్ధ వహించండి. సంతానం అత్యుత్సాహం అదుపు చేయండి. ఏ విషయాన్నీ తేలికగా తీసుకోవద్దు. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. తాత్కాలిక వ్యాపారం చేపడతారు. ఉద్యోగ విధులను సమర్థంగా నిర్వహిస్తారు. మీ పనితీరు అధికారులను ఆకట్టుకుంటుంది. ధార్మికత పెంపొందుతుంది. ఆలయాలకు విరాళాలు అందిస్తారు. ప్రయాణం సాఫీగా సాగుతుంది.
గ్రహబలం అనుకూలంగా ఉంది. బాధ్యతలను సమర్ధంగా నిర్వహిస్తారు. కృషికి అదృష్టం తోడవుతుంది. అవకాశాలను చేజిక్కించుకుంటారు. గురువారం నాడు సంబంధం లేని విషయాల జోలికి పోవద్దు. లావాదేవీల్లో ఏమరుపాటు తగదు. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. చెల్లింపుల్లో అలక్ష్యం తగదు. చేపట్టిన పనులు చురుకుగా సాగుతాయి. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. పరిచయస్తులను విందుకు ఆహ్వానిస్తారు. ఆరోగ్యం జాగ్రత్త. ప్రముఖుల సందర్శనం వీలుపడదు. మొండిగా యత్నాలు సాగిస్తారు. కనిపించకుండా పోయిన పత్రాలు లభ్యమవుతాయి. ప్రైవేట్ ఉద్యోగస్తులకు పనిభారం. ఉద్యోగస్తులు అప్రమత్తంగా ఉండాలి. ఎవరినీ అతిగా నమ్మవద్దు. చిరువ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. దైవ, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.
ఆత్మస్థైర్యంతో కొత్తయత్నాలు మొదలు పెడతారు. మీ కృషికి అదృష్టం తోడవుతుంది. పెద్దల ఆశీస్సులందుకుంటారు. మీ శ్రీమతి ప్రోత్సాహం ఉంటుంది. ఖర్చులు అధికం. విలాసాలకు విపరీతంగా ఖర్చుచేస్తారు. ఆదివారంనాడు అప్రమత్తంగా ఉండాలి. అత్యుత్సాహం ప్రదర్శించవద్దు. పరిచయస్తులను విందులకు ఆహ్వానిస్తారు. గృహం సందడిగా ఉంటుంది. చెల్లింపులు, పత్రాలు రెన్యువల్లో అలక్ష్యం తగదు. పనులు, బాధ్యతలు స్వయంగా చూసుకోండి. బంధుమిత్రులతో తరచు సంభాషిస్తారు. ఒక సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. సంస్థల స్థాపనలకు అనుకూలం. తాత్కాలిక వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. వృత్తి ఉద్యోగ బాధ్యతలను సమర్ధంగా నిర్వహిస్తారు. ఉపాధ్యాయులకు పదోన్నతి. నిరుద్యోగులకు సదావకాశాలు లభిస్తాయి. ఆధ్యాత్మిక చింతన అధికమవుతుతుంది.
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
పరిస్థితులు క్రమంగా చక్కబడతాయి. అవిశ్రాంతంగా శ్రమిస్తారు. మీ కృషి ఫలిస్తుంది. ఆందోళన తగ్గి కుదుటపడతారు. ముఖ్యమైన వ్యవహారాలు పురోగతిన సాగుతాయి. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది. మొదలెట్టిన పనులు మధ్యలో ఆపివేయొద్దు. ఆదాయం ఫర్వాలేదనిపిస్తుంది. ఖర్చులు భారమనిపించవు. సంతానం కోసం విపరీతంగా ఖర్చు చేస్తారు. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. సోమవారం నాడు నగదు డ్రా చేసేటపుడు జాగ్రత్త. అపరిచితులను ఓ కంట కనిపెట్టండి. కనిపించకుండా పోయిన పత్రాలు లభ్యమవుతాయి. ఆరోగ్యం బాగుంటుంది. పెట్టుబడులపై దృష్టి పెడతారు. ఉద్యోగపరంగా మంచి ఫలితాలున్నాయి. ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. చిరువ్యాపారాలు ఊపందుకుంటాయి. వృత్తుల వారికి సామాన్యం. వివాదాలు కొలిక్కివస్తాయి.
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. ఖర్చులు తగ్గించుకోవటం శ్రేయస్కరం. భవిష్యత్తులో ధనసమస్య తలెత్తకుండా జాగ్రత్తపడండి. ఆలస్యంగానైనా చేపట్టిన పనులు పూర్తి చేయగల్లుగతారు. బుధవారం నాడు కొత్తవారితో మితంగా సంభాషించండి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు. చిన్ననాటి పరిచయస్తుల కలయిక ఉత్సాహం కలిగిస్తుంది. పత్రాల్లో సవరణలు సాధ్యపడతాయి. వివాహయత్నం ఫలించే సూచనలున్నాయి. తాహతుకు మించిన హామీలివ్వవద్దు. పెద్దల సలహా పాటించండి. మీ చొరవతో ఒకరికి సదావకాశం లభిస్తుంది. బంధుత్వాలు, పరిచయాలు బలపడతాయి. వ్యాపారాభివృద్ధికి మరింత శ్రమించాలి. ఉద్యోగ విధులపై శ్రద్ధ వహించండి. ఒత్తిళ్లు, ధనప్రలోభాలకు లొంగవద్దు. వేడుకలు, వినోదాల్లో దూకుడు తగదు.
కార్యసాధనకు సంకల్పబలం ముఖ్యం. అవిశ్రాంతంగా శ్రమిస్తారు. సంప్రదింపులు ముగింపు దశకు చేరుకుంటాయి. ఒప్పందాల్లో జాగ్రత్త. మీ నిర్ణయం కొంతకాలం వాయిదా వేయటం శ్రేయస్కరం. పెద్దల సలహా తీసుకోండి. పెద్దఖర్చు ఎదురవుతుంది. ఆదాయ మార్గాలు అన్వేషిస్తారు. అవసరానికి ధనం అందుతుంది. ఇతరులను మీ విషయాలకు దూరంగా ఉంచండి. ఆదివారం నాడు ఏ పనీ చేయ బుద్ధికాదు. ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు. పత్రాల్లో సవరణలు సాధ్యపడవు. దూరపు బంధువుల ఆహ్వానం అందుకుంటారు. దంపతుల మధ్య స్వల్పకలహం. చీటికిమాటికి అసహనం చెందుతారు. వ్యాపారాభివృద్ధికి పథకాలు అమలు చేస్తారు. షాపుల స్థలమార్పు అనివార్యం. ఉద్యోగ బాధ్యతలపై శ్రద్ధ వహించండి. అధికారులకు స్థానచలనం. ప్రయాణం తలపెడతారు.
మీ నేర్పునకు పరీక్షాసమయం. వ్యవహారాల్లో తప్పటడుగు వేసే ఆస్కారం ఉంది. కొందరి వ్యాఖ్యలు నిరుత్సాహపరుస్తాయి. మనోబలంతో ముందుకు సాగుండి. సాయం ఆశించవద్దు. స్వయంకృషితోనే అనుకున్నది సాధిస్తారు. ఊహించని ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. ఒక అవసరానికి ఉంచిన ధనం మరోదానికి ఖర్చుచేస్తారు. ఆలస్యంగానైనా పనులు అనుకున్న విధంగా పూర్తికాగలవు. ఆత్మీయులతో తరచుగా సంభాషిస్తారు. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్చమవుతాయి. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం కుదిరే సూచనలున్నాయి. నిశ్చితార్ధంలో జాగ్రత్త. ఉపాధి పథకాలు సామాన్యంగా సాగుతాయి. కొత్త వ్యాపారాలు కలిసిరావు. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. ఉద్యోగస్తులకు ధనప్రలోభం తగదు. ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
ఈ వారం అనుకూలదాయకం. మీ కృషి ఫలిస్తుంది. లక్ష్యానికి చేరువవుతారు. ఆదాయం సంతృప్తికరం. దీర్ఘకాలిక సమస్యలు తొలగుతాయి. ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తి చేస్తారు. పొదుపు పథకాలపై దృష్టి పెడతారు. చిట్స్, ఫైనాన్సుల జోలికి పోవద్దు. నమ్మకస్తులే తప్పుదారి పట్టించే ఆస్కారం ఉంది. దంపతుల మధ్య దాపరికం తగదు. మీ సాయంతో ఒకరికి లబ్ధి చేకూరుతుంది. గృహమరమ్మలు చేపడతారు. సంతానం కదలికలపై కన్నేసి ఉంచండి. ఏ విషయాన్నీ తేలికగా తీసుకోవద్దు. ఆప్తుల ఆహ్వానం ఉత్సాహపరుస్తుంది. ఆశావహదృక్పథంతో ఉద్యోగయత్నం సాగించండి. ఉద్యోగస్తుల కార్యకలాపాలు ప్రశాంతంగా సాగుతాయి. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు ఆటుపోట్లను ధీటుగా ఎదుర్కుంటారు. అసాంఘిక కార్యకలాపాల జోలికి పోవద్దు.
లావాదేవీలు విజయవంతమవుతాయి. ఆర్థిక సమస్యలకు పరిష్కారం గోచరిస్తుంది. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. పెట్టుబడుల విషయంలో పునరాలోచన శ్రేయస్కరం. పనులు సజావుగా సాగుతాయి. సోమవారం నాడు అనుకోని సంఘటన ఎదురువుతుంది. ఇతరుల విషయంలో జోక్యం చేసుకోవద్దు. మీ శ్రీమతి వద్ద దాపరికం తగదు. సంతానం దూకుడు అదుపు చేయండి. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. మీ కృషిలో లోపం లేకుండా చూసుకోండి. సలహాలు, సాయం ఆశించవద్దు. కొందరి వ్యాఖ్యలు నిరుత్సాహపరుస్తాయి. పట్టుదలతో యత్నాలు సాగించండి. వ్యాపారాలు జోరుగా సాగుతాయి. ఉమ్మడి వ్యాపారాలపై దృష్టిపెడతారు. ఉద్యోగపరంగా మంచి ఫలితాలున్నాయి. ప్రైవేట్ ఉద్యోగస్తులకు మెరుగైన అవకాశం లభిస్తుంది. కీలక సమావేశాల్లో పాల్గొంటారు.
అనుకూలతలు నెలకొంటాయి. లక్ష్యానికి చేరువవుతారు. ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. ఆదాయం సంతృప్తికరం. వినోదాలకు విపరీతంగా ఖర్చుచేస్తారు. మీ జోక్యంతో ఒక వివాదం సద్దుమణుగుతుంది. బుధవారం నాడు అప్రమత్తంగా ఉండాలి. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. నమ్మకస్తులే తప్పుదారి పట్టించేందుకు యత్నిస్తారు. దూరపు బంధువుల ఆహ్వానం సంతోషం కలిగిస్తుంది. గృహమరమ్మతులు చేపడతారు. పత్రాలు, నగదు జాగ్రత్త. తరచు ఆత్మీయులతో సంభాషిస్తారు. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం కుదిరే సూచనలున్నాయి. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. అధికారులకు హోదామార్పు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. చిరువ్యాపారులకు ఆశాజనకం. బెట్టింగ్లకు పాల్పడవద్దు.
ధృఢసంకల్పంతో కార్యసిద్ధికి శ్రమించండి. మీ కష్టం వృధాకాదు. త్వరలో సంతోషకరమైన వార్తలు వింటారు. ఇంటి విషయాలు పట్టించుకోండి. ఆదాయం సంతృప్తికరం. విలాసాలు, వినోదాలకు విపరీతంగా ఖర్చు చేస్తారు. కొన్ని పనులు ఆకస్మికంగా పూర్తవుతాయి. శనివారం నాడు నగదు డ్రా చేసేటపుడు జాగ్రత్త. చుట్టుపక్కల వారిని ఓ కంట కనిపెట్టండి. సంతానం విషయంలో శుభపరిణామాలున్నాయి. ఆహ్వానం, పత్రాలు అందుకుంటారు. ఫోన్ సందేశాలు పట్టించుకోవద్దు. గృహమార్పు కలిసివస్తుంది. ఆప్తులతో ఉల్లాసంగా గడుపుతారు. సేవా, సాంకేతిక రంగాల వారికి సదావకాశాలు లభిస్తాయి. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఆటుపోట్లను అధిగమిస్తారు. తాత్కాలిక వ్యాపారుల ఆదాయం బాగుంటుంది. రిటైర్డు ఉద్యోగస్తులకు ఆత్మీయ వీడ్కోలు పలుకుతారు.
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
సత్ఫలితాలు గోచరిస్తున్నాయి. మనోధైర్యంతో ముందుకు సాగండి. సాయం ఆశించవద్దు. స్వయంకృషితోనే కార్యం సాధిస్తారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు నెరవేరుతాయి. ఆరోగ్యం బాగుంటుంది. ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు. కొంతమొత్తం ధనం అందుతుంది. పొదుపు పథకాల పట్ల ఆకర్షితులవుతారు. ప్రభుత్వ సంస్థల్లోనే మదుపు చేయండి. వినోదాలు, విలాసాలకు విపరీతంగా ఖర్చుచేస్తారు. సోమ, మంగళవారాల్లో అప్రమత్తంగా ఉండాలి. పరిచయం లేని వారితో జాగ్రత్త. ముఖ్యమైన వివరాలు గోప్యంగా ఉండండి. వివాహయత్నం ఫలిస్తుంది. అవతలి వారి తాహతుకు తగ్గట్టు మెలగండి. ఉద్యోగ బాధ్యతలను సమర్ధంగా నిర్వహిస్తారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. వ్యాపారాల్లో లాభాలు గడిస్తారు. నూతన వ్యాపారాలు కలిసివస్తాయి.