పరిస్థితులు క్రమంగా మెరుగుపడతాయి. ఆదాయం సంతృప్తికరం. ప్రణాళికలు వేసుకుంటారు. అంచనాలు ఫలిస్తాయి. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. బంగారం, వెండి వస్తువులు కొనుగోలు చేస్తారు. పత్రాలు జాగ్రత్త. ఆప్తులను విందులకు ఆహ్వానిస్తారు. సంప్రదింపులకు అనుకూలం. ఏకపక్ష నిర్ణయాలు తగవు. మీ శ్రీమతి సలహా పాటించండి. శని, ఆదివారాల్లో పనులు హడావుడిగా సాగుతాయి. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఆశించిన సంబంధం నిరుత్సాహపరుస్తుంది. ఓర్పుతో వ్యవహరించండి. ఏది జరిగినా ఒకందుకు మంచిదే. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఉద్యోగ బాధ్యతల్లో తప్పులు దొర్లే ఆస్కారం ఉంది. సహోద్యోగుల సాయంతో ఒక సమస్య సద్దుమణుగుతుంది. గృహంలో మార్పు చేర్పులకు అనుకూలం. సంతానం విషయంలో శుభ ఫలితాలున్నాయి.
ఈ వారం అనుకూలమే. వాగ్దాటితో రాణిస్తారు. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. వేడుకకు సన్నాహాలు సాగిస్తారు. ఖర్చులు విపరీతం. డబ్బుకు ఇబ్బంది ఉండదు. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఒక వ్యవహారంలో జోక్యం చేసుకోవలసి వస్తుంది. మీ సలహా ఉభయులకూ ఆమోదయోగ్యమవుతుంది. పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి. సంతానం దూకుడు అదుపు చేయండి. కీలక పత్రాలు అందుకుంటారు. శుభకార్యం నిశ్చయమవుతుంది. వేదికలు అన్వేషిస్తారు. గృహం సందడిగా ఉంటుంది. నిరుద్యోగులకు సదావకాశాలు లభిస్తాయి. వృత్తుల వారికి ఆదాయాభివృద్ధి. ప్రైవేట్ సంస్థల ఉద్యోగస్తులకు ఓర్పు ప్రధానం. వ్యాపారాల్లో ఒడిదుడుకులను అధిగమిస్తారు. సరుకు నిల్వలో జాగ్రత్త. స్థల వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి.
ఆదాయం సంతృప్తికరం. ఖర్చులు అదుపులో ఉండవు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. పనులు హడావుడిగా సాగుతాయి. దంపతులకు కొత్త ఆలోచనలు వస్తాయి. వేడుకకు సన్నాహాలు సాగిస్తారు. బంధుమిత్రుల రాకపోకలు అధికమవుతాయి. స్త్రీలకు ఒత్తిడి, శ్రమ అధికం. సంతానానికి ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. ప్రకటనలను నమ్మవద్దు. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. సన్నిహితుల సలహా పాటించండి. ఒక ఆహ్వానం ఉత్సాహాన్నిస్తుంది. ఆరోగ్యం సంతృప్తికరం. వ్యాపకాలు అధికమవుతాయి. సంతానం ఉన్నత చదువులపై దృష్టి పెడతారు. చేతివృత్తులు, కార్మికులకు ఆశాజనకం. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులుండవు, చిరు వ్యాపారులకు ఆశాజనకం, ఉపాధి పథకాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. వాహనం ఇతరులకివ్వవద్దు.
కర్కాటకం : పునర్వసు 4వ పాదము, పుష్యమి, ఆశ్లేష 1, 2, 3, 4 పాదములు
అనుకూలతలు నెలకొంటాయి. ఉల్లాసంగా గడుపుతారు. ఆదాయం బాగుంటుంది. ఖర్చులు భారమనిపించవు. ఖరీదైన సామగ్రి కొనుగోలు చేస్తారు. అందరితో సత్సంబంధాలు నెలకొంటాయి. సన్నిహితులను విందులకు ఆహ్వానిస్తారు. మీ ప్రమేయంతో ఒకరికి సదావకాశం లభిస్తుంది. సోమ, మంగళవారాల్లో పనుల్లో ఒత్తిడి, శ్రమ అధికం. శకునాలు పట్టించుకోవద్దు. మనోధైర్యంతో మెలగండి. ఆత్మీయుల ఆహ్వానం ఉత్సాహపరుస్తుంది. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. సంతానం వైఖరి ఇబ్బంది కలిగిస్తుంది. పాత పరిచయస్తులు తారసపడతారు. గత సంఘటనలు అనుభూతినిస్తాయి. క్యాటరింగ్ రంగాల వారికి ఆదాయాభివృద్ధి. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. నూతన పెట్టుబడులకు అనుకూలం. ఉద్యోగస్తులకు అధికారులతో సమస్యలెదురవుతాయి.
సింహం : మఖ, పుబ్బ 1, 2, 3, 4, పాదములు, ఉత్తర 1వ పాదము
పరిస్థితులు అనుకూలిస్తాయి. రావలసిన ధనం అందుతుంది. ప్రణాళికలు వేసుకుంటారు. అంచనాలు ఫలిస్తాయి. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. కొత్త పరిచయాలేర్పడతాయి. పత్రాలు ఆహ్వానం అందుకుంటారు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. బుధవారం నాడు అప్రమత్తంగా ఉండాలి. ఫోన్ సందేశాలను నమ్మవద్దు. బ్యాంకు వివరాలు గోప్యంగా ఉంచండి. ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు. వాయిదా పడిన పనులు ఎట్టకేలకు పూర్తవుతాయి. ఆరోగ్యం కుదుటపడుతుంది. సంతానం ఉన్నత చదువులపై దృష్టి పెట్టండి. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. అధికారులతో కొత్త సమస్యలెదురవుతాయి. వృత్తి ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. నష్టాలను భర్తీ చేసుకుంటారు. ఎరువుల వ్యాపారులకు కష్టకాలం.
ఆదాయానికి లోటుండదు. ధైర్యంగా వ్యవహరిస్తారు. ఖర్చులు అధికం. వేడుకలకు విపరీతంగా వ్యయం చేస్తారు. బంధువుల రాకపోకలు అధికమవుతాయి. గృహం సందడిగా ఉంటుంది. పనులు హడావడిగా సాగుతాయి. గురు, శుక్రవారాల్లో విలువైన వస్తువులు జాగ్రత్త. కొత్త వ్యక్తులను ఓ కంట కనిపెట్టండి. బాధ్యతలు అప్పగించవద్దు. మీ శ్రీమతికి అన్ని విషయాలు తెలియజేయండి. పత్రాల రెన్యువల్లో అలక్ష్యం తగదు. శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు అనుకూలం. ప్రముఖులతో పరిచయాలే బలపడతాయి. ఉద్యోగస్తులకు శుభవార్తా శ్రవణం. రిటైర్డు ఉద్యోగస్తులకు వీడ్కోలు పలుకుతారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు ఏమంత సంతృప్తినీయవు, బంగారం, వెండి వ్యాపారులకు ఆదాయాభివృద్ధి. చిన్న వ్యాపారులకు ఆశాజనకం. దైవకార్యంలో పాల్గొంటారు.
ఆర్థికంగా ఫర్వాలేదనిపిస్తుంది. ఖర్చులు భారమనిపించవు. రుణ ఒత్తిళ్లు తొలగుతాయి. సావకాశంగా పనులు పూర్తి చేస్తారు. ఆత్మీయుల ఆహ్వానం ఉత్సాహాన్నిస్తుంది. సంప్రదింపులు కొత్త మలుపు తిరుగుతాయి. ఆలోచనల్లో మార్పు వస్తుంది. ఆది, శనివారాల్లో అనుకోని సంఘటనలెదురవుతాయి. సంతానం దూకుడు అదుపు చేయండి. దంపతులకు కొత్త ఆలోచనలు వస్తాయి. చాకచక్యంగా వ్యవహరిస్తారు. వివాదాలు సద్దుమణుగుతాయి. ఆరోగ్యం మందగిస్తుంది. వైద్యసేవలు అవసరమవుతాయి. గృహమార్పు ఫలితం త్వరలో కనిపిస్తుంది. ఉద్యోగస్తుల సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. వృత్తి ఉపాధి పథకాలు సంతృప్తినిస్తాయి. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ఉమ్మడి వ్యాపారాలకు అనుకూలం. వేడుకల్లో అందరినీ ఆకట్టుకుంటారు.
వృశ్చికం : విశాఖ 4వ పాదము. అనూరాధ, జ్యేష్ఠ 1,2,3,4 పాదములు
సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. అందరితో సత్సంబంధాలు నెలకొంటాయి. సభ్యత్వాలు స్వీకరిస్తారు. వ్యతిరేకులతో జాగ్రత్త. ఎదుటివారి ఆంతర్యం గ్రహించండి. ఎవరినీ తక్కువ అంచనా వేయొద్దు. మంగళ, బుధవారాల్లో ఖర్చులు అదుపులో ఉండవు. మీ ఉన్నతిని చాటుకోవటానికి విపరీతంగా వ్యయం చేస్తారు. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. దాంపత్య సౌఖ్యం, ప్రశాంతత పొందుతారు. మీ శ్రీమతి ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆప్తులను విందులకు ఆహ్వానిస్తారు. సంతానం ఉత్సాహాన్నిస్తుంది. ఆపన్నులకు సాయం అందిస్తారు. వ్యాపారాభివృద్ధికి చేపట్టిన పథకాలు సత్ఫలితాలిస్తాయి. నూతన వ్యాపారాలకు అనుకూలం. ప్రైవేట్ సంస్థల ఉద్యోగస్తులకు కష్టకాలం. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. తీర్థయాత్రలకు సన్నాహాలు సాగిస్తారు.
ధనస్సు : మూల, పూర్వాషాడ 1234 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదము
ప్రతికూలతలు అధికం. ఆచితూచి వ్యవహరించాలి. ధనం మంచినీరు వలే ఖర్చవుతుంది. చేతిలో ధనం నిలవదు. పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి. గృహంలో స్తబ్దత నెలకొంటుంది. ఆత్మీయుల కలయికతో కుదుటపడతారు. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. పట్టుదలతో యత్నాలు సాగిస్తారు. పనులు త్వరితగతిన పూర్తవుతాయి. అది, గురువారాల్లో బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. పరిచయస్తులే మోసగించే ఆస్కారం ఉంది. సంతానం విషయంలో శుభపరిణామాలున్నాయి. ఆహ్వానం అందుకుంటారు. నిర్మాణాలు మందకొడిగా సాగుతాయి. బిల్డర్లు, కార్మికులకు కష్టకాలం. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. హోల్ సేల్ వ్యాపారులకు ఆశాజనకం. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం. వైద్య, సేవ, సాంకేతిక రంగాల వారికి ఆదాయాభివృద్ధి.
కొత్త యత్నాలు ప్రారంభిస్తారు. అవకాశాలు చేజారిపోతాయి. మీ సమర్ధత మరొకరికి కలిసివస్తుంది. నిస్తేజానికి లోనవుతారు. ఖర్చులు విపరీతం. రుణాలు, చేబదుళ్లు స్వీకరిస్తారు. ఆత్మీయులతో సంభాషణ ఉపశమనం కలిగిస్తుంది. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. అర్థాంతంగా నిలిపివేసిన పనులు పూర్తి చేస్తారు. శుక్ర, శనివారాల్లో ప్రముఖుల సందర్శనం వీలుపడదు. కార్య క్రమాలు వాయిదా వేసుకుంటారు. సంతానానికి ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. వాస్తుదోష నివారణ చర్యలు చేపడతారు. ఉపాధి పథకాలు సంతృప్తినిస్తాయి. వ్యాపారాభివృద్ధికి మరింత శ్రమించాలి. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. సరుకు నిల్వలో జాగ్రత్త. ఉద్యోగస్తులకు ధనప్రలోభం తగదు. కొత్త వ్యక్తులతో జాగ్రత్త. పత్రాల రెన్యువల్లో మెలకువ వహించండి. విందులకు హాజరవుతారు.
ఆర్థికస్థితి నిరాశాజనకం. ఖర్చులు అదుపులో ఉండవు. ఖరీదైన వస్తువులు కొనుగోలు చేస్తారు. రశీదులు, పత్రాలు జాగ్రత్త. సంప్రదింపులు నిరుత్సాహపరుస్తాయి. ముఖ్యుల కలయిక వీలుపడదు. ఆది, సోమవారాల్లో పనులు మందకొడిగా సాగుతాయి. ఆత్మీయుల ఆహ్వానం ఉత్సాహాన్నిస్తుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. సమర్థతకు నిదానంగా గుర్తింపు లభిస్తుంది. సంతానం భవిష్యత్తుపై దృష్టి పెడతారు. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. ఆరోగ్యం బాగుంటుంది. సన్నిహితులను విందులకు ఆహ్వానిస్తారు. మీ సిఫార్సుతో ఒకరికి ఉద్యోగావకాశం లభిస్తుంది. మార్కెట్ రంగాల వారికి ఒత్తిడి అధికం. ఉద్యోగస్తులకు ఏకాగ్రత, సమయపాలన ప్రధానం. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఆటుపోట్లను తట్టుకుంటారు. వృత్తుల వారికి సామాన్యం.
వ్యవహారజయం, ధనలాభం ఉన్నాయి. మాటతీరు ఆకట్టుకుంటుంది. కొత్త పరిచయాలేర్పడతాయి. వ్యాపకాలు సృష్టించుకుంటారు. బంధువుల రాకపోకలు అధికమవుతాయి. గృహం సందడిగా ఉంటుంది. ఆప్తులకు వివాహ సమాచారం అందిస్తారు. పనులు వేగవంతమవుతాయి. మంగళ, బుధవారాల్లో దుబారా ఖర్చులు అధికం. మీ ఉన్నతిని చాటుకోవటానికి విపరీతంగా వ్యయం చేస్తారు. కావలసిన పత్రాలు సమయానికి కనిపించవు. ప్రతి చిన్న విషయానికి అసహనం చెందుతారు. మితంగా ఉండటానికి యత్నించండి. సంతానం విషయంలో శుభఫలితాలున్నాయి. ప్రారంభోత్సవాలకు అనుకూలం. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. ఉమ్మడి వ్యాపారాలు కలిసివస్తాయి. ఉద్యోగ బాధ్యతల్లో మెలకువ వహించండి. దైవకార్యాల్లో పాల్గొంటారు.