డయల్ బిఫోర్ యు డిగ్ అని కోరుతున్న థింక్ గ్యాస్

ఐవీఆర్

శనివారం, 18 అక్టోబరు 2025 (20:23 IST)
హిందూపూర్: థింక్ గ్యాస్... గతంలో AG-P ప్రథమ్ అని పిలిచేవారు. థింక్ గ్యాస్ వేసిన సిటీ గ్యాస్ సరఫరా పైప్ లైన్, ఇటీవల హిందూపూర్ లోని వేమన సర్కిల్‌, హిందూపూర్ బైపాస్ రోడ్‌లో ఎలాంటి సమాచారం ఇవ్వకుండా డ్రైనేజీ నిర్మాణం కోసం జెసిబితో చేసిన తవ్వకం పనిలో దెబ్బతినడంతో కొంతసేపు గ్యాస్ సరఫరాలో అంతరాయం కలిగింది. థింక్ గ్యాస్ అత్యవసర ప్రతిస్పందన బృందం వెంటనే చర్యలు తీసుకోవటంతో పాటుగా ప్రభావిత భాగాన్ని వేరుచేసి తక్కువ సమయంలోనే గ్యాస్ సరఫరాను పునరుద్ధరించడం ద్వారా ప్రజల భద్రతను నిర్ధారించింది, నివాసితులకు అసౌకర్యాన్ని తగ్గించింది.
 
గృహాలకు పైప్డ్ నేచురల్ గ్యాస్, రవాణా వినియోగదారులకు కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్(సీఎన్జీ) సరఫరా చేయడానికి శ్రీ సత్యసాయి జిల్లాలో విస్తృత స్థాయిలో పైప్‌లైన్ మౌలిక సదుపాయాలను థింక్ గ్యాస్ ఏర్పాటు చేసింది. పైప్‌లైన్ మార్గంలో కనిపించే రీతిలో రూట్ మార్కర్లు, హెచ్చరిక సంకేతాలు, అత్యవసర కాంటాక్ట్ బోర్డులు ఉన్నప్పటికీ, తవ్వకంలో పాల్గొన్న కాంట్రాక్టర్ పనిని ప్రారంభించే ముందు థింక్ గ్యాస్‌కు తెలియజేయడంలో విఫలమయ్యాడు. సంఘటన తర్వాత ఎటువంటి నివేదికనూ సమర్పించలేదు.
 
ప్రభుత్వ నిబంధనల ప్రకారం, తవ్వకం పనులు చేపట్టాలని ప్రణాళిక చేస్తున్న తృతీయ పక్షం ఏదైనా డయల్ బిఫోర్ యు డిగ్ కాంటాక్ట్ నంబర్ ద్వారా నగర మున్సిపల్ అధికారులకు లేదా నగర గ్యాస్ పంపిణీ సంస్థకు తెలియజేయాలి. ఈ సంఘటన, కంపెనీకి ముందస్తు సమాచారం లేకుండానే జరిగింది. ఈ కారణం చేతనే సంబంధిత పార్టీపై అధికారిక ఫిర్యాదును థింక్ గ్యాస్ చేసింది. ప్రస్తుత చట్టపరమైన నిబంధనలకు లోబడి, ఐపీసీ సెక్షన్లు 285, 336 ప్రకారం ఎలాంటి సమాచారం అందించకుండా అనధికారికంగా తవ్వడం, నష్టం కలిగించడం అనేవి 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష మరియు రూ. 25 కోట్ల వరకు జరిమానా విధించదగిన నేరం.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు