ఆంధ్ర ప్రదేశ్ ఉద్యోగులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీపావళి కానుక ప్రకటించారు. ఉద్యోగులకు ఒక డీఏ ఇవ్వాలని నిర్ణయించారు. నవంబర్ 1 నుంచి డీఏ జమ అవుతుంది. ఒక డీఏ ఇచ్చేందుకు ప్రభుత్వానికి నెలకు రూ.160 కోట్లు ఖర్చు అవుతుందని ఆయన వెల్లడించారు. పోలీసులకు 1 సరెండర్ లీవ్ క్లియర్ చేస్తున్నట్లు తెలిపారు. 2 విడతల్లో చెల్లింపు చేస్తామని పేర్కొన్నారు. ఇందుకుగాను రూ.210 కోట్లు ఖర్చవుతుందని వెల్లడించారు.