శ్రీరాముడు అందరివాడు.. అమెరికాలో ప్రత్యేక పూజలు.. రాముడి త్రీడీ చిత్రాలు

మంగళవారం, 4 ఆగస్టు 2020 (20:06 IST)
Lord Rama
రాముడు అందరివాడు... అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి బుధవారం భూమి పూజ జరుగనుంది. ఈ సందర్భంగా రామ భక్తులంతా.. పండుగ చేసుకుంటున్నారు. అయోధ్యలో ఇప్పుడే పండగ వాతావరణం నెలకొంది. అలాగే ప్రపంచ దేశాల్లోని హిందువులు రాముడి కోసం ప్రత్యేక పూజలు చేసుకుంటున్నారు. 
 
ఈ క్రమంలో అయోధ్యలో బుధవారం జరుగనున్న రామమందిరం భూమిపూజ కార్యక్రమాన్ని పురస్కరించుకొని అమెరికాలోని అన్ని హిందూ దేవాలయాల్లో ప్రత్యేక పూజలు, ప్రార్థనలు నిర్వహించనున్నారు. కోట్ల మంది ప్రజల విశ్వాసానికి ఈ రామాలయం ప్రతీక అని, అమెరికా అంతటా వర్చువల్‌ ప్రార్థనలు నిర్వహించాలని ఇండో అమెరికన్‌ హిందూ నాయకులు పిలుపునిచ్చారు.
 
ఇందులో భాగంగా మంగళవారం రాత్రి అమెరికా రాజధాని వాషింగ్టన్‌ నగర వీధులతో సహా అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌ వద్ద రాముడి చిత్రాలను, మందిర చిత్రాలను పెద్దపెద్ద ఎల్‌ఈడీ తెరలపై ప్రదర్శించనున్నారు. శంకుస్థాపన జరిగే ఆగస్టు 5న న్యూయార్క్‌లోని ప్రఖ్యాత టైమ్స్‌ స్క్వేర్‌లోని బాహ్య తెరలపై రాముడి త్రీడీ చిత్రాలను ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకుగాను 17 వేల చదరపు అడుగుల బాహ్య తెరలను లీజుకు తీసుకున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు