చాలా మంది అధిక బరువుతో బాధపడుతుంటారు. ఈ శరీర బరువును తగ్గించుకునేందుకు నానా తంటాలు పడుతుంటారు. ముఖ్యంగా, ఉదయాన్నే నిద్రలేచి కిలోమీటర్లు కిలోమీటర్లు రన్నింగ్ చేస్తుంటారు. ఇలాంటి అలోవెరా (కలబంద) జ్యూస్ లేదా గుజ్జును క్రమం తప్పకుండా ప్రతి రోజూ ఉదయం సేవిస్తే ప్రయోజనం ఉంటుందని ఆయుర్వేద వైద్య నిపుణులు చెపుతున్నారు.
కలబంద జ్యూస్‌లో ఫైటోస్టెరోల్స్, విసిరల్ ఫ్యాట్స్ అధికంగా ఉంటాయి. ఇవి శరీరం లోపల, బయట, అవయవాల చుట్టూ ఏర్పడే కొవ్వును కరిగిస్తాయి. కలబంద రసంలో ఉండే ఫైటోస్టెరోల్స్ అంతర్గతంగా జీవక్రియ రేటును రెట్టింపు చేస్తాయి. ఫలితంగా శరీరంలో ఉండే అదనపు కొవ్వు పదార్థాలు ఈ జీవక్రియలో వినియోగించబడతాయి. దీంతో కొవ్వు కరిగి శరీర బరువు తగ్గుతుంది.
ప్రతి రోజూ ఒక కప్పు వేడి నీటిలో ఒక టీస్పూన్ కలబంద రసం, ఒక టీస్పూన్ అల్లం రసం కలిపి ఉదయాన్నే పరగడుపున తాగాలి. దీంతో అతి తక్కువ సమయంలోనే బరువు తగ్గవచ్చు. ఇలాచేయడం వల్ల అధిక బరువును తగ్గించుకుని శరీరాకృతిని అందంగా మార్చుకోవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు.
అంతేకాకుండా, జీర్ణసమస్యలు, డయాబెటీస్‌కు చెక్ పెట్టొచ్చు. గ్యాస్, అసిడిటీ, మలబద్ధకం వంటి సమస్యలు పూర్తిగా దూరమవుతాయి. రక్తంలో గ్లూకోజ్ స్థాయి అదుపులో ఉంటుంది. రక్తసరఫరాను మెరుగుపరుస్తుంది. కేన్సర్ కణాలను నశింపజేస్తుంది. చర్మం కాంతివంతంగా మృదువుగా తయారవుతుంది. టూత్ పేస్టుతో కలిపి దంతాలు తోముకుంటే చిగుళ్ళ బాధల నుంచి విముక్తి పొందవచ్చు.