మునగలో ఔషధాలెక్కువ. మునగాకును వారానికి రెండుసార్లు ఆహారంలో చేర్చుకోవడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. మునగాకు రసం రక్తపోటును నియంత్రిస్తుంది. మానసిక ఒత్తిడిని నయం చేస్తుంది. వారానికి రెండుసార్లు మునగాకును ఆహారంలో చేర్చుకుంటే.. వైద్యుల వద్దకు వెళ్ళాల్సిన పనే ఉండదు. మధుమేహవ్యాధిగ్రస్థులకు మునగాకు దివ్యౌషధంగా పనిచేస్తుంది. శరీరానికి కావలసిన 20 అమినో యాసిడ్లు ఈ మునగాకులో 18 వున్నాయి. విటమిన్-ఎ, సిలతో పాటు పొటాషియం ఇందులో వున్నాయి.
పిడికెడు మునగాకును ఒక టీ స్పూన్ నేతిలో వేయించి.. మిరియాలు, జీలకర్ర పొడి చేర్చి రోజూ ఉదయం వేడి వేడిగా ఉన్న అన్నంలో కలిపి తీసుకుంటే హిమోగ్లోబిన్ శాతం పలురెట్లు పెరుగుతుంది. సంతానలేమికి కూడా మునగాకు దివ్యౌషధంగా పనిచేస్తుంది. నరాలకు బలాన్నిస్తుంది.
పెరుగులో ఉన్న పీచు, ఆరెంజ్‌లో ఉన్న పోషకాల కంటే ఏడింతలు మునగాకులో పోషకాలు పుష్కలంగా వున్నాయని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. ఇతర ఆకుకూరల్లో ఎండితే పోషకాలు మాయమవుతాయి. కానీ మునగాకు ఎండినా అందులోని పోషకాలు మాత్రం పదిలంగా వుంటాయని వారు చెప్తున్నారు.