అనంతరం డైరెక్టర్ విక్రాంత్ రుద్ర మాట్లాడుతూ, నేను 12 ఏళ్ల పిల్లాడిగా ఉన్నప్పుడు ఒక పర్సన్ ని కలిసాను. ఆ పర్సన్ పేరు అర్జున్ చక్రవర్తి. ఆయన దగ్గర నేను కబడ్డీ ట్రైనింగ్ కోసం వెళ్ళినప్పుడు ఆయన ఒక కథ చెప్పారు. అది నా మనసులో నాటుపోయింది. ఆ కథని ఎలాగైనా ప్రపంచానికి చెప్పాలని భావించా. అలా ఈ కథ నేను డైరెక్టర్ కావడానికి డ్రైవ్ చేసింది. నిర్మాత శ్రీని గారికి కథ చెప్పిన తర్వాత ఆయనకి నచ్చింది. వెంటనే ఓకే చెప్పారు.
ఈ సినిమాని 120 లొకేషన్స్ లో షూట్ చేశాం. మా హీరో విజయ్ ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. డిఓపి జగదీష్ ఈ సినిమా కోసం ప్రాణం పెట్టి పనిచేసాడు. మేము అనుకున్నది తీయడానికి ఎంతకైనా సాహసించారు. సినిమాలో మ్యూజిక్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ లో ఉంటుంది. మా హీరోయిన్ సిజ్జా రోజ్ చాలా హార్డ్ వర్క్ చేసింది. సినిమా కోసం తెలుగు కూడా నేర్చుకుంది. ఈ సినిమా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో ఉంటుంది. ఇది నా ప్రామిస్'అన్నారు.
హీరో విజయరామరాజు మాట్లాడుతూ, మ్యూజిక్. విజువల్స్ ఇవన్నీ కూడా నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయి. హీరోయిన్ సిజ్జా ఈ సినిమా కోసం చాలా హార్డ్ వర్క్ చేసింది. నేను ఏడాదిన్నర పాటు ప్రో కబడ్డీ టీమ్స్ తో ట్రావెల్ అయ్యి రియల్ గా గేమ్ నేర్చుకుని ఈ సినిమా చేయడం జరిగింది. బాడీ ట్రాన్స్ఫర్మేషన్ కోసం సిక్స్ ప్యాక్ చేయాల్సి వచ్చింది. నా జీవితంలో గుర్తుండిపోయే సినిమా ఇది. ఇంత మచి క్యారెక్టర్ ఉన్న సినిమా రావడం చాలా అరుదు అన్నారు